మొదటి భార్యతో విడాకులు.. ఎంత దిగజారిపోయానంటే..: ఆమిర్‌ ఖాన్‌ | Aamir Khan About First wife Reena Dutta Left Home: Drank almost a Bottle a Night | Sakshi
Sakshi News home page

Aamir Khan: భార్య వదిలేసి పోయింది.. మందు ముట్టని నేను ప్రతిరోజు బాటిల్‌..

Apr 10 2026 9:00 AM | Updated on Apr 10 2026 11:10 AM

Aamir Khan About First wife Reena Dutta Left Home: Drank almost a Bottle a Night

బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ ముచ్చటగా మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నాడు. కొంతకాలం క్రితమే గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా అందరికీ పరిచయం చేశాడు. తనతో కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన మొదటి భార్యతో విడాకుల గురించి ఓపెనయ్యాడు. ఆమిర్‌ మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను మద్యానికి దూరంగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నా మొదటి భార్య రీనాతో విడాకులయ్యాయో నేను పూర్తిగా మారిపోయాను. 

నియంత్రించుకోలేకపోయా..
తను పిల్లల్ని తీసుకుని ఇల్లు వదిలేసిన రోజు తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాను. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. మందు ముట్టని నేను తాగుబోతుగా మారిపోయాను. అతిథుల కోసం ఇంట్లో మద్యం బాటిళ్లు ఉంటే వాటిని ఖాళీ చేయడం మొదలుపెట్టాను. ఏడాదిన్నరపాటు ప్రతిరోజు రాత్రి ఒక బాటిల్‌ తాగేశాను. మందుకు దూరంగా ఉండే నేను బాటిల్‌ ఖాళీ చేసే స్థాయికి దిగజారిపోయాను' అని గుర్తు చేసుకున్నాడు.

పర్సనల్‌ లైఫ్‌
కాగా ఆమిర్‌ ఖాన్‌.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్‌, కూతురు ఇరా ఖాన్‌ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో ఆమిర్‌.. దర్శకురాలు కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్‌ జన్మించాడు. ఆమిర్‌-కిరణ్‌ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని 2025లో తన బర్త్‌డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.

చదవండి: డెకాయిట్‌ మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement