
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలను చూడగానే మమ్ముట్టి మనసు గతంలోకి వెళ్లిపోయింది. అప్పట్లో ఆయనకున్న హాబీల్లో ‘ఫొటోగ్రఫీ’ ఒకటి. ఈ లాక్‌డౌన్ వేళ అది గుర్తొచ్చింది. అంతే.. కెమెరా తీశారు. తన ఇంటి గార్డెన్‌లో తీగ మీద సేద తీరుతున్న పక్షులను క్లిక్‌మనిపించారు. ‘‘ఉషోదయపు అతిథులు (పక్షులను ఉద్దేశించి), ఫొటోగ్రఫీ.. నా పాత హాబీ’’ అంటూ తాను తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మమ్ముట్టి. ఆ ఫొటోలను చూసి, ‘ఫొటోగ్రఫీలో మీకు చాలా నైపుణ్యం ఉంది సారూ. భలే ఉన్నాయి’’ అని నెటిజన్లు ప్రశంసించారు.