గే పాత్రలో మమ్ముట్టి.. సైలెంట్‌గా ఓటీటీలోకి.. | Kaathal The Core Movie Released In OTT, Check For Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Kaathal The Core OTT Release: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళ మెగాస్టార్‌ వివాదాస్పద సినిమా!

Published Thu, Jan 4 2024 11:31 AM

Kaathal The Core Silently Streaming On This OTT Platform - Sakshi

ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందువరుసలో ఉంటాడు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి. ఆరు పదుల వయసులో విభిన్న కథాంశాలను సెలక్ట్‌ చేసుకుంటూ ప్రేక్షక, సినీ ప్రియులను అలరిస్తున్నాడు. ఇటీవల ఈయన నటించిన ప్రయోగాత్మక సినిమా 'కాదల్‌: ది కోర్‌'. జియో బేబి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్‌గా నటించింది. ఇందులో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి(గే)గా కనిపిస్తాడు.

దీంతో విడుదలకు ముందు ఈ సినిమాపై వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా కథ హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా ఉందంటూ కువైట్‌, ఖతార్‌ దేశాలు కాదల్‌: ది కోర్‌ చిత్రాన్ని బ్యాన్‌ చేశాయి. అయితే ఈ విమర్శలను దాటుకుంటూ నవంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది.

తాజాగా ఈ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్‌ ఉంది. ప్రైమ్‌ వీడియోలో అందుబాటులోకి అయితే తెచ్చారు కానీ దీన్ని ఫ్రీగా చూసే వీల్లేదు. ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే! ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన ఓటీటీలో రిలీజ్‌ చేశారు. మరి ఉచితంగా ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో చూడాలి!

చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్‌ చేసుకుంటూ వెళ్లిన వరుడు

Advertisement
Advertisement