పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో... | Mammootty and Mohanlal reuniting after 10 years | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో...

Sep 18 2024 5:46 AM | Updated on Sep 18 2024 5:46 AM

Mammootty and Mohanlal reuniting after 10 years

మలయాళ సినీ పరిశ్రమలో దిగ్గజ హీరోలైన మమ్ముట్టి, మోహన్‌ లాల్‌ దశాబ్దం తర్వాత మళ్లీ కలిసి నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్నారు. మహేశ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. మమ్ముట్టి కంపెనీ, ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నాయి. 30 రోజుల పాటు శ్రీలంకలో ఈ చిత్రాన్ని షూట్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మూవీ స్టోరీలైన్‌కి తగ్గట్టు షూటింగ్‌ లొకేషన్‌ పర్మిషన్‌ కోసం నిర్మాతలు శ్రీలంక ప్రధానమంత్రితో కూడా చర్చలు జరిపినట్టు కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ శాతం షూటింగ్‌ శ్రీలంకలోనూ మిగతాది కేరళ, ఢిల్లీ, లండన్‌లోనూ జరిపేలా ప్లాన్‌ చేస్తున్నారు. మమ్ముట్టి, మోహల్‌ లాల్‌ కాంబినేషన్‌ కావడంతో ఫ్యాన్స్‌ అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నారు దర్శకుడు మహేశ్‌ నారాయణ్‌. 50 చిత్రాల్లో భిన్న పాత్రల్లో కలిసి నటించి, ప్రేక్షకులను మెప్పించిన మమ్ముట్టి, మోహన్‌లాల్‌ చివరిగా 2013లో ‘కాథల్‌ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో సిల్వర్‌ స్క్రీన్‌ను షేర్‌ చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement