దర్శకుడిగా మారిన మోహన్‌ లాల్‌

Mohanlal Turns As Director For Barozz Movie - Sakshi

యాక్టర్‌ మోహన్‌ లాల్‌ మెగాఫోన్‌ పట్టి డైరెక్టర్‌గా మారారు. మోహన్‌ లాల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘బరోజ్‌: గార్డియన్‌ ఆఫ్‌ డీ గామా ట్రెజర్‌’ సినిమా ప్రారంభోత్సవం కొచ్చిలో జరిగింది. మలయాళ దర్శకుడు, నటుడు జిజో పున్నూస్‌ రచించిన ‘బరోజ్‌: గార్డియన్‌ ఆఫ్‌ డీ గామా ట్రెజర్‌’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్, స్పానిష్‌ యాక్టర్లు పాజ్‌ వేగా, రాఫెల్‌ అమర్గో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘‘జీవితం నన్ను నటుడిని చేసింది. ఈ ప్రయాణంలో సినిమాయే నా జీవితం.. నా జీవనాధారం అని అర్థమైంది. నటుడిగా అద్భుతమైన ప్రయాణం చేసిన నేను ఇప్పుడు దర్శకుడిగా మరో ప్రయాణాన్ని మొదలుపెట్టాను’’ అని పేర్కొన్నారు మోహన్‌ లాల్‌. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి పాల్గొన్నారు. 

చదవండి: ఖమ్మం నుంచి వచ్చి సోనాలి సూద్‌ పేరు చెప్పగానే..

విజయ్‌ దేవరకొండ పాటకి సిగ్గు పడుతూ వీడియో‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top