అఖిల్ ‘ఏజెంట్‌’లో మలయాళ స్టార్‌ హీరో! | Sakshi
Sakshi News home page

అఖిల్ ‘ఏజెంట్‌’లో మలయాళ స్టార్‌ హీరో!

Published Sat, Oct 23 2021 12:42 PM

Mammootty To Play Key Role In Akhil Akkineni Agent Movie - Sakshi

ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. పుష్పలో ఫాహద్ ఫాజిల్ విలర్ రోల్ చేస్తున్నాడు. అలాగే సలార్ లో మరో మలయాళ నటుడు పృథ్విరాజ్ కీరోల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు బ్యాచ్ లర్ కొత్త చిత్రం ఏజెంట్ లోనూ మాలీవుడ్ సూపర్ స్టార్ అడుగు పెట్టబోతున్నారట.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్‌తో దసరా హీరోగా మారాడు అఖిల్.ఇప్పుడు నెక్ట్స్ మూవీని బ్యాచ్‌లర్‌ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఏజెంట్ లోమాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మమ్ముట్టి చిత్రాలు చేశాడు. రీసెంట్‌గా వైఎస్సార్‌ బయోపిక్ యాత్ర లో మహానేతగా మెప్పించారు.ప్రస్తుతం మాలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మమ్ముట్టి. ఈ దశలో మాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ వరకు వచ్చి అఖిల్ మూవీలో కీరోల్ చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement