స్టార్‌ హీరో కూతురి పెళ్లి.. బనియన్‌ మీదే వివాహం! | Sakshi
Sakshi News home page

Ira Khan: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్‌ చేసుకుంటూ వెళ్లిన వరుడు

Published Thu, Jan 4 2024 9:56 AM

Aamir Khan Daughter Ira Khan Wedding with Nupur Shikhare - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌- నిర్మాత రీనా దత్తాల కూతురు ఇరా ఖాన్‌ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను వివాహం చేసుకుంది. బుధవారం(జనవరి 3న) నాడు ముంబైలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్‌గా రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు.

జాగింగ్‌ చేస్తూ మండపానికి..
ఇక వరుడు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్‌ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 8 కి.మీ. జాగింగ్‌ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు కూడా మార్చుకోకుండా టీషర్ట్‌పైనే పెళ్లి వేడుకలు కానిచ్చేశాడు. రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. ఈ పెళ్లిలో ఆమిర్‌ ఖాన్‌ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేశారు. రెండో మాజీ భార్య అయిన కిరణ్‌ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడీ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13న ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

2022లో ఎంగేజ్‌మెంట్‌..
కాగా నుపుర్‌ శిఖరే.. ఆమిర్‌ ఖాన్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేశాడు. అలా అతడికి ఇరాతో పరిచయం ఏర్పడింది. కరోనా సమయంలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇన్నాళ్లకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్, మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఇరా ఖాన్‌. ఆమిర్‌- రీనా దంపతులకు జునైద్‌ ఖాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్‌.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు.

చదవండి: విజయ్‌ సినిమాలో ఇన్ని సర్‌ప్రైజులా.. ఫ్యాన్స్‌కు పండగే!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement