పద్మభూషణ్‌ అందుకున్న మెగాస్టార్ | Malayalam Actor Mammootty Awarded with Padma Bhushan | Sakshi
Sakshi News home page

Mammootty: పద్మభూషణ్‌ అందుకున్న మలయాళ మెగాస్టార్

Jun 23 2026 6:37 PM | Updated on Jun 23 2026 7:38 PM

Malayalam Actor Mammootty Awarded with Padma Bhushan

మలయాళ స్టార్ మమ్ముట్టి పద్మభూషణ్ అవార్డ్ అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‍అవార్డ్ స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ పద్మశ్రీ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్‌ అందుకున్నారు. 

టాలీవుడ్‌లో ఇద్దరికి పద్మశ్రీ..

మమ్ముట్టితో పాటు ప్రముఖ సింగర్ అల్కా యగ్నిక్‌ కూడా పద్మభూషణ్ అవార్డ్‌కు ఎంపికయ్యారు. పద్మశ్రీ అందుకున్న వారిలో టాలీవుడ్ నటుడు మురళి మోహన్, రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖ జానపద కళాకారుడు గురు సంగ్యుసాంగ్ పొంగెనర్, అనిల్ కుమార్ రస్తోగి అవార్డులు అందుకున్నారు. దివంగత నటుడు సతీష్ షాకు పద్మశ్రీ అవార్డ్ రాగా.. ఆయన సోదరుడు అరవింద్ షా  స్వీకరించారు.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement