నేను విన్నాను...   | Yatra 2 Movie Trailer Out | Sakshi
Sakshi News home page

నేను విన్నాను...  

Feb 4 2024 12:21 AM | Updated on Feb 4 2024 12:22 AM

Yatra 2 Movie Trailer Out - Sakshi

‘‘నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్‌ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్‌కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్‌ థింక్‌.. ఇట్స్‌ రైట్‌ సార్‌ (మరో పాత్రధారి)... నువ్వు చెప్పింది కరెక్ట్‌నే అయ్యా.. నాకు అర్థమైంది.

కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్‌తో మొదలైంది ‘యాత్ర 2’ సినిమా టీజర్‌. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’కు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ వస్తోంది.

ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్‌ దర్శకత్వంలో త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్‌ రెడ్డి కడపోడు సార్‌.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్‌ (శుభలేక సుధాకర్‌) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను,  నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement