లోక మూవీ.. నన్ను మోసం చేశారు: మమ్ముట్టి | Mammootty says he was Cheated Into role in Lokah Movie | Sakshi
Sakshi News home page

Mammootty: లోక మూవీ విషయంలో మోసం చేశారు.. రెమ్యునరేషన్‌ ఇస్తేనే సీక్వెల్‌లో..

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 11:32 AM

Mammootty says he was Cheated Into role in Lokah Movie

గతేడాది బ్లాక్‌బస్టర్‌ విజయాలు సాధించిన చిత్రాల్లో లోక మూవీ ఒకటి. ఈ మలయాళ చిత్రం తెలుగులో 'కొత్త లోక: చాప్టర్‌ 1 చంద్ర' గా రిలీజైంది. కల్యాణి ప్రియదర్శన్‌, నజ్లీన్‌, సాండీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మలయాళ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించాడు. అయితే ఈ చిత్రంలో మూతన్‌ పాత్ర కోసం దుల్కర్‌ తండ్రి మమ్ముట్టి వాయిస్‌ను ఉపయోగించారు.

దుల్కర్‌ అడగలేదు
మరి సీక్వెల్‌లో మమ్ముట్టి గొంతు మాత్రమే వినిపిస్తుందా? లేక ఆయన కనిపిస్తాడా? అని సినీ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ ఊహాగానాలపై తాజాగా మమ్ముట్టి స్పందించాడు. 'సినిమాలో నా ప్రమేయం ఉంటుందని చిత్రయూనిట్‌ నాకసలు చెప్పనేలేదు. మొదటిభాగం సమయంలోనూ దుల్కర్‌ నన్ను సంప్రదించలేదు, అతడి మేనేజర్‌, ఫ్రెండ్‌ వచ్చి.. నా గొంతు అరువివ్వమని అడిగారు. 

ఆ చేయి కూడా నాదేనట!
మొదట తిరస్కరించినప్పటికీ చివరకు ఆ ఒక్కసాయం చేశాను. తీరా మూవీ రిలీజయ్యాక.. నేను వాయిస్‌ ఇచ్చిన పాత్ర నాదేనని, అందులో కనిపించే చేయి కూడా నాదేనని చెప్పారు. ఇది మోసం చేయడం కాక ఇంకేమవుతుంది? వాళ్లు చేసిన పని వల్ల ఇప్పుడు సీక్వెల్‌లో ఆ పాత్రలో నటించాల్సిన బాధ్యత నాపై పడింది. అయితే రెమ్యునరేషన్‌ తీసుకునే యాక్ట్‌ చేస్తాను. నేనడిగినంత ఇస్తే సినిమాలో భాగం అవుతాను' అని చెప్పుకొచ్చాడు.

సినిమా
కాగా డామినిక్‌ అరుణ్‌ దర్శకత్వం వహించిన లోక మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో మమ్ముట్టి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన మూతన్‌ పాత్ర తెరపై వినిపించిందే తప్ప కనిపించలేదు. సీక్వెల్‌లో ఆ పాత్ర కనిపించే అవకాశం ఉంది.

చదవండి: మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే: ఆమిర్‌ ఖాన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement