‘యాత్ర 2’ ట్విటర్‌ రివ్యూ | Sakshi
Sakshi News home page

Yatra 2 Twitter Review: ‘యాత్ర 2’ టాక్‌ ఎలా ఉందంటే..

Published Thu, Feb 8 2024 7:02 AM

Yatra 2 Movie Twitter Review In Telugu - Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’. వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్‌. ఇందులో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేశాయి. 

(చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!)

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు(ఫిబ్రవరి 8) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? వైఎస్‌ జగన్‌గా జీవా ఎలా నటించాడు? తదితర విషయాలు  ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

యాత్ర 2 చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్‌ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్‌ బయోపిక్‌ అని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్‌ ఎక్స్‌లో కామెంట్‌ చేస్తున్నారు. 

‘యాత్ర 2’ బెస్ట్‌ బయోపిక్‌. సినిమా స్టార్టింగ్‌ నుంచే గూస్‌ బంప్స్‌ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్‌. ఇంతకు ముందు జగన్‌పై కొంచెం ద్వేషం ఉండే..సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్‌ జగన్‌ని ద్వేషించేవారికి కూడా గూస్‌ బంప్స్‌ వచ్చే మూమెంట్స్‌ ఉన్నాయంటూ ఓ నెటిజన్‌ 4/5 రేటింగ్‌ ఇచ్చాడు. 

Honestly chepthuna one of the best biopics ever made in Telugu #Yatra2 🔥🔥🔥🔥 Blockbuster movie 👌🏻👌🏻👌🏻#Yatra2 Bomma Blockbuster 🔥💙#YSJaganAgain @ysjagan @JiivaOfficial @mammukka pic.twitter.com/YhYNZnV46B

నిజాయితీగా చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్‌ బయోపిక్‌. బ్లాక్‌ బస్టర్‌ మూవీ. బొమ్మ అదిరింది అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్‌లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్‌సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement