నాకు సోదరి కూడా ఉందంటూ ఫోటో షేర్‌ చేసిన దుల్కర్‌ | Dulquer Salmaan Shared Photo Goes Viral On Social Media, Know Who Is In This Picture - Sakshi
Sakshi News home page

దుల్కర్‌తో ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

Published Thu, Dec 7 2023 12:40 PM

Dulquer Salmaan Share Photo Goes Viral - Sakshi

సౌత్‌ ఇండియా నుంచి బాలీవుడ్‌లో జెండా పాతిన హీరోల్లో దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఒకరు. సీతారామం, చుప్,కింగ్ ఆఫ్ కొత్త లాంటి సినిమాల ద్వారా ఇటు మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కూడా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్‌ చేశాడు. ఆ ఫోటో తన అక్క సురుమి తీసినట్లు ఆయన తెలిపాడు. మలయాళంలో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి కుమారుడే దుల్కర్‌ సల్మాన్‌..

తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్‌.. ఇండస్ట్రీలో సూపర్‌ హిట్లు కొడుతున్నాడు. కానీ ఆయన సోదరి సురుమి మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆమెకు డ్రాయింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె చాలా పెయింటింగ్స్‌ వేయడం జరిగింది. దుల్కర్‌, సురుమి ఇద్దరూ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. తన సోదరి సురుమి తీసిన ఫోటోను దుల్కర్‌ షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో  దుల్కర్‌తో ఉన్న వ్యక్తి సురుమి భర్త డా. ముహమ్మద్ రేహాన్ షాహిద్‌ అని అభిమానులు గుర్తించారు.

ఆ ఫోటోకు  క్యాండిడ్ క్యాప్చర్ అనే టైటిల్‌ను ఆయన చేర్చాడు. మై వన్ అండ్ ఓన్లీ, సిబ్లింగ్ క్లిక్, బెస్ట్, క్యాండిడ్ ఫోటోలు, స్పెషల్ సమ్మిట్, క్లీనింగ్ అప్, బిజినెస్‌మెన్ అనే ట్యాగ్‌లతో దుల్కర్ చిత్రాన్ని పంచుకున్నాడు. సోదరి తీసిన ఆ ఫోటో అభిమానుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. బావ బావమరుదుల ముఖాలు కూడా స్పష్టంగా ఉండేలా ఫోటో షేర్ చేసి ఉంటే బాగుండని వ్యాఖ్యానిస్తున్నారు. దుల్కర్ తన బావతో కలిసి ఫార్మల్ డ్రెస్‌లో స్టైలిష్ స్మైల్‌తో ఫోటోలో కనిపించాడు. 'నాకు ఒక సోదరి ఉంది.. ఆమె నేరుగా నిలబడి ఫోటోకు ఎలా పోజులివ్వాలో కూడా ఆమెకు తెలియదు. దుల్కర్ తరచుగా తండ్రి, సోదరి మోడల్‌గా పోజులిస్తుంటారు.

కొన్ని రోజుల క్రితం ఒక సినిమాలో భాగంగా దుల్కర్‌తో మమ్ముట్టి ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ సినిమాకు సురుమి మాత్రమే ఎందుకు రాలేదని నెటిజన్లు కామెంట్లు చేశారు. వాటికి స్వయంగా సురుమినే సమాధానమిచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, అయితే కెమెరా ముందుకు రాలేనని, తెరపై సోదరుడిలా కనిపించడం తనకు ఇష్టం లేదని సురుమి తెలిపింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సురుమి పెయింటింగ్ అక్కడి ఎగ్జిబిషన్‌లో పాపులర్‌ అయింది.  తొమ్మిదో తరగతి నుంచి చిత్రలేఖనంపై ఆమెకు పట్టు ఉంది. సురుమికి ఇద్దరు కుమారులు. బెంగుళూరులో తన భర్త ముహమ్మద్ రేహాన్ షాహిద్‌తో సురుమి ఉంది.

Advertisement
Advertisement