అర్జున్ అంబటి హీరోగా 'పరమపద సోపానం'.. క్రేజీ సాంగ్‌ వచ్చేసింది! | Arjun Ambati Latest Movie Paramapada Sopanam Lyrical Song Released, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

Paramapada Sopanam Movie: అర్జున్ అంబటి హీరోగా 'పరమపద సోపానం'.. బూమ్ బూమ్ సాంగ్‌ రిలీజ్!

May 30 2025 9:31 PM | Updated on May 31 2025 3:25 PM

Arjun Ambati Latest Movie Paramapada Sopanam lyrical song released

బిగ్‌బాస్‌ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం పరమపద సోపానం'. ఈ చిత్రంలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో ఎస్.ఎస్.మీడియా బ్యానర్‌లో  గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి నాగ శివ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మూవీ నుంచి 'భూమ్ భూమ్' అంటూ సాగే రెండో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను గీతా మాధురి ఆలపించారు.  రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. కాగా.. ఇప్పటికే  ఈ సినిమాలోని 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  ప్రమోషన్లలో భాగంగా రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్లలో సందడి చేయనుంది.

గీతా మాధురి మాట్లాడుతూ.. " పరమపద సోపానంలో 'భూమ్ భూమ్' అనే పాటని పాడాను. నాగ శివ పూరి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మనముందుకు 'పరమపద సోపానం'ని తీసుకొస్తున్నారు. ఈ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్" అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement