తెలుగులోనూ బ్లాక్ అండ్ వైట్ హారర్‌ థ్రిల్లర్‌.. రిలీజ్ ఎప్పుడంటే? | Mammootty Latest Movie Bramayugam Telugu Version Gets A Release This Date - Sakshi
Sakshi News home page

Mammootty: టాలీవుడ్‌ రిలీజ్‌కు సరికొత్త హారర్‌ థ్రిల్లర్‌.. ఎప్పుడంటే?

Published Mon, Feb 19 2024 5:59 PM

Mammootty Latest Movie Bramayugam Released In Telugu On This Date - Sakshi

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం భ్రమయుగం. మలయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం తెరకెక్కించారు. సరికొత్త పీరియాడిక్ హారర్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందించిన ఈ మూవీపై టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆస‍క్తి నెలకొంది. 

దీంతో తెలుగు వర్షన్‌ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 23న సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో టీజర్‌, ట్రైలర్‌ ‍రిలీజ్‌ కాగా.. ఆడియన్స్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు వర్షన్‌ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని త్వరలోనే కన్నడ, తమిళ, హిందీ భాషల్లోను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం‌ అందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement