మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి | Sakshi
Sakshi News home page

Bramayugam Movie: స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా.. వేరే లెవల్ స్పీడ్

Published Fri, Oct 20 2023 4:19 PM

Bramayugam Movie Shooting Complete In 2 Months - Sakshi

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా 'భ్రమయుగం'. రాహుల్‌ సదాశివం దర్శకుడు. అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమూల్దా లైజ్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జవీర్‌ సంగీతమందిస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్)

ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పాడు. అయితే పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందని స్వయంగా దర్శకుడు చెప్పాడు. 

ఈ క్రమంలోనే చిత్ర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్‌ కథా చిత్రంగా 'భ్రమయుగం' ఉంటుందని దర్శకుడు చెప్పాడు. వచ్చేది ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత)

Advertisement
 
Advertisement