కొచ్చి టు ఢిల్లీ | Nayanthara joins the sets of Mammootty and Mohanlal film MMMN | Sakshi
Sakshi News home page

కొచ్చి టు ఢిల్లీ

Feb 10 2025 1:58 AM | Updated on Feb 10 2025 1:58 AM

Nayanthara joins the sets of Mammootty and Mohanlal film MMMN

మోహన్‌లాల్(Mohanlal), మమ్ముట్టి(Mammootty) హీరోలుగా మలయాళంలో ఓ భారీ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫాహద్‌ ఫాజిల్, కుంచకో బోబన్, ఆసిఫ్‌ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. కాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో హీరోయిన్‌ నయనతార(Nayanthara) నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొచ్చిలో జరుగు తోంది.

ఈ మూవీ షూటింగ్‌లో నయనతార జాయిన్‌ అయ్యారని మేకర్స్‌ ఆదివారం ప్రకటించారు. అలాగే ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఢిల్లీలో జరుగనుందని, ఈ షెడ్యూల్‌తో మేజర్‌ షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం. మరోవైపు గతంలో ‘తస్కరవీరన్‌ (2005), రప్పకల్‌ (2005), భాస్కర్‌ ది రాస్కెల్‌ (2015), పుతియ నియమం (2016)’ వంటి చిత్రాల్లో మమ్ముట్టి–నయనతార స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement