యాత్రలో జర్మనీ నటి సుజానే

Yatra 2: German actor Suzanne Bernert to play Sonia Gandhi in sequel - Sakshi

‘యాత్ర’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

కాగా ఈ సినిమాలో సోనియా గాంధీ పాత్రని జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్‌ పోషిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మహి వి. రాఘవ్‌ మాట్లాడుతూ–‘‘యాత్ర’కి కొనసాగింపుగా ‘యాత్ర 2’ రూపొందుతోంది. వైఎస్‌ జగన్‌గారు ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ‘యాత్ర 2’ని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మధి, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top