Ira Khan: 'పెళ్లంటే గౌరవం లేదా? సింప్లిసిటీలా లేదు, పబ్లిసిటీ స్టంట్‌లా ఉంది'..

Aamir Khan Daughter Ira Khan Sets Unique Sense Of Style But Netrizens Trolling - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు  ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్‌ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లు గానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యకంగా కనిపించాలని ఆరాటపడినా కొన్నిసార్లు మిస్‌ఫైర్‌ అవుతుంటుంది.

బాలీవుడ్‌ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందని నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. గత రాత్రి(జనవరి3)న ప్రియుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖర్‌తో ఇరాఖాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌పై సోషల్‌ మీడియాలో తెగ ట్రోలింగ్‌ నడుస్తుంది. వరుడు బ్లూ కలర్‌ షేర్వానీలో కనిపించగా, వధువు ఇరాఖాన్‌ సింపుల్‌గా పటియాలా-చోలి దుస్తుల్లో కనిపించింది. అయితే స్టార్‌ హీరో కూతురు అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అర్జెంట్‌గా ఈమెకు స్టైలిస్ట్‌ అవసరం ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్లంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా? జాగింగ్‌ చేస్తూ నుపుర్‌ పెళ్లి వేడుకకు రావడం ఏంటి? జిమ్‌ డ్రెస్‌లో పెళ్లి తంతు ముగించడం ఏంటి? కనీసం బట్టలు అయినా పద్దతిగా వేసుకున్నారా అంటే అదీ లేదు. ఇదేదో కొత్తరకం స్టైల్‌ అనుకుంటున్నారేమో, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్‌ అంటూ కొత్త జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకునేవారు.

కానీ ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్‌ కలర్స్‌ని  ఎంచుకున్నారు. అనుష్క శర్మ నుంచి పరిణితి చోప్రా వరకు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేస్టల్‌ కలర్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. కానీ ఇరాఖాన్‌ ఇలా నీలం రంగు దుస్తుల్లో, కొల్హాపురి చప్పల్స్‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. అయినా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు వారివి. నిజం చెప్పాలంటే ఈ జంట హంగు, ఆర్భాటాలతో కాకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం ఆదర్శమని మరికొంతమంది కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top