సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Recent Hit Crime Thriller Abraham Ozler Movie Released In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Abraham Ozler Movie OTT Release: ఓటీటీకి వచ్చేసిన ఆ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Feb 9 2024 4:09 PM

Recent Hit Crime Thriller Streaming On This Platform - Sakshi

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి అతిథి పాత్ర‌లో న‌టించిన‌ 'అబ్ర‌హం ఓజ్ల‌ర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కించిన ఈ చిత్రంలో జ‌య‌రాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్‌ షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపించారు. గతేడాది డిసెంబర్‌ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. 

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జ‌య‌రాం కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండ‌ర్ జోసెఫ్ అనే సీరియ‌ల్ కిల్ల‌ర్ పాత్ర‌లో మెగాస్టార్ మ‌మ్ముట్టి కనిపించారు. కాగా.. జ‌య‌రాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి.

అబ్ర‌హం ఓజ్ల‌ర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ‌వ్వ‌గా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌చ్చింది. గుంటూరు కారం మూవీలో మ‌హేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగ‌మ‌తి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం..  ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో కనిపించనున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement