వైరల్‌: కుమార్తెకు సోనూ సూద్‌ భార్య పేరు పెట్టుకున్న అభిమాని

Sonu Sood Meets Khammam Couple Who Named Their Child Sonali Sood - Sakshi

సినిమాల్లో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ.. సాయం కోసం తన వద్దకు వచ్చినవారందరికీ అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు నటుడు సోనూసూద్. ‌కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు. ఎంతో మందికి సాయం చేసి చేర్చి అందరి మన్ననలు పొందాడు. ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవంగా మారిపోయాడు. నష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్‌లో సోనూ సూద్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో సోనూసూద్‌ హైదరాబాద్‌ వచ్చాడని తెలుసుకున్న ఓ కుటుంబం ఆయనను కలవడానికి ఖమ్మం నుంచి సిటీకి వచ్చారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట తాజాగా షూటింగ్‌ జరిగే సెట్‌ వద్దకు వెళ్లి రియల్‌ హీరోను కలిశారు. తనను కలవడానికి ఓ ఫ్యామిలీ వచ్చిందని తెలుసుకున్న సోనూసూద్‌ ఆశ్యర్యపోయాడు. అంతేగాక కుటుంబంలోని అయిదు నెలల చిన్నారికి సోనాలి సూద్‌ అని పేరు పెట్టినట్లు హీరోకు ఆ అభిమానులు తెలిపారు. ఇది సోనూసూద్‌ భార్య పేరు. దీంతో సంబరపడిపోయిన నటుడు కుటుంబంతో కాసేపు ముచ్చటించి పాపను ఎత్తుకొని ఆడించాడు. అనంతరం వారితో సెల్ఫీలు తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

చదవండి: 
శివరాత్రి ట్వీట్‌: సోనూసూద్‌పై మండిపాటు
సీ ఫుడ్‌.. మై డైట్ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top