Super Star Mammootty Tests Covid Positive, Details Inside - Sakshi
Sakshi News home page

Mammootty: సంక్రాంతి రోజే క‌రోనా బారిన ప‌డ్డ మ‌మ్ముట్టి

Jan 16 2022 4:30 PM | Updated on Jan 16 2022 5:17 PM

Super Star Mammootty Tests Coronavirus Positive - Sakshi

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి క‌రోనా బారిన ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. 'అన్ని జాగ్ర‌త్తలు తీసుకున్న‌ప్ప‌టికీ శ‌నివారం(జ‌న‌వ‌రి 15) నాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. కాస్త జ్వ‌రం మిన‌హా అంతా బాగానే ఉంది. ప్ర‌స్తుతం నేను ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. అన్నివేళ‌లా మాస్కు ధ‌రించండి' అని ట్వీట్ చేశాడు. 

కాగా ఆయ‌న ప్ర‌స్తుతం 'సీబీఐ 5' సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో ఆయ‌న‌ సేతురామ‌న్ అయ్య‌ర్‌ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దీనికి కె.మ‌ధు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ముఖేశ్‌, జ‌గ‌తి శ్రీకుమార్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement