టీవీల్లో పుష్పరాజ్‌.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే? | Allu Arjun Pushpa 2 Is Set To Have Its Television Premiere On This Date, Check Interesting Details Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: టీవీల్లో పుష్ప-2.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే?

May 30 2025 9:13 PM | Updated on May 31 2025 3:34 PM

Allu Arjun Pushpa 2 is set to have its television premiere on this date

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్‌ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం దంగల్‌ మూవీ రికార్డ్‌ను మాత్రమే అధిగమించలేకపోయింది. ఇటీవల ఈ మూవీలో నటనకు గానూ అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్‌ వరించింది.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. జనవరి 30 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో బుల్లితెరపై కూడా సందడి చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత టీవీల్లోనూ పుష్ప-2 ప్రసారమైంది.

తాజాగా హిందీ ప్రేక్షకులను కూడా టీవీల్లో అలరించనున్నారు పుష్పరాజ్. ఈనెల 31 వ తేదీన జీ సినిమాలో ప్రసారం చేయనున్నట్లు పుష్పటీమ్ వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జీ సినిమాలో ప్రసారం కానున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. మొదటిసారి బుల్లితెరపై పుష్పరాజ్‌ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో టీవీల్లో పుష్ప-2 వీక్షించేందుకు బాలీవుడ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement