Mammootty : ‘గ్రేట్ శంకర్’గా మమ్ముట్టి

మలయాళ హిట్ మూవీ ‘మాస్టర్ పీస్’ తెలుగులో ‘గ్రేట్ శంకర్’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ ‘గ్రేట్ శంకర్’ని తెలుగులో విడుదల చేయనున్నారు.
(చదవండి: చిరు ‘గాడ్ ఫాదర్’కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్, డేట్స్ కూడా ఫిక్స్!)
‘‘మంచి కథాబలం ఉన్న చిత్రం ఇది. మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఉత్కంఠగా సాగుతుంది. మలయాళంలో హిట్ సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు లగడపాటి శ్రీనివాస్.