యాత్ర- 2 ట్రైలర్‌పై ప్రకటన చేసిన డైరెక్టర్‌ | Yatra 2 Movie Director Mahi V Raghav Announced Trailer Release Date, Deets Inside - Sakshi
Sakshi News home page

యాత్ర- 2 ట్రైలర్‌పై ప్రకటన చేసిన డైరెక్టర్‌

Published Fri, Feb 2 2024 8:19 AM | Last Updated on Fri, Feb 2 2024 9:28 AM

Yatra 2 Movie Trailer Release Date Announced - Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వైఎస్సార్‌, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే టీజర్‌లో కనిపించాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో  యాత్ర 2 చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (ఫిబ్రవరి 3న) విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ్‌ తెరకెక్కిస్తున్నారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement