కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన 55వ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా మంజుమ్మెల్ బాయ్స్ నిలిచింది. ఉత్తమ నటుడిగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నిలిచారు. భ్రమయుగం చిత్రానికి గానూ ఈ ఘనత దక్కించుకున్నారు. ఉత్తమ నటిగా శామ్లా హంజా అవార్డ్ను సొంతం చేసుకుంది. ఫెమినిచి ఫాతిమా మూవీకి గానూ ఈ అవార్డ్ వరించింది. 2024 ఏడాదికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. మంజుమ్మెల్ బాయ్స్ ఏకంగా 9 విభాగాల్లో సత్తా చాటింది.
కేరళ ఫిల్మ్ అవార్డ్స్ వీళ్లే..
ఉత్తమ చిత్రం - మంజుమ్మెల్ బాయ్స్ (దర్శకుడు - చిదంబరం)
ఉత్తమ నటుడు - మమ్ముట్టి (భ్రమ యుగం)
ఉత్తమ నటి – శామ్లా హంజా (చిత్రం - ఫెమినిచి ఫాతిమా)
ఉత్తమ దర్శకుడు - చిదంబరం ( మంజుమ్మెల్ బాయ్స్)
రెండో ఉత్తమ చిత్రం - ఫెమినిచి ఫాతిమా (దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్)
ప్రత్యేక జ్యూరీ (చిత్రం) - ప్యారడైజ్ (దర్శకుడు: ప్రసన్న వితానగే)
ప్రత్యేక జ్యూరీ(ఫీమేల్) - జ్యోతిర్మయి (బౌగెన్‌విల్లా), దర్శన రాజేంద్రన్ (స్వర్గం)
ప్రత్యేక జ్యూరీ (మేల్) - టోవినో థామస్ (ఏఆర్ఎం), ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం)
ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం - ప్రేమలు (దర్శకుడు: గిరీష్ ఎ.డి.)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్(మేల్) – సౌబిన్ షాహిర్ (మంజుమ్మెల్ బాయ్స్), సిద్ధార్థ్ భరతన్ (భ్రమయుగం)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - లిజోమోల్ జోస్ (నాదన్న సంభవం)
ఉత్తమ తొలి దర్శకుడు - ఫాసిల్ ముహమ్మద్ (ఫెమినిచి ఫాతిమా)
ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) - చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెండ్) - లాజో జోస్, అమల్ నీరద్ (బౌగిన్ విల్లా)
ఉత్తమ ఎడిటర్ - సూరజ్ ఇ.ఎస్. (కిష్కింధ కాండం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - షైజు ఖలీద్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉమెన్ స్పెషల్ కేటగిరీ అవార్డ్- పాయల్ కపాడియా (ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్)
ఉత్తమ కథ - ప్రసన్న వితనగే (స్వర్గం)
ఉత్తమ స్వరకర్త - సుషిన్ శ్యామ్ (బౌగిన్విల్లా)
ఉత్తమ నేపథ్య సంగీతం - క్రిస్టో జేవియర్ (భ్రమయుగం)
ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్) - కె.ఎస్. హరిశంకర్ (చిత్రం - ARM)
ఉత్తమ నేపథ్య గాయని (మహిళ) - సెబా టామీ (చిత్రం - ఆమ్ ఆ)
ఉత్తమ లిరిక్స్ - మంజుమ్మెల్ బాయ్స్
ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ - అజయన్ చలిస్సేరి (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ సింక్ సౌండ్ - అజయన్ అడాత్ (పాణి)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ - ఫజల్ ఎ.బ్యాకర్, షిజిన్ మెల్విన్ హట్టన్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ సౌండ్ డిజైనింగ్ - షిజిన్ మెల్విన్ హట్టన్, అభిషేక్ నాయర్ (మంజుమ్మెల్ బాయ్స్)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్) - భాసి వైకోమ్, రాజేష్ (బరోజ్ 3డీ)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - సయనోరా ఫిలిప్ (బరోజ్ 3డీ)
ఉత్తమ కొరియోగ్రఫీ - సుమేష్ సుందర్, జిష్ణుదాస్ ఎం.వి. (బౌగెన్విల్లా )
ఉత్తమ మేకప్ - రోనెక్స్ జేవియర్ (బౌగెన్‌విల్లా, భ్రమయుగం)
ఉత్తమ కాస్ట్యూమ్ - సమీరా సనీష్ (రేఖాచిత్రం, బౌగెన్‌విల్లా)
ఉత్తమ వీఎఫ్ఎక్స్- జితిన్ లాల్, ఆల్బర్ట్ థామస్, అనిరుద్ధ ముఖర్జీ (ఏఆర్ఎం)
ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్ - శ్రీక్ వేరియర్ (మంజుమ్మెల్ బాయ్స్, బౌగెన్‌విల్లా)


