Madhu
-
ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...
మధుస్మిత సోరెన్ ముర్ము ఓ ట్రెండ్‌సెట్టర్. సంతాలి ఆదివాసీ వంటకాలను, ఇటాలియన్ వంటకాల శైలితో మేళవించి కొత్త రుచులను ఆవిష్కరిస్తోంది. సంతాలి సంప్రదాయ వంటల గురించి బ్లాగ్‌లో రాస్తోంది. కొద్దిరోజుల్లోనే ఓ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మధుస్మిత. బాల్యంలో ఎదురైన చిన్న చూపు నుంచి ఎదిగిన విజయ కిరణం ఆమె. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా, రాయ్‌రంగపూర్ అమ్మాయి మధుస్మిత.పోటీలో విజయంఆదివాసీల ఆహారపు అలవాట్లు నాగరక సమాజానికి భిన్నంగా ఉంటాయి. అడవుల్లో దొరికే చీమలు, నత్తలు, ఇతర కీటకాల వంటలు వారి ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. లంచ్ బాక్సులో ఆమె ఆహారాన్ని చూసిన ఇతర విద్యార్థులు ఆమెను తక్కువగా చూసేవారు. అప్పటినుంచి ఆమెలో తమ ఆహారపు అలవాట్లను నాగరకులు ఎందుకు తక్కువగా చూస్తారు... అనే సందేహం కలిగింది. ఆమెతోపాటే ఆమె సందేహం కూడా పెద్దదైంది. ‘ఒడిశా హోమ్‌ఫుడ్ షెఫ్’ పోటీల్లో గెలవడం మధుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తమ సంప్రదాయ వంటకాలను ఇతర ప్రాంతాల వంటకాల శైలితో మేళవించి వండడం అనే ప్రయోగం కూడా విజయవంతమైంది. బీటెక్ చదివేనాటికి ఆమెకు ఒక పరిష్కారం దొరికింది. ఆ పరిష్కారం విజయవంతం అవుతుందా లేదా అనే ప్రశ్నకు కోవిడ్ లాక్డౌన్ చక్కటి సమాధానాన్ని చెప్పింది. లాక్డౌన్ సమయంలో వంటల మీద పరిశోధనలు మొదలుపెట్టింది. లాక్డౌన్ తర్వాత సంతాలి వంటలు ఎన్ని రకాలున్నాయో తెలుసుకోవడానికి ఆ గ్రామాల్లో పర్యటించింది. ఎలా వండుతున్నారో తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలను బ్లాగ్‌లో రాయడం మొదలుపెట్టింది.ఇప్పుడామె చెఫ్‌లకు శిక్షణనిస్తోంది. ప్రముఖ రెస్టారెంట్లలో సంతాలి తెగ వంటకాలు ప్రముఖ స్థానంలో కనిపిస్తున్నాయి. 2022లో మాస్టర్ షెఫ్ పోటీల్లో పాల్గొంది. ఆమె చేసిన రెండు వంటలు న్యాయనిర్ణేతల జిహ్వను మైమరిపించాయి. ఇటాలియన్ వంటకం పోలెంతాని మధుస్మిత స్థానిక పద్ధతిలో ఎర్రబియ్యంతో చేసింది. వేయించిన చికెన్‌కు తోడుగా ఎర్ర చీమల చట్నీ వడ్డించింది. అలాగే పాల్వా చట్నీతో పాట్లపీత వంటకం కూడా. ఎండిన చింతాకు ΄పొడితో చేసిన వంటకాలను నగరవాసులు లొట్టలేసుకుని తింటున్నారు.గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ‘‘మా తల్లిదండ్రుల ఆలోచనలు చాలా సంప్రదాయబద్ధమైనవి. నేను బాగా చదువుకుని ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు. కానీ నేను మాత్రం మా సంతాలి తెగ మీద సమాజంలో నెలకొని ఉన్న తేలిక అభి్రపాయాన్ని తొలగించాలనుకున్నాను. సంతాలి వంటకాలను తెలియచేసే ఫుడ్ బ్లాగర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యాను. మా వంటలను పరిచయం చేశాను.ప్రపంచç ³టంలో వంటకాల్లో ఇటలీకున్న స్థానంలో మా సంతాలి వంటకాలను చేర్చగలిగాను. పెద్ద పేరున్న రెస్టారెంట్లు మా వంటకాలకు మెనూ కార్డులో ‘ట్రైబల్ క్విజిన్’ అని ప్రత్యేక కేటగిరీ కల్పిస్తున్నారు. ఇప్పుడు మా సంతాలి వంటకాలు ప్రపంచ ఆహారపట్టికలో ఉన్నాయి. నేను అనుకున్నది సాధించాను’’ అని సంతోషంగా చె΄్తోంది 32 ఏళ్ల మధుస్మిత. బాల్యంలో మనసుకైన గాయంతో తమ సంతాలి తెగకు ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చి పెట్టింది మధుస్మిత సోరెన్ ముర్ము. -
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !
హైదరాబాద్, సాక్షి: రియల్టర్ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్.. ఎక్కడో బీదర్‌లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారొచ్చని అంతా భావించారు. అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.బిల్డర్ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్ ఎస్టేట్‌తో పాటు ట్రావెల్స్ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్‌తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా గ్యాంగ్‌తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.ముందుగా హైదరాబాద్‌లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.24న తేదీ..మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్ కోసం తనతో పాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద మృతదేహం కనిపించింది. కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.అయితే.. హైదరాబాద్‌లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
ఒంటిపై 20 లక్షల బంగారం, 5 లక్షల క్యాష్.. 30 సార్లు కత్తితో పొడిచి..
-
ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
కుత్బుల్లాపూర్: కాపు సంఘం నేత, బిల్డర్ కుప్పల మధు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు బీదర్ జిల్లాకు చెందిన మానే కేలి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. మధు ఈ నెల 24న ఉదయం తన కారులో డ్రైవర్ రేణుక అనే వ్యక్తి తో కలిసి బీదర్ వెళ్లాడు. చింతల్ ప్రాంతంలో మరో ఇద్దరు కారులో ఎక్కినట్లు తెలిసింది. నలుగురు కలిసి బీదర్ ప్రాంతంలో ఓ క్లబ్బులో గడిపారు. అదే రోజు రాత్రి మధు భార్య లక్ష్మి అతడికి ఫోన్ చేయగా అప్పటికే బయలుదేరినట్లు చెప్పాడు. మరో గంట తర్వాత ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చార్జింగ్ అయిపోయి ఉంటుందని భావించారు. అయితే శనివారం ఉదయం బీదర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి బండరాళ్లు వేసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఉన్న కారు నెంబరు ఆధారంగా కర్ణాటక పోలీసులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం జీడిమెట్ల పోలీసులు కుత్బుల్లాపూర్ కల్పన సొసైటీలో ఉన్న మధు ఇంటికి వెళ్లి ఆయన భార్య లక్ష్మీకి మధుకు కారు యాక్సిడెంట్ అయిందని చెప్పి ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా మధు హత్యకు గురైనట్లు తెలిసి వారు షాక్ అయ్యారు . అతడి శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బండరాయి మోది హత్య చేసినట్లు గుర్తించారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో రూ . 5 లక్షల నగదు, ఒంటిపై రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం మృతదేహాన్ని తీసుకువచ్చి పద్మా నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పథకం ప్రకారమే హత్య చేశారా..! రియల్ వ్యాపారిగా, కాపు సంఘం నేతగా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో సుపరిచయస్తుడిగా ఉన్న మధు కొద్ది కాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మంది మార్బలం.. ఒంటినిండా నగలతో కనిపించాడు.. ఇటీవల అతడి పెద్ద కుమార్తెకు వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆగస్టులో పెళ్లి ఉండగా ఇంతలోనే హత్యకు గురి కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హత్య పథకం ప్రకారమే చేశారా..! ఎవరైనా పాత ఆరి్థక లావాదేవీలతో సుపారి ఇచ్చి హత్య చేయించారా..? డబ్బు, ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల కోసమే డ్రైవర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా..! వెంట వెళ్లిన వారి సెల్ఫోన్లు ఎందుకు స్విచ్ఛాఫ్ చేశారు ప్రశ్నలు అనుమానాలకు తావిస్తున్నాయి. కర్ణాటక పోలీసులు హత్య కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా అందరితో ఆప్యాయంగా మాట్లాడే మధు అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. అతడి వద్ద ఎన్నో ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న రేణుక దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
నీలం మధుకే మెదక్ టికెట్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ టికెట్ నీలం మధు ముదిరాజ్‌కు దక్కింది. బీసీ సామాజిక సమీకరణ ఈయనకు కలిసొచ్చింది. ఇదివరకే ఈ స్థానం నుంచి బీఆర్ఎస్, బీజేపీలు ఓసీలకు టికెట్లు కేటాయించాయి. కాగా, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ నేతను బరిలోకి దింపుతోంది. ఈ అభ్యర్థిత్వం విషయమై నీలం మధు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. బీఆర్ఎస్లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.నరేంద్రనాథ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకుంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. మరో పారిశ్రామికవేత్త పేరు సైతం వినిపించింది. కానీ హస్తం పార్టీ అధినాయత్వం చివరకు మధు వైపే మొగ్గు చూపింది. ఆయనకు సీఎం రేవంత్ ఆశీస్సులున్నాయి. బీఎస్పీ నుంచి పోటీ బీఆర్ఎస్లో చాలా కాలం కొనసాగిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు స్థానం నుంచి టికెట్ ఆశించారు. దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. చివరి క్షణంలో ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను పార్టీ బరిలోకి దింపడం తెలిసిందే. దీంతో మధు బీఎస్పీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్ చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఈ టికెట్ దక్కింది. వార్డుమెంబర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా.. మధు.. 2001లో బీఆర్ఎస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పటాన్చెరు మండలం చిట్కుల్లో వార్డ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో చిట్కూర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్ఎంఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనకు పటాన్‌చెరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. ప్రధానంగా ముదిరాజ్ సామాజికవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బరిలోకి దించడం ద్వారా ఆ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. -
అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌గా మధు శశిధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్ నియమితులయ్యారు. అపోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా 2023 అక్టోబర్‌లో ఆయన చేరారు. యూఎస్‌లోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ట్రెడిషన్ హాస్పిటల్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. -
బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు
సాక్షి, హైదరాబాద్: బహు జన సమాజ్ పార్టీ అభ్య ర్థులు రాష్ట్రంలోని 119 ని యోజకవర్గాల్లో నామినేష న్లు దాఖలు చేశారు. శుక్రవారం పార్టీ 21 అసెంబ్లీ స్థానాలతో తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో బీఎస్పీ తొలిసారి మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాగా, నాటకీయ పరిణామాల మధ్య పటాన్చెరు స్థానం నుంచి నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఆయన పేరును మొదట ప్రకటించినప్పటికీ, తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మధు బీఎస్పీలో చేరారు. అవినీతి, కుటుంబ పాలనకు చరమగీతం: ప్రవీణ్‌కుమార్: తెలంగాణలో అవినీతి, కు టుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్ర జలు సిద్ధంగా ఉన్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ప్రవీణకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బహుజనుల రాజ్యాధికార కల సాకారం అ య్యే రోజు దగ్గర్లోనే ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను జనం నమ్మడం లేదని అన్నారు. -
నీలం స్థానంలో కాట..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల చివరి, నాలుగో జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కొత్తగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు అదనంగా పటాన్చెరు అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంపై తలెత్తిన పంచాయితీని పరిష్కరించింది. ముందుగా ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ స్థానంలో పాతకాపు కాట శ్రీనివాస్‌గౌడ్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీలం మధు ముదిరాజ్‌కు మూడో జాబితాలో పటాన్చెరు టికెట్ కేటాయించినప్పటికీ బీఫామ్ ఇవ్వని అధిష్టానం.. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అనుచరుడైన శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ కేటాయించింది. దీంతో దామోదర పట్టుబట్టి తన పంతం నెగ్గించుకున్నట్లయింది. అలాగే సూర్యాపేట స్థానం నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొనగా అధిష్టానం మాత్రం దామోదర్‌రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. మరోవైపు తుంగతుర్తి అభ్యర్థిగా అనూహ్యంగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల శామ్యూల్ టికెట్ దక్కించుకున్నారు. మాదిగ, మాల కుల సమీకరణల్లో భాగంగానే అధిష్టానం శామ్యూల్‌ను ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. అలాగే పొత్తులో భాగంగా సీపీఎం కోరిన మిర్యాలగూడ టికెట్ ఎట్టకేలకు బలమైన నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డికే దక్కింది. దీంతో అక్కడి కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చార్మినార్ టికెట్‌ను స్థానిక నేత మహ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్‌కు పార్టీ కేటాయించింది. గురువారం విడుదల చేసిన నాలుగో జాబితాతో కలిపి మొత్తం 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించడం తెలిసిందే. -
కాంగ్రెస్‌లో తేలని పటాన్చెరు పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు టికెట్ పంచాయితీ ఇంకా పరిష్కారం కాలేదు. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో తన పేరు ఉండడంతో బీఫారం తీసుకునేందుకు నీలం మధు ముదిరాజ్ తన అనుచరులతో కలిసి బుధవారం గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఏఐసీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదని, స్పష్టత వచ్చిన తర్వాత బీఫారం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు ఆయనకు చెప్పారు. దీంతో మధు అనుచరులు కొంతసేపు గాంధీభవన్‌లో హడావుడి చేశారు. టికెట్ ప్రకటించి బీఫాం ఎందుకు ఇవ్వరంటూ ఆందోళన నిర్వహించారు. ఈ టికెట్ విషయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గట్టి పట్టు పడుతున్నారు. ఏఐసీసీ ప్రకటించిన విధంగా మధుకు కాకుండా తన సన్నిహితుడు కాట శ్రీనివాస్‌గౌడ్‌కే టికెట్ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీలో మకాం వేశా రు. ఈ విషయంలో తన ప్రమేయం లేదని చెపుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి బుధవారమే ఆయన నామినేషన్ వేయాల్సి ఉన్నా ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. తనకు జ్వరం వచ్చినందున బుధ, గురువారాల్లో నిర్ణయించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నానని, ఈనెల 10న తాను నామినేషన్ వేస్తానని ఆయన ప్రకటించారు. అయి తే, మధుకు బీఫాం ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నారని, ఈ కోణంలోనే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సంగిశెట్టి, సలీం రాజీనామా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ముషీరాబాద్ టికెట్ ఆశించిన సంగిశెట్టి జగదీశ్వర్‌రావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో బీసీలకు అన్యాయం చేసినందున తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మైనార్టీ నేత సలీం కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నగా గుర్తింపు పొందిన చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాం«దీభవన్‌కు వచ్చిన ఆయనకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు బోసురాజు, గురుదీప్ సిప్పల్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, నవీన్ భార్యకు తుంగతుర్తి టికెట్ కేటాయించనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద అంబర్‌పేట మున్సిపల్ చైర్ పర్సన్ చెవుల స్వప్న చిరంజీవి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు బుధవారం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయమే జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. -
Neelam Madhu: నీలంకు గాలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన నీలం మధుకు ప్రతిపక్ష పార్టీలు గాలం వేస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో గట్టి పట్టున్న మధును పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అతనికి స్థానికంగా యువతలో మంచి క్రేజ్ ఉంది. అలాగే బీసీ సామాజికవర్గాల్లోనూ మద్దతు ఉంది. స్థానికంగా బలం, బలగం రెండూ ఉన్న మధును పార్టీలో చేర్చుకుంటే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ముది రాజ్ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల గెలుపోటములను ప్రభావితం చేసేంత సంఖ్యలో వారు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలంటూ ముదిరాజ్‌లు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అతడిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గాల మద్దతును కొంత మేరకు కూడగట్టుకోవచ్చనే భావన ప్రతిపక్ష పార్టీల్లో ఉంది. అభ్యర్థిత్వం పరిశీలిస్తామని ఆఫర్ బీఆర్ఎస్ పటాన్చెరులో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారైంది. అంగ, ఆర్థిక బలంతోపాటు నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఆయనను ఢీకొనగల సత్తా ఉన్న నాయకులను బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది. మధును బరిలోకి దించితే బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వగలరని, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అభ్యర్థులకు కూడా చాలా వరకు మేలు జరుగుతుందనే భావనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయన చేరితే అభ్యర్థిత్వం విషయంలో పేరును పరిశీలిస్తామనే ప్రతిపాదన వచ్చిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో చేరికల కమిటీ బాధ్యతలు చూస్తున్న ఈటల రాజేందర్ కూడా మధు చేరిక విషయంలో పార్టీ జిల్లా నాయకత్వానికి పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు చర్చ జరుగుతోంది. పాదయాత్రకు సిద్ధమవుతున్న నీలం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నీలం మధును గులాబీ పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసింది. మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. ఆయన సేవలు పార్టీకి అవసరమని, తగిన గుర్తింపు ఉంటుందని భరోసాఇచ్చారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈనెల 16 వరకు వేచి చూస్తానని, అప్పటికీ తనకు టికెట్ ప్రకటించని పక్షంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పటాన్చెరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ప్రతి గడపకూ వెళ్లి సబ్బండవర్గాల ప్రజలను కలుస్తానని, వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తానని తేల్చిచెప్పారు. ఇలా అధికార పార్టీ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నించడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మీ బిడ్డగా ఆశీర్వదించండి పటాన్చెరు టౌన్/ రామచంర్రాపురం(పటాన్చెరు): మీ బిడ్డగా ఎమ్మెల్యే బరిలో ఉంటున్నానని, ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతానని, సబ్బండ వర్గాల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండా అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం రాత్రి తన స్వగ్రామైన చిట్కుల్లో పలు కాలనీల్లో ఉన్న ప్రజలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. గ్రామంతోపాటు పటాన్చెరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 16 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టబోయే పాదయాత్రకు అందరి ఆశీస్సులను కోరారు. -
ఈనెల 16 వరకు ఎదురుచూస్తా
పటాన్చెరు టౌన్ (హైదరాబాద్): బీఆర్ఎస్ పార్టీ నుంచి సానుకూల నిర్ణయం కోసం ఈనెల 16 వరకు ఎదురుచూస్తానని, అప్పటికీ తేల్చకుంటే ఆ పార్టీకి రాజీనామా చేస్తానని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధుముదిరాజ్ ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ బలోపేతం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టానని, అధిష్టానం పటాన్చెరు నుంచి టికెట్ ఇస్తుందని ఆశించానని తెలిపారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే, ఆ పార్టీ నుంచి కండువా కప్పుకుని పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రజా సమస్యల ఎజెండాగా నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి ఒకటో నంబర్ బూత్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. -
రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం
సెప్టెంబర్‌లో నెలలో ఓ వారం రోజుల పాటు శ్రీలంకలో పర్యటించే అవకాశం వచ్చింది. నేను చూసిన శ్రీలంకకు అక్షరరూప పరంపర ఇది. మొదట మదుగంగలో రివర్ సఫారీ మదుగంగ... ఈ నది శ్రీలంక దీవిలో ప్రవహిస్తోంది. బాల్‌పిటియా అనే చిన్న పట్టణం నుంచి ఈ నదిలో రివర్ సఫారీ చేయవచ్చు. ఈ ప్రదేశం కొలంబో– గాలే హైవేలో వస్తుంది. బెన్తోట నుంచి అరగంట ప్రయాణ (18 కి.మీలు) దూరంలో ఉంది బాల్‌పిటియా. ఇక్కడ మదుగంగ నది విశాలమైన సరస్సును తలపిస్తూ ఉంటుంది. నీరు నిశ్చలంగా అనిపిస్తుంది. ఈ ప్రదేశం నుంచి పడవలో ప్రయాణం మొదలు పెడితే ఒకటిన్నర గంట నదిలో విహరించవచ్చు. నది మధ్యలో ఉన్న దీవులను చుట్టిరావచ్చు. మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని, వినాయకుడి మందిరాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఇది ప్రకృతి రమణీయతను, మాన్‌గ్రోవ్ (మడ అడవులు) బారులను చూడడానికి వెళ్లాల్సిన ప్రదేశం. నదికి మహా స్వాగతం మదు గంగ నది తీరమంతా మడ అడవులు దట్టంగా ఉంటాయి. చెట్ల కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన వేళ్లు నదిలోని నీటి కోసం ఊడల్లాగ కిందకు వేళ్లాడుతుంటాయి. బాల్‌పిటియా దగ్గర మొదలైన రివర్ సఫారీ మొదట మదుగంగ నది హిందూమహాసముద్రంలో కలిసే ప్రదేశం వరకు సాగుతుంది. నిశ్చలంగా ప్రవహించిన నదికి హిందూ మహా సముద్రం అలలతో స్వాగతం పలుకుతున్న అద్భుతాన్ని చూసిన తరవాత దీవుల పరిక్రమ దిశగా సాగింది మా పడవ. ప్రకృతి ప్రపంచమిది శ్రీలంకలో ఎటు చూసినా పచ్చదనమే. అయితే ఈ నది మధ్య ఉన్న దీవులు ఇంకా దట్టమైనవి, ఇంకా పచ్చనైనవి. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించినట్లు దట్టమైన అడవులవి. ఈ దీవులు కొన్ని ప్రైవేట్ వ్యక్తులవి. కొన్ని సామాన్య జనావాసాలు. ఒక దీవిలో పూర్తిగా దాల్చిన చెక్కను చెక్కే వాళ్లే నివసిస్తున్నారు. మొత్తం ఇరవై కుటుంబాలు. దాల్చిన చెక్క చెట్ల నుంచి బెరడును సేకరించడం, సినమిన్ ఆయిల్ తయారు చేయడమే ఆ దీవిలో నివసించే వారి వృత్తి. పడవలన్నీ ఆ దీవి దగ్గర ఆగుతాయి. ఒక ఇంట్లోకి వెళ్లగానే ఒక చిన్న గది, పర్యాటకులు కూర్చోవడానికి చేసిన ఏర్పాటు ఉంది. మనం వెళ్లగానే ఒక వ్యక్తి సినమిన్ ఆకులు రెండింటిని మన చేతిలో పెట్టి వాసన చూడమంటాడు. ఆ తర్వాత ఒక కర్రను చూపించి బెరడును ఒలుస్తాడు. ఆ తర్వాత పర్యాటకులందరికీ గాజు కప్పుల్లో దాల్చిన చెక్క టీ ఇస్తారు. చేపల పట్టే అమ్మాయి టీ తాగిన తర్వాత వారి వద్దనున్న దాల్చిన చెక్కతోపాటు సినమిన్ పౌడర్ ప్యాకెట్లు, సినమిన్ ఆయిల్ సీసాలను మన ముందు పెడతారు. కావల్సినవి కొనుక్కున్న తర్వాత పడవ ఇతర దీవుల వైపు సాగుతుంది. ఈ మధ్యలో బుద్ధుని విగ్రహం దగ్గర కొంతసేపు ఆగవచ్చు. ఒక్కో దీవిని చుట్టి వస్తుంటే మనం ప్రకృతి ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విజేతగా ఒకింత అతిశయంగా ఫీలవుతాం. అన్నట్లు చేపలతో ఫుట్ మసాజ్ సౌకర్యం కూడా ఒక దీవిలో ఉంది. చేపలు పట్టే అమ్మాయి మదుగంగలో ఒకమ్మాయి చిన్న తెడ్డు పడవలో చేపలు పడుతూ కనిపించింది. ‘నువ్వు ఆడపిల్లవి, ఈ పనులు నువ్వు చేసేవి కాదు’ అని అడ్డగించే వాళ్లు లేకపోతే అమ్మాయిలు ఏ పనిలోనైనా అద్భుతాలు సాధిస్తారనిపించింది. ఆ అమ్మాయికి హాయ్ చెప్పి, మనసులోనే సెల్యూట్ చేసుకుని ముందుకు సాగిపోయాం. తిరుగు ప్రయాణంలో ఒక దీవి దగ్గర గబ్బిలాలు భయం గొల్పాయి. దీవి నిండా చెట్లకు తలకిందుగా వేళ్లాడుతూ నల్లటి పెద్ద పెద్ద గబ్బిలాలు. ఇంకొద్ది సేపు చూడాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ ఆ దృశ్యం ఆహ్లాదంగా అనిపించక ముందుకు సాగిపోయాం. ఇక్కడ ముందుకు సాగిపోవడం అంటే బయలుదేరిన ప్రదేశం వైపుగా అన్నమాట. పడవ దిగేటప్పటికి రెస్టారెంట్లో వంట సిద్ధంగా ఉంది. రివర్ సఫారీకి బయలుదేరేటప్పుడే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు. రకరకాల కూరగాలయలను కొబ్బరి పాలతో ఉడికించిన కూరలతో మంచి భోజనం పెట్టారు. చేపల కూర కూడా రుచిగా ఉంది. ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... మాన్‌గ్రోవ్ బారుల మధ్య నదిలో విహారం అద్భుతంగా ఉంటుంది. చెట్లు ఒక్కో చోట నదిని ఇరుకు చేస్తాయి. గుహలోకి వెళ్లినట్లు పడవ కొమ్మల మధ్య దూరి పోతుంది. నది మీద ఇనుప వంతెనలుంటాయి. వాటి దగ్గరకు వచ్చినప్పుడు దేహాన్ని బాగా వంచి పడవలో ఒదిగి కూర్చోవడం, చిన్నపిల్లల్లాగ భయంభయంగా వంతెన వెళ్లిపోయిన తరవాత పైకి లేవడం, ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్... లండన్ బ్రిడ్జి ఫాలింగ్ డౌన్ అని పాడుకున్నట్లే... ఈ రివర్ సఫారీలో ‘కమింగ్ సూన్ కమింగ్ సూన్ వన్మోర్ బ్రిడ్జ్ ఈజ్ కమింగ్ సూన్’ అని పాడుకుంటూ పడవలో దాక్కోవడం... పర్యాటకులను చిన్న పిల్లలను చేస్తుంది. – వాకా మంజులారెడ్డి (చదవండి: పర్యాటకుల స్వర్గధామం కోనసీమ, ఆతిథ్యం నుంచి ఆత్మీయత వరకు..) -
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్‌జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
అప్పుడు పాచి పని చేసింది.. ఇప్పుడు లెక్చరర్‌గా రాణిస్తోంది
పిల్లల చదువుల కోసం ఇళ్లలో పాచిపనులు చేసిన మధు ఇప్పుడు కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పాఠాలు చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ చదువులు మీరేం చదువుతారని పిల్లలకు అడ్మిషన్ ఇవ్వలేదు. అలాంటి ఆమె పిల్లలు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ప్రతిరోజూ పోరాటమే అని వివరిస్తారు రాజస్థాని భిల్వారా నివాసి మధు. ఆమె గురించి అడిగితే సక్సెస్‌ని ఏ విధంగానైనా కష్టపడి సాధించుకోవచ్చు అని చెబుతుంది. ‘‘మేం ఆరు మంది తోబుట్టువులం. మా నాన్న చనిపోయినప్పుడు నాకు నాలుగేళ్లు. ఎన్నో ఇక్కట్ల మధ్య పెరిగాను. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక పెళ్లయింది. నా భర్త ఒక కంపెనీలో వర్కర్‌గా పనిచేసేవాడు. అతని జీతం ఇంటి అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. పిల్లలు పుట్టాక ఇంకా సమస్యలు పెరిగాయి. దీంతో కుట్టుపని మొదలు పెట్టాను. కొంత కాలానికి మా ఆయనకు కీళ్లనొప్పులు వచ్చి, ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన చేస్తున్న పనిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఈ కష్టకాలంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వారి స్కూల్‌కు దగ్గరలో కుట్టుమిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. అక్కడ కూర్చొని కుట్టుపని చేసేదాన్ని. అక్కడ బ్యాగులు, కవర్లు తయారు చేయడం మొదలుపెట్టినప్పుడు, ఆ స్కూల్ టీచర్ ఒకరు నేను చాలా త్వరగా వర్క్ నేర్చుకుంటానని గమనించారు. నా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని కాన్వెంట్ స్కూల్లో చేర్పించడానికి వెళితే, ‘మీరు చదువుకోలేదు, స్కూల్ ఫీజులు కూడా కట్టలేరు, అడ్మిషన్ ఇవ్వలేం’ అన్నారు. ఈ విషయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ నేను కుట్టుపని చేస్తున్నప్పుడు బ్యాగుల తయారీ గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేవారు. ఆ సమయంలో పిల్లలతోపాటు నన్ను కూడా చదువుకోమని ప్రోత్సహించారు. అందుకు తగిన దూరవిద్య ఫామ్స్ కూడా తెచ్చి ఇచ్చారు. దీంతో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, నేను కుట్టుమిషన్ దగ్గరే చదువుకునేదాన్ని. రోజూ ఉదయాన్నే నాలుగిళ్లలో పనులు చేయడం, కుట్టుమిషన్‌పై బ్యాగులు కుట్టడం, ఖాళీ సమయంలో డిగ్రీ పుస్తకాలు చదవడం... ఇలాగే నడిచేది. అడ్డంకిగా మారిన పరిస్థితులు నేను పట్టుదలగా చదువుకోవడం చూసిన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా నన్ను ప్రోత్సహించేవారు. పిల్లలు కూడా నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే, మా అత్తగారు ఆపేవారు. మామగారికి మా బంధువులు వెక్కిరిస్తున్నారని చెప్పేవారు. ఆమె సాయంత్రం పూట ఎక్కడకు వెళ్తుందో, ఎక్కడి నుండి వస్తుందో అని విపరీతపు మాటలు రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ, నా భర్త వాటన్నింటినీ పట్టించుకోవద్దని చెప్పేవారు. నేను ఎం.ఏ. పరీక్షలు రాస్తున్నప్పుడు మా మామగారు చనిపోయారు. దీంతో చదువును వదులుకునే పరిస్థితి వచ్చింది. కానీ, స్కూల్ టీచర్ శైలజ వచ్చి మా అత్త గారికి నచ్చచెప్పి, నన్ను చదువు కొనసాగించమని ప్రోత్సహించ డంతో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాను. లెక్చరర్‌గా చేస్తూనే.. మొదటిసారి నెట్లో అర్హత సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పొలిటికల్ సైన్స్‌లో ఎం.ఏ. పూర్తిచేసి, పీహెచ్‌డీకి అడ్మిషన్ తీసుకున్నాను. పిల్లలు పెద్దవడంతో డబ్బు అవసరం కూడా పెరిగింది. దీంతో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా చేరాను. నెలకు ఆరువేల రూపాయలు వచ్చేవి. వాటితోనే ఇల్లు గడవదని, టైలరింగ్ పనులు చేస్తూనే ఉండేదాన్ని. కానీ, మనం అనుకున్నవి అన్నీ జరగవు కదా. మా వారి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ట్రీట్మెంట్ నెలలపాటు కొనసాగింది. దీనిని తట్టుకుంటూనే నా జీవన పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కూతురు ఐఐటీలో సీటు సంపాదించి, మాస్టర్స్ కూడా చేసింది. కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు. నాలుగిళ్లలో పనిచేసుకునే నేను ఇప్పుడు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకున్నాను. పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే మంచి ఉద్యోగాల్లో వారిని చూడబోతున్నాను’’ అని ఆనందంగా వివరించే మధు జీవనపోరాటంలో విజయం ఒక్కరోజుతో సాధ్యం కాలేదని, ప్రతిరోజూ కఠోరశ్రమ చేస్తే వచ్చిందని చెబుతోంది మధు. -
పాపం..! నిరుద్యోగులే.. అతని దొంగ ఉద్యోగానికి బలి పశువులు..!!
-
విషాదంలోనే మూడు గ్రామాలు
కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంపై పోలీసుల ఆరా.. చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తలకొరివి పెట్టిన తనయ చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది. -
మాజీ ఎంపీ పొంగులేటికి ఎమ్మెల్సీ తాత మధు సవాల్
-
అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం
సాక్షి, బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింధగి సీఐ రవి, అతని భార్య మధు అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య ముగిసాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న పిల్లలు అమ్మా,నాన్న..ఇక సెలవు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. వీడ్కోలు పలుకుతున్న సీఐ దంపతుల పిల్లలు వారి కడ చూపు కోసం తరలివచ్చిన జనంతో సీఐ రవి స్వగ్రామం హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా రట్టిహళ్లి వీధులు కిక్కిరిసాయి. గ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని పోలీసు లాంఛనాల మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. మృతదేహలకు పూలమాలలు వేసి కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం: సీఐ దంపతుల దుర్మరణం) -
సౌదీలో రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లాకు చెందిన మధు మృతి
-
సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ..
దుబ్బాకటౌన్ (మెదక్): సౌదీ అరేబియాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మొగుల్ల మధు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు ఉన్నత విద్య పీజీ, బీఈడీ చదివాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రాకపోవడం.. ఉన్న ఊళ్లో సైతం ఎలాంటి ఉపాధి లేకపోవడంతో గత్యంతరం లేక పని కోసం 2009లో గల్ఫ్ బాట పట్టాడు. 13 ఏళ్లుగా అక్కడ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సౌదీ నుంచి సెలవులపై స్వదేశానికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వారం క్రితం(జూన్ 1న) మళ్లీ సౌదీకి తిరిగి వెళ్లి నాలుగు రోజుల క్రితమే డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు తాను నడుపుతున్న డీసీఎంను మరో వాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న ఆయన పెద్దన్న నర్సింలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధుకు భార్య లావణ్యతో పాటు కొడుకు అశ్విత్(10), కూతరు వేదశ్రీ(2), వృద్ధులైన తల్లిదండ్రులు బాలయ్య, లక్ష్మి ఉన్నారు. చదవండి: (మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..) మమ్మీ .. నాన్న రాడా మధు మృతిచెందాడన్న విషయం తెలియడంతో కుటింబీకులు, బంధువులు, గ్రామస్తులు రోదించడాన్ని చూస్తూ ఆయన పిల్లలు నాన్నకు ఏమైంది.. నాన్న ఇంటికి రాడా? అంటూ ఏం అర్థం గాక అమాయకత్వంతో బంధువులను అడుగడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లి ఏడస్తుంటే నాన్న ఎప్పడోస్తడు మమ్మీ అంటూ అడగడంను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు. శోక సంద్రమైన రాజక్కపేట అందరితో కలిసి మెలిసి ఉండే మధు.. సౌదీలో మృతిచెందడంతో రాజక్కపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాక గల్ప్ పోయిండు. వారం క్రితమే పోతున్నా అంటూ అందరినీ కలిసి చెప్పి పోయిండు ఇంతలోనే ఈఘోరం జరిగిందంటూ అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం) -
పవన్‌కల్యాణ్‌పై సీపీఎం మధు సీరియస్
సాక్షి, విశాఖపట్నం: పవన్‌కల్యాణ్‌కు ఒక సిద్ధాంతమంటూ లేదని సీపీఎం నేత మధు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీల గురించి మాట్లాడకుండా.. పవన్ పొత్తులపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు. చదవండి: పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి గతంలో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు.. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తు అంటున్నాడు.. వామపక్షాలతో పొత్తు అని మాకు తెలియకుండానే పవన్ కల్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడంటూ నిప్పులు చెరిగారు. పవన్ తీరు చూస్తూంటే జనసేనకు ఒక సిద్ధాంతం అంటూ లేదని సీపీఎం మధు వ్యాఖ్యానించారు. -
విశాఖ ఉక్కు కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం: విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆంధ్రా భవన్ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదు’’ అని తెలిపారు. ఒక సంవత్సరం పాటు పోరాటాన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని.. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు అన్నారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. -
‘కేంద్ర’ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించండి
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రతిపాదించిన విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ బిల్లును తిరస్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ‘విద్యుత్ పంపిణీ పునరుద్ధరణ పథకాన్ని’ తిరస్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ అంశాన్ని కేంద్రం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగాన్ని ప్రైవేటీకరించి, ఫ్రాంచైజీల పేరుతో దళారులను ప్రవేశపెట్టడం ఈ పథకం లక్ష్యంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించే చర్యలను ఆపాలని మధు డిమాండ్ చేశారు. అలాగే చట్టవిరుద్ధంగా పౌరులు, ప్రజాప్రతినిధులపై నిఘా పెడుతున్న ఇజ్రాయల్ స్పై సాఫ్ట్వేర్ ‘పెగాసెస్’ను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేసినట్టు మీడియాలో వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మధు పేర్కొన్నారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, పౌరులపై నిఘా ఏ రూపంలో ఉన్నా వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
నాన్న చనిపోవడంతో అమ్మ అనాథగా వదిలేసి వెళ్లింది: నటి
నటి మధు కృష్ణన్.. అటు సినిమాల్లో సహనటిగా, ఇటూ పలు సీరియల్లో నటిస్తూ ఫుల్ బిజీగా అయిపోయింది. దాదాపు 1300లకు పైగా స్టేజ్ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం దేవత, జానకి కలగనలేదు, హిట్లర్ గారి పెళ్లాం వంటి సీరియల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక షోకు అతిథిగా వచ్చిన ఆమె చిన్నతంలో ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తుచేసుకుంది. పదేళ్లకే తల్లిదండ్రులకు దూరమై అనాథలా పెరిగినంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. మధు మాట్లాడుతూ.. ‘నా పదేళ్ల వయసులో మా నాన్న రోడ్డు యాక్సిండెంట్‌లో చనిపోయారు. అమ్మకు అప్పటికి 25 ఏళ్ల వయసు. చిన్న వయసులోనే నాన్న చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య అమ్మను తీసుకుని వెళ్లిపోయారు. నేను ఆడపిల్లనని, నన్ను పోషించే స్థోమత వారికి లేదని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి మా అమ్మను మాత్రమే తీసుకెళ్లారు. దీంతో చిన్నప్పడే అమ్మనాన్నకు దూరమయ్యాను. అయితే బంధువులంతా నన్ను ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించి వదిలించుకొమ్మని చెప్పినా కూడా నానమ్మ, తాతయ్య నా బాధ్యతను తీసుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు నేను వెళ్లి మా తాతయ్య కాళ్లు పట్టుకుని ఏడ్చాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను.. మీకు ఉన్నదే నాకు పెట్టండి చాలు అని వేడుకున్నాను’ అంటూ భావోద్యేగానికి లోనయ్యింది. అయితే అప్పటికే నానమ్మ తాతయ్యకు వయసు మీద పడిందని, కనీసం నడవలేని స్థితిలో కూడా వారు లేరని పేర్కొంది. ‘వారిద్దరూ చాలా పెద్దవారు. అయినా కష్టపడి నన్ను పెంచారు. వాళ్లు తినకపోయిన నాకు పెట్టెవారు. అయితే నేను ఎప్పుడు చదువులో ఫస్ట్ క్లాస్ వచ్చేదాన్ని. 10వ తరగతి తర్వాత నన్ను చదివించే స్థోమత లేకపోవడంతో మా పక్కింటి బామ్మ వాళ్లు నన్ను డిప్లమా వరకూ చదివించారు. అంతేకాదు నాకు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. ఇంతలో తాతయ్య చనిపోవడంతో మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో చదవుతూనే స్టేజ్ షో చేయడం మొదలుపెట్టాను’ అని పేర్కొంది. స్టేజ్ షోలు చేసే సమయంలో భయం, బాధ వెంటాడేవని, చదువు ఆగిపోతుందని బాధతోనే స్టేజ్ షోలు చేసేదాన్నన్నారు. ‘లోపల బాధపడుతూనే పైకి నవ్వుతూ ఉండేదాన్ని. అలా మెల్లమెల్లగా యాంకరింగ్ మొదలుపెటి తొమ్మిదేళ్లలో దాదాపు 1300 స్టేజ్ షోలు చేశా. ఇక మళ్లీ వెనక్కితిరిగి చూసుకోలేదు. కాలేజ్‌కి వెళ్తూనే స్టేజ్ షోలు చేశా.. ఈవెంట్స్ చేస్తూనే బీటెక్ పూర్తి చేశా.. ఎంటెక్ కూడా స్టార్ట్ చేశా కానీ ఇక చాల్లే అనుకుని ఎంటెక్ మధ్యలోనే మనేశా. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నాను.. ఒంటరి అని బాధపడలేదు. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్ని ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది మధు. చదవండి: ఘనంగా సీరియల్ నటి కీర్తి సీమంతం..ఫోటోలు వైరల్ -
ఠాగూర్ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు
ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రాక్ బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా హిట్ సాధించినప్పటికీ ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక వ్యవహారాల కారణంగా క్రాక్ విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సంపాదించుకుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టి ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. అంతేకాకుండా నేటి నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘క్రాక్’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
పవన్, బీజేపీల నంగనాచి మాటలకు మోసపోవద్దు
కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ ఏర్పాటును బీజేపీ ఇక్కడ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో మద్దతు పలుకుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. పవన్‌కల్యాణ్ కూడా బీజేపీ పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి నంగనాచి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివీస్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. స్థానికులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, జైలులో ఉన్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’
సాక్షి, విజయవాడ: కరోనా కేసులు, రాష్ట్రంలోని పరిస్థితులు పరిగణనలోకి తీసుకునే ఎన్నికలకు ఈసీ ముందుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాలన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రమాద పరిస్థితులు కనబడుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై నిర్లక్ష్యం పనికిరాదన్నారు. (చదవండి: ఆంధ్రజ్యోతి ఆనాడు ఎందుకు రాయలేదు..?) ‘‘బీజేపీతో కలిశాక పవన్‌కల్యాణ్‌కు తొలిచిన ఆలోచననే జమిలి ఎన్నికల మాట. జమిలి ఎన్నికలు వస్తే జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలకే ప్రమాదం. అధికారంలో ఉన్న బీజేపీ.. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతుంది. సోము వీర్రాజు తల, తోక లేని రాజకీయాలను రాష్ట్రంలో నడుపుతున్నారు. మతోన్మాదం మీద ఆధారపడ్డ పార్టీ బీజేపీ. దేశం మొత్తాన్ని కార్పొరేట్లకు బీజేపీ తాకట్టు పెడుతుంది. వామపక్షాలు నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడాయి. నేడు రైతుల కోసం ఉద్యమిస్తున్నాయి. బీజేపీ రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు సోము వీర్రాజు ఎక్కడున్నారు..?. కార్మిక చట్టాలు కాల రాసినప్పుడు నోరు మెదపలేదే’’ అని మధు ప్రశ్నించారు. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) -
‘వారికి టీడీపీ వత్తాసు అందుకే..’
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ దెబ్బకొట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీ తెచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలకు నిన్న నిరసన తెలిపామని, దానికి కొనసాగింపుగా ఈ నెల 29, 30.. అక్టోబర్ 1 వ తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన దీక్షలకు పిలుపునిస్తున్నామని తెలిపారు. (చదవండి: భగవంతుణ్ణి, పాలకులను కులమతాల్లో ఇరికించవద్దు) ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని నాడు చెప్పిన బీజేపీ.. అన్ని హమీలను పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అంతర్వేది ఘటనను ఉపయోగించుకుని రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇదే బీజేపీ పార్లమెంట్లో రైతాంగ వ్యతిరేక బిల్లులు చేస్తోందని, కరోనా వైపరీత్యాన్ని ఉపయోగించుకుని ఒక వైపు ఆర్థిక రంగంలో కార్పొరేట్ల ప్రయోజనానికి.. మరో వైపు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో బలపడడానికి చూస్తోందని విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్‌ను సాధించాలని బీజేపీకి టీడీపీ వత్తాసు పలుకుతుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మధు నిప్పులు చెరిగారు. ‘‘పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా, విభజన హామీలపై మడమ తిప్పి బీజేపీ పక్కన చేరాడు. సోము వీర్రాజు రాష్టంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. అంతర్వేది ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి. ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఏరుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. దేశంలో రైతాంగ ఉత్పత్తులును కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నారు. గాంధీని చంపిన ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలని చూస్తోందని’’ ఆయన ఆరోపించారు. అక్టోబర్ 2న గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా శాంతియుతంగా పోరాడే వారికి వామపక్షాలు మద్దతిస్తున్నాయని’’ మధు తెలిపారు. (‘ఆ దాడులు వెనుక కుట్ర కోణం’) -
ఏసీబీ కేసు.. శుభ పరిణామం
సాక్షి, విజయవాడ: అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సీపీఎం ఆహ్వానిస్తోంది. ఇది మంచి పరిణామం.. నేరస్తులు ఎవరో బట్టబయలు చేయాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలాకాలం నుంచి రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. కొందరు అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వంలో వుండి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ప్రయోజనాలు పొందారని.. వాటిపై విచారణ జరపాలని ప్రజలు కోరారు. హై కోర్టులో కేసు సైతం వేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.. అయితే ఇది సరైనది కాదని సుప్రీంకోర్టు రాష్ట్ర కోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యనం చేసింది. ఇది హర్షించదగ్గ పరిణామం. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎవరైతే పాల్పడ్డారో మొత్తం వివరాలు బట్టబయలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దానికి అనుగుణంగానే ఏసిబి కేసు నమోదు చేసింది. ఇది శుభపరిణామం’ అన్నారు.(చదవండి: చంద్రబాబు, లోకేష్‌లకు అవకాశం..) అంతేకాక ‘ఈ ప్రాంతంలో రాజధానిని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని కొందరు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు. అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయమైన ధర రాదు, నష్టపరిహారం రాధని అధికారంలో ఉన్న వారు రైతులను బెదిరించి.. భయపెట్టి మభ్యపెట్టి ఆ భూమలన్నీ వారే కాజేశారు. ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు’ అన్నారు మధు. -
‘నిమ్మగడ్డ రమేష్ వివరణ ఇవ్వాలి’
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషనర్ నియామకం వివాదంగా మారి కోర్టుకెక్కిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బీజేపీ నాయకులను ప్రత్యేకంగా కలవడం అనేక అనుమానాలకు తావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఎటువంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిజాయితీగా ఉండడమే కాదు.. అలా ఉన్నట్టు కూడా వ్యవహరించాలని విమర్శించారు. లేనిపక్షంలో ప్రజల్లో రాజ్యాంగ సంస్థల పట్ల విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. (హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) ఈ మేరకు బుధవారం మధు మాట్లాడుతూ.. ‘‘ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చింది. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ సమావేశం జరిగింది. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?) ఇక ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఈఎస్ఐ స్కామ్ :అవినీతి సొమ్మును రికవరీ చేయాలి
-
ఫోన్ కాల్సే అతడి పెట్టుబడి..
సాక్షి, సిటీబ్యూరో: ఫోన్ కాల్సే అతడి పెట్టుబడి.. వివిధ పేర్లు చెప్పి మోసాలు చేయడంలో దిట్ట.. గతంలో చీఫ్ సెక్రటరీ పేరుతో చీటింగ్ చేసి, ప్రస్తుతం ఇన్సూరెన్స్ ఆఫీసర్ అంటూ టోకరా వేశాడు. ఈ మోసగాడిని గురువారం పట్టుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నేపథ్యంలో సింగరేణిలో ఉన్నతోద్యోగినంటూ మరొకరికి టోకరా వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఘరానా చీటర్ బానాల మధును అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. ఇలా సమాచారం సేకరించి.. కరీంనగర్ జిల్లా తాడిచెర్ల గ్రామానికి చెందిన మధు ప్రస్తుతం వరంగల్‌లోని విద్యానగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంటి యజమాని బంధువులు నగరంలోని ఖైరతాబాద్ సమీపంలో ఉన్న పంజగుట్ట మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్నారు. నగరంలో నివసించే వారిలో ఓ పెద్దాయన కొన్నాళ్ల క్రితం మరణించారు. ఈ విషయం తన ఇంటి యజమాని ద్వారా వారి వివరాలు, కుమారుడి ఫోన్ నంబర్‌తో పాటు చిరునామా సైతం తెలుసుకున్న మధు మోసానికి తెరలేపాడు. చనిపోయిన వ్యక్తి కుమారుడికి కాల్ చేసిన అతగాడు తాను ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ తండ్రి తన వద్ద ఓ బీమా పాలసీ తీసుకున్నారని, దాని విలువ ప్రస్తుతం రూ.19 లక్షలుగా ఉందని నమ్మబలికాడు. పన్నుల పేరుతో.. అతడికి పూర్తిగా నమ్మకం కలగడానికి ఇంటి చిరునామా, సమీపంలోని ల్యాండ్ మార్క్స్ కూడా చెప్పాడు. దీంతో బాధితుడు మధు చెప్తున్నవి నిజమేనని భావించి ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలని అడిగాడు. దానికి వివిధ పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, అలా కాకుంటే ఇన్సూరెన్స్ మొత్తం రద్దు అవుతుందని బెదిరించాడు. దీంతో బాధితుడు చెల్లించడానికి అంగీకరించగా బ్యాంకు ఖాతాల నంబర్లు ఇచ్చిన మధు వివిధ దఫాల్లో రూ.3.2 లక్షలు డిపాజిట్ చేయించుకున్నాడు. డబ్బు చెల్లించినా బీమా మొత్తం రాకపోవడంతో బాధితుడు మధును సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించి కొన్ని రోజుల క్రితం సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఓసారి అరెస్టు... కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ నేతృత్వంలో ఎస్సైలు పి.సురేష్, శాంతరావు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు ఖాతాలు, ఫోన్ నెంబర్ల ఆధారంగా మధు నిందితుడని గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఇతగాడు 2015లోనూ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లినట్లు తేలింది. అప్పట్లో చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ పేరుతో రాష్ట్రంలోని ఆరుగురు జెడ్పీటీసీలకు ఫోన్లు చేశాడు. కేంద్రం అందించే ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పాడు. అవి మీ పేరుతో రిలీజ్ చేయడానికి రూ.30 వేల చొప్పున చెల్లించాలంటూ తన స్నేహితుడి బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చి కాజేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 2015 జూన్‌లో మధుతో పాటు అతడి స్నేహితుడు రాజశేఖర్‌ను అరెస్టు చేశారు. సింగరేణిలో ఉద్యోగం పేరుతో... మధును అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. అందులో రూ.2.4 లక్షలకు సంబంధించిన అనుమానిత లావాదేవీ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దీని ఆధారంగా ముందుకు వెళ్ళిన పోలీసులు మధు చేసిన మరో నేరాన్ని గుర్తించారు. నగరానికి చెందిన మరో యువకుడికి సింగరేణి సంస్థలో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్న ఇతగాడు అతడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఎర వేశాడు. దానికి అడ్వాన్స్ అని, ఇతర ఖర్చుల పేర్లు చెప్పి రూ.2.4 లక్షలు కాజేశాడని తెలుసుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న బాధితుడు గురువారం సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చిన ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. మధు నుంచి 20 గ్రాముల బంగారం, ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతిలో కస్టడీలోకి తీసుకుని విచారణ తర్వాత అతడి నేరాల చిట్టా బయటకు వస్తుందని అధికారులు చెప్పారు. -
మధుని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. గురువారం మధు నివాసానికి వెళ్లిన సీఎం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మధును పరామర్శించారు. ఈ సందర్భంగా మధుతో వారిద్దరు కాసేపు ముచ్చటించారు. -
దేశం అన్ని రంగాల్లో కుంటుపడింది
-
‘రాయితీ సొమ్మును విదేశాలకు తరలిస్తున్నారు’
సాక్షి, విజయవాడ: బీజేపీ విధానాలతో దేశంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీవీకే భవన్లో ‘కార్పొరేట్లకు వరాలు -సామాన్యులపై భారాలు’ అనే అంశంపై వామపక్షాల సదస్సు జరిగింది. బీజేపీ విధానాలను వామపక్షాలు ఎండగట్టాయి. ఈ సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ..ఆర్థిక మాంద్యం తో అన్ని రంగాలు కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని కూడా కార్పొరేట్లకు రాయితీలతో అనుకూలంగా మారుస్తున్నారని విమర్శించారు. ధనిక వర్గాలకు మోదీ ప్రభుత్వం ఊడిగం.. అన్ని ప్రభుత్వ రంగాల్లో ప్రైవేట్సంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు. డబ్బున్న వర్గాలకు మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. అంబానీ, ఆదానీలు వేలకోట్లకు పడగ లెత్తుతున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తుందని.. విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని ప్రస్తావించారు.16న కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త రాస్తారోకోలో భాగంగా విజయవాడలో రాస్తా రోకో నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరాకు కొట్టొచ్చినట్టు కనబడింది: మధు ఆర్థిక మాంద్యం తీవ్రత దసరా పండుగకు కొట్టొచ్చినట్టు కనబడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 10 శాతం నిరుద్యోగం నమోదయిందన్నారు. బ్యాంకుల వద్ద సొమ్ము తీసి కార్పొరేట్ రంగానికి రాయితీలు ప్రకటించారని మండిపడ్డారు. పన్నులు తగ్గించి, రాయితీలు ప్రకటించడం వలన ప్రభుత్వానికి రాబడి తగ్గిపోతుందన్నారు. రాయితీలలో వచ్చిన సొమ్ము భారతదేశంలో పెట్టుబడి పెట్టడం లేదని.. విదేశాలకు తరలిస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించిన రాయితీల వలన మాంద్యం మరింత అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని సూచించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి... కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని.. ప్రభుత్వ పనులకు నిధులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ నిలిపివేయాలన్నారు. 100 శాతం విదేశీ పెట్టుబడులు వాపసు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి, ఆత్మహత్యలు నిరోధించాలన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్ 3 వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. -
సారూ.. చదువుకుంటా!
దేవరకద్ర : తాను పనికి పోనని.. చదువుకుంటానని ఓ బాలుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో చోటుచేసుకుంది. దేవరకద్ర మండలం బల్సుపల్లికి చెందిన మధు (12) తల్లి మృతి చెందగా తండ్రి కృష్ణయ్య ఉన్నాడు. కూలీ అయిన కృష్ణయ్య మూడో తరగతి చదువుతున్న తన కుమారుడు మధును మూడేళ్ల క్రితం చదువు మాన్పించి మిర్యాలగూడ ప్రాంతంలో కూలీ పనులకు పంపించాడు. అయితే మధు ఇటీవల తిరిగి ఇంటికి రావడంతో తండ్రి కృష్ణయ్య మళ్లీ పనికి పోవాలని బాలుడిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే తాను చదువుకుంటానని, పనికి వెళ్లనని మధు మొండికేయడంతో కృష్ణయ్య కోపంతో చితకబాది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దిక్కు తోచని మధు మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు ఎవరూ లేరని, చదువుకుంటానని చెప్పాడు. స్పందించిన పోలీసులు వెంటనే ఈ విషయం ఎంఈఓ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మధును తీసుకువెళ్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించారు. చదువుకోవాలనే తన కోరిక నెరవేరడంతో మధు ఆనందం వ్యక్తం చేశాడు. -
ఆమెది హత్య కాదు.. ఆత్మహత్యే?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు తిరినట్లయింది. మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు శనివారం అనధికారికంగా వెల్లడించారు. రాయచురు రూరల్: రాయచూరును కుదిపేసిన ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు అనూహ్య మలుపు. గత నెల 13న నవోదయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మధు ఇంటి నుంచి అదృశ్యమైంది. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు ఆలయం వెనుక పొదల్లో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. జీవితంపై విరక్తితో మరణిస్తున్నట్లు ఒక లేఖ అక్కడ దొరికింది. ఆమెను దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు ధర్నాలు చేశాయి. సినీ ప్రముఖులు ఈ సంఘటనను ఖండిస్తూ సోషల్‌మీడియాలో ప్రకటనలిచ్చారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు చేపట్టి ఆమె ప్రియుడు సుదర్శన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని రెండువారాలకు పైగా విచారించింది. విచారణలో ఏం తేల్చారు విచారణలో సుదర్శన్ యాదవ్, మధుల మధ్య ఉన్న ప్రేమ గొడవలే ఆమె ఆత్మహత్యకు కారణాలులని సీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆమె మృతదేహానికి జరిపిన పోస్టుమార్టం వివరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక ఆధారంగా మధుపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు శనివారం అనధికారికంగా వెల్లడించారు. తొమ్మిదిరోజుల పాటు సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న సుదర్శన్ యాదవ్ తాను మధు 8వ తరగతి నుంచి 12వ తరగతి వర కు ఒకే కళాశాలలో చదువుకున్నామని, పీయూసీ తరువాత మధు ఇంజినీరింగ్‌ను ఎంచుకుందని, తాను బీకాంలో చేరానని అతడు వివరించారు. ఇద్దరి కళాశాలలు వేరే అయినా ప్రేమ కొనసాగిందని చెప్పాడు. వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని, ఇది సహించలేని మధు సుదర్శన్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని, ఈ గొడవలతో ఆమె ఆత్మహత్య చేసుకుందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించే యత్నం: ప్రజాసంఘాలు కాగా సీఐడీ వర్గాల తీర్మానంపై ఆమె తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కూతురిని హత్యేనని తల్లిదండ్రులు ముందునుంచి ఆరోపిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించడానికి, నిందితులను రక్షించడానికి సీఐడీ ప్రయత్నిస్తోందని పలు ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాలను కప్పిపెట్టడానికి ప్రయత్నం జరుగుతోందని, మధు పత్తార్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. -
వారి మధ్య ప్రేమ?.. సీఐడీకి కీలక సమాచారం
రాయచూరు రూరల్/ కంప్లి: సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి మధు పత్తార్ అనుమానాస్పదంగా మృతి కేసు విచారణలో సీఐడీ అధికారులకు పలు విషయాలు బయట పడుతున్నాయి. అదనపు డీజీపీ సలీం నేతృత్వంలోని అధికారుల బృందం దర్యాప్తు సాగిస్తోంది. నిందితుడు సుదర్శన్ యాదవ్‌ను క్షుణ్ణంగా విచారించి సమాచారం రాబడుతున్నాయి. సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవి శంకర్, సీఐ దిలీప్ కుమార్‌లు ఏడీజీపీతో పాటు విచారణలో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 13న ఇంటి నుంచి బయల్దేరిన మధు పత్తార్ (23) 16వ తేదీన నగరంలోని మాణిక్‌ప్రభు ఆలయం వెనుక గుట్టల్లో ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలిన సంగతి తెలిసిందే. నవోదయ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న మధు హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్ యాదవ్‌ల మధ్య ఎనిమిదేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నగరంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8, 9, 10వ తరగతి, కళాశాలలో 11, 12వ తరగతుల వరకు క్లాస్మేట్లుగా ఉన్నారు. యాదవ్ బీకాంలో చేరగా మధు ఇంజనీరింగ్‌కు వేర్వేరు కాలేజీల్లో చేరారు. అతని ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా ఉంది. అయినా ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో మధును యాదవ్ హత్య చేశాడో, లేక మధునే ఆత్మహత్య చేసుకుందా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేస్తున్నారు.గత రెండు వారాలుగా సీఐడీ అధికారుల బృందం నగరంలోనే తిష్ట వేసి విచారణ సాగిస్తోంది. సీబీఐతో దర్యాప్తు చేయించాలి మధుపత్తార్ అనుమానాస్పద మృతి కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని మంగళవారం ఏబీవీపీ తాలూకా శాఖ ర్యాలీని నిర్వహించి తహశీల్దార్‌కు వినతిప్రతాన్ని అందజేశారు. స్థానిక శారద పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రముఖ మార్గాల మీదుగా తహాశీల్దార్ కార్యాలయానికి చేరారు. మధుపత్తార్ హత్యకు కారకులైన దోషులను బంధించి ఉరిశిక్ష వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపి తాలూకా శాఖా అధ్యక్షులు ఎం.శివబసవనగౌడ కార్తీక్, గీతా పాల్గొన్నారు. -
మధు స్కూటీ తాళాలు, ఫోన్ అతనికి ఎలా వచ్చాయి
ఈ నెల 13వ తేదీన రాయచూ రు నగరం లో అదృశ్యమై 16వ తేదీన అక్క డి మాణిక్‌ప్రభు ఆల యం వెనుక గుట్టల్లో శవమై తేలిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద మృతి కేసులో సీఐడీ విచారణలో పురోగతి నమోదైంది. నిందితున్ని 4 రోజుల కస్టడీకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు మధు హంతకులను శిక్షించాలని రాయచూరుతో పాటు పలు చోట్ల ప్రజాసంఘాల ధర్నాలు ముమ్మరమయ్యాయి. రాయచూరు రూరల్: విద్యార్థిని మధు పత్తార్ (23) కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న సుదర్శన్ యాదవ్ (29)ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాయచూరు జిల్లా ప్రధాన కోర్టులో హాజరుపరచిన సీఐడీ ఎస్పీ శరణప్ప నిందితుణ్ని విచారించడానికి 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కోర్టు 4 రోజులకు మాత్రమే అనుమతించింది. సాయంత్రం నిందితున్ని జిల్లా జైలు నుంచి సీఐడీ అధికారులు విచారణకు తీసుకొని వెళ్లారు. ఇల్లు, కాలేజీలో సీఐడీ పరిశీలనలు మధు మృతిపై విచారణకు రాయచూరు వచ్చిన సీఐడీ అధికారుల బృందం బుధవారం మధు నివాసాన్ని పరిశీలించారు. సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవిశంకర్, సీఐ దిలీప్ కుమార్ తదితర నలుగురు అధికారులు మధు తల్లిదండ్రులను కలిసి వారి వద్ద నుంచి సమాచారం సేకరించారు. తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని,ఆమె ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని వారు అధికారులకు తెలిపారు. మధు పుస్తకాలను తనిఖీ చేశారు. అలాగే మధు చదివిన నవోదయ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులను, ప్రిన్సిపాల్‌ను సీఐడీ అధికారులు కలిసి వివరాలను సేకరించారు. మధు హత్య కేసు దర్యాప్తులో ఆమె రాసిన డెత్‌నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్? సుదర్శన్ యాదవ్ బావ (అక్కభర్త) ఆంజనేయులుసదర్‌బజార్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. ఇతడు కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మధు తల్లిదండ్రులు రేణుక, నాగరాజులు మూడురోజుల క్రితం బళ్లారి ఐజీపీ నం జుండ స్వామిని కలిసి మధు మృతి కేసు లో ఆంజనేయులు ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు. మధు స్కూటీ తాళాలు, మొబైల్ ఫోన్ ఆంజనేయులు చేతిలో ఉ న్నాయని, అవి అతనికి ఎలా వచ్చాయో విచారించాలని కోరారు. దీంతో ఉన్నతాధికారులు ఆంజనేయులను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్పీ కిశోర్‌బాబు, సీఐ రాజాసాబ్‌లను సంప్రదించగా స్పందన రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోలేదనేఆరోపణపై మహిళా పీఎస్ ఎస్ఐ బేబి మరియమ్మను కూడా సస్పెండ్ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం నుంచి ఆందోళనల్ని ఉధృతం చేయనున్నట్లు పలు విద్యార్థి, ప్రజాసంఘాలు తెలిపాయి. -
మధు మృతిపై ముమ్మర విచారణ
రాయచూరు రూరల్: ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానస్పద మృతి కేసు దర్యాప్తునకు సీఐడీ అధికారుల బృందంతో పాటు ఫోరెన్సిక్ బృందం రాయచూరులో పర్యటించింది. సోమవారం సాయంత్రం సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవి శంకర్, సీఐ దిలీప్ కుమార్, నలుగురు అధికారులతో కూడిన బృందం రాయచూరుకు వచ్చింది. మంగళవారం ఎఫ్ఎస్ఎల్ బృందం విచ్చేసింది. నగరంలో మాణిక్ ప్రభు దేవాలయం వెనుక ఉన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. మధును హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పూర్తి విచారణ చేస్తున్నారు. ఆమె సూసైడ్ నోట్‌గా చెబుతున్న లేఖను పోలీసుల నుంచి తీసుకున్నారు. తమ కూతురిని హత్యేనని తల్లిదండ్రులు రేçణుక, నాగరాజ్‌లు అధికారులకు తెలిపారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని అన్నారు. అంతటా సంతాపాలు మధు మృతి పట్ల రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా మధుకు న్యాయం చేయాలని కోరుతూ సంతాప సూచనలు, ప్లకార్డుల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాగల్‌కోట, మస్కి, బెంగళూరు, మలేషియాలో ఉంటున్న పలువురు మధు మద్దతుదారులు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. -
హంతకులను వదిలిపెట్టొద్దు
రాయచూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద మృ తి కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు బ ళ్లారి ఐజీపీ రాయ చూరుకు వచ్చి సమీక్షించారు. తమ కంటివెలుగును కబళించిన హం తకులను పట్టుకుని శిక్షించా లని కన్నవారు డిమాండ్ చేశారు. రాయచూరు రూ రల్: తమ కూతురు విషయంలో న్యాయం చేయాలని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ తల్లిదండ్రులు రేణుక, నాగరాజ కోరారు. ఆదివారం రాయచూరుకు వచ్చిన బళ్లారి ఐజిపి నంజుండస్వామికి వారు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలన్నారు. కూతురిని బలిగొన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదని కోరారు. కాగా, నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు సుదర్శన్‌ను ఆరుబయట కూర్చో బెట్టి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, అతనికి రక్షణ కల్పించడంలో పోలీసుల ఆసక్తి ఏమిటో అర్థం కావడం లేదని వాపోయారు. ప్రత్యేక దర్యాప్తు బృందం: ఐజీపీ ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది, కేసు విచారణకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పా టు చేశాం అని బళ్లారి ఐజీపీ నంజుండప్పస్వామి తెలిపారు. ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. మధును హత్య చేసిన హంతకుల ను పట్టుకుంటామని తెలిపారు. విచారణ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులకు శిక్షలు విదించేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఊహగానాలకు అవకాశం కల్పించరాదని అన్నారు. పోస్టుమార్టం, ఇతర నివేదికలు రావాల్సి ఉందన్నారు. కేసు విచారణ సిఐడికి అప్పగింత రాయచూరు నగరంలో ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానస్పద మృతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. నవోదయ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యం కావడం, 16న గుట్టల్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కనిపించడం తెలిసిందే. ప్రేమించలేదని అక్కసుతో ఒక యువకుడు ఆమెను అంతమొందించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పోలీసుల అసమర్థతపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. సర్కారు ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశించింది. -
రాయచూరులో మరో నిర్భయ ఘటన?
సాక్షి, రాయచూరు: ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవితను అందుకుంటుందని ఆశించిన ముద్దుల కూతురు అనాథ శవమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ప్రేమపేరుతో వెంటాడి వేధించిన ఓ యువకుడే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మధుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని మధు పత్తార్ (23) అనుమానాస్పద మృతి కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మరో నిర్భయ ఘోరాన్ని తలపించే ఈ విషాదంపై సినీ, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తుండడం, తల్లిదండ్రులు తమ బిడ్డది ముమ్మాటికి హత్యేనని చెబుతుండడంతో చర్చనీయాంశమైంది. ఏం జరిగింది వివరాలు.. మధు పత్తార్ రాయచూరు నగరంలో ఐడీఎస్ఎంపీ లేఔట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తండ్రి నాగరాజు పత్తార్ స్వర్ణకారుడు, తల్లి రేణుక గృహిణి. నగరంలోని నవోదయ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. నిత్యం కాలేజీకి వచ్చి వెళ్లేది. ఈ నెల 13న ఇంటర్నల్ పరీక్షలకు వెళ్లిన అమ్మాయి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎక్కడికీ పోదు, వస్తుందిలే అని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు తప్ప కేసు నమోదు చేసుకుని గాలించలేదు. మూడురోజులు గడిచిపోయాయి. 16వ తేదీన నగరంలోని మాణిక్ ప్రభు దేవాలయం వెనుకభాగంలో నిర్మానుష్యంగా వున్న గుట్టలపై యువతి శవం కనిపించింది. పోలీసులు ఆరా తీయగా అది మధు పత్తార్దేనని తల్లిదండ్రులు, స్నేహితులు గుర్తించారు. పలు అనుమానాలు ‘నేను ఇంజనీరింగ్ కోర్సులో పలు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. నా మరణానికి నేనే బాధ్యురాలిని’ అని ఉత్తరం మృతదేహం దగ్గర దొరికిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఎండిపోయిన చెట్టుకు ఉరి వేసుకోవడానికి ఆస్కారం లేదు. ఆమె కూర్చున్న స్థితిలో ఉరివేసుకుని ఉంది. ఇది ఎలా సాధ్యమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్ నోట్ కన్నడలో రాసి ఉంది. తమ కూతురికి కన్నడ రాయడం అంతగా రాదని, హంతకుడే ఆ లేఖను రాసి ఆమెతో సంతకం చేయించి ఉంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆత్మహత్య కాదు హత్యే.. న్యాయం చేయాలి: మధు తల్లి మొర అనుమానాస్పద రీతిలో మరణించిన తమ కూతురు, విద్యార్థిని మధు పత్తార్ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లి రేణుక కోరారు. శనివారం ఇక్కడ పాత్రికేయల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నెల 25వ తేదీన నగరంలో విద్యార్థులు, ప్రజలు, సంఘ సంస్థల సహకారంతో భారీ ఆందోళన నిర్వహిస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. మధు తండ్రి నాగరాజు, విశ్వకర్మ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అతనిపైనే సందేహాలు సుదర్శన్ యాదవ్ అనే యువకుడు ఐదు నెలల నుంచి ప్రేమపేరుతో మధు పత్తార్‌ను వెంబడిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడని ఒత్తిడి చేసేవాడు. మధు అంగీకరించకపోవడంతో తనకు దక్కని ఆమె ఇంకొకరికి దక్కరాదని కక్ష పెంచుకున్నాడు. అర్జంటుగా మాట్లాడాలనే నెపంతో గుట్టలపైకి పిలుచుకెళ్లి చంపి చెట్టుకు వేలాడ దీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తల్లిదండ్రలు, సంఘ సంస్థల నాయకులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక రావాలి 13వ తేదీనే మధు విగతజీవిగా మారింది. 16న మృతదేహం బయటపడింది. ఎండలకు మృతదేహం కమిలిపోయి గుర్తుపట్టలేనంతగా మాడిపోయింది. నేతాజి నగర్ పోలీసులు కేసు నమెదు చేసుకున్నారు. ఇది హత్యేనని, హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిందితుడు సుదర్శన్ యాదవ్ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడని, అతన్ని విచారిస్తున్నారని తెలిసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే హత్య, ఆత్మహత్యనా? అనేది చెప్పగలమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
వారిలో కౌలు రైతులే అధికం : సీపీఎం మధు
సాక్షి, విజయవాడ : ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో కౌలు రైతులే అధికంగా ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శనివారం విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగిన కౌలు రైతు రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కనీసం 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ సాయం అందటం లేదని పేర్కొన్నారు. కౌలు రైతుకు పెట్టుబడి సాయంగా రూ.25 వేలు అందించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. భూ యజమానులకే ప్రభుత్వ సాయం : రామకృష్ణ భూ యజమానులకే ప్రభుత్వ సాయం అందుతోందని, నిజమైన పేద కౌలు రైతులకు సాయం అందకపోవటం వల్లే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలోని ఎంబీ భవన్లో జరిగిన కౌలు రైతు రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ల సమయంలోనే ప్రభుత్వానికి రైతులు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం స్వామీనాథన్ కమిటీ సిఫార్సులు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. పది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏమీ చేయలేదన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, రైతులు తమ ఇబ్బందులను చెప్పేందుకు ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తే వారిపై లాఠీచార్జ్ చేయించారని మండిపడ్డారు. -
చంద్రబాబు దీక్ష అంతా బూటకమే..
-
మోదీ పర్యటనను అడ్డుకుంటాం
-
మోదీ రాకను నిరసిస్తూ నిరసనలు
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను నిరసిస్తూ జనవరి ఐదున రాష్ట్ర వ్యాప్యంగా వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం జరిగిన 9 వామపక్ష పార్టీల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆయన మండిపడ్డారు. ఈనెల 28న కరువు బంద్‌ను పాటిస్తున్నట్లు వివిధ పార్టీల నేతలు ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఏడు యూనివర్సిటీలకు వీసీలు లేరని, 60 శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమపై కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విభజన హామీల అమలు కోసం జనవరి 4న పార్లమెంట్ ముందు ధర్మా చేస్తున్నట్లు మధు ప్రకటించారు. -
వైఎస్ జగన్‌పై దాడి దుర్మార్గం : సీపీఎం మధు
-
వైఎస్ జగన్‌పై దాడి దుర్మార్గం : సీపీఎం మధు
సాక్షి, కడప : వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి దుర్మార్గమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దాడి సంఘటనపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనలో సెక్కూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆ కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. జగన్ అనుచరులే దాడి చేశారనటం చిత్రవిచిత్రంగా ఉందని అన్నారు. అభిమానులు కూడా నాయకులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ దాడిని సీపీఎం పూర్తిగా ఖండిస్తోందని అన్నారు. ప్రజాతంత్రవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. జగన్‌కు మరింత సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అభిమాని అంటూ చెప్పడం విచారణ చేసే అధికారుల ఉత్సాహంపై నీళ్లు చల్లడమేనని మండిపడ్డారు. దాడిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలు ఉంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని అన్నారు. -
‘ఎస్పీ రాజకీయ నేతగా వ్యవహరించకూడదు’
-
‘ఎస్పీ రాజకీయ నేతగా వ్యవహరించకూడదు’
సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రజల నుంచి దూరమవుతోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేరలేదనే సీఎం సభలో ముస్లిం యువకులు ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్లకార్డులు చూపినందుకు నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టారు.. సీఎం సభలో జరిగిన దానిని వైఎస్సార్సీపీ కుట్ర అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎస్పీ ఒక అధికారిగా ఉండాలే కానీ.. రాజకీయ నేతగా కాదని అభిప్రాయపడ్డారు. అధికారులు ఇలా బరితెగించి మాట్లాడటం సరికాదని హితవుపలికారు. చంద్రబాబుది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చంద్రబాబు సర్కార్ యుద్ధం చేస్తోందని మండిపడ్డారు. ఉండవల్లిలో రైతుల అనుమతి లేకుండా విద్యుత్ వైర్లు ఎలా వేస్తారని నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలను అడ్డుకున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో మైనార్టీలకు, గిరిజనులకు, దళితులకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా చంద్రబాబు చేసిన అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని అరెస్ట్‌లు చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ వైఖరికి నిరసనగా బంద్‌కు సైతం పిలుపునిస్తామని తెలిపారు. ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. -
క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్
విజయవాడ: కర్నూలు జిల్లా క్వారీ పేలుడు ఘటనపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు స్పందించారు. విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ కొండ క్వారీలో ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుగుతుందని, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పెడచెవిన పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. వీటిని టీడీపీ ప్రభుత్వ హత్యలుగా భావించాలని పేర్కొన్నారు. కార్మికులకు భద్రతా చర్యలు లేవని, లేబర్ డిపార్ట్‌మెంట్‌పై కేసులు పెట్టకుండా ఉండాలన్నదే టీడీపీ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వలస కూలీలకు సంబంధించి లేబర్ రూల్ ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తే కార్మిక శాఖ రిజిస్టర్లో నమోదు చేయాలి..కార్మికులు ఏ కంపెనీలో పని చేస్తారో ఆ కంపెనీ రిజిస్టర్లో కూడా నమోదు చేయాలి..కానీ అలా చేయడం లేదని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ప్రజలకు రక్షణ లేకుండా చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చట్టాలపై పునరాలోచన చేయాలని సూచించారు. గ్రామదర్శిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మారిందని, అది ఒట్టి బోగస్ కార్యక్రమమని విమర్శించారు. క్వారీ ఘటనపై అన్ని రాజకీయపక్షాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలు రోజురోజుకూ బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. విద్యార్థులపై దాడులు, నాయకుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయ్. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి. నెల్లూరు జిల్లా రాపూర్‌లో వామపక్షాలు పర్యటిస్తాయి. దళితులు, విద్యార్థులు, కార్మికుల రక్షణ కోరుతూ సెప్టెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నా’ మని వెల్లడించారు. -
ఉద్యమాన్ని బాబు అణచడం దారుణం: సీపీఎం
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ కార్యదర్శి పి.మధు తెలిపారు. మరో నేత బాబూరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చూడటం దారుణంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక వైపు హోదా కోసం తామే పోరాడుతున్నామని చంద్రబాబు చెబుతూ మరో వైపు పోలీసులతో అరెస్టులు చేయించడం చంద్రబాబుకు తగదని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక హక్కు..దాన్ని చంద్రబాబు కాలరాస్తున్నారని మండిపడ్డారు. గతంలోననూ చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు..హోదా ఉద్యమానికి చంద్రబాబు మద్ధతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయవద్దని విన్నవించారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేయలేదా అని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్నిఅణచివేస్తామనుకోవడం చంద్రబాబు అవివేకమని వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ నుంచి నాకు ప్రాణహాని ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. నా భర్తకు ప్రాణహాని హైకోర్టును ఆశ్రయించిన న్యూడెమోక్రసీ నేత మధు భార్య పద్మ సాక్షి, హైదరాబాద్: పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న తన భర్త సీపీఐ–ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ప్రాంతీయ కార్యదర్శి ఎ.నారాయణస్వామి అలియాస్ మధుకు ప్రాణహాని ఉందని, వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన భార్య పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. -
కేసీఆర్ బెదిరింపులకు భయపడం
ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉ ద్యోగాలనుంచి తొలగిస్తామని బెదిరింపులకు పా ల్పడటం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కు నిదర్శమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్సు డి పోలో నిర్వహించిన గేటు ధర్నాకు ఆయన మద్ద తు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా క్రియాశీలకమన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆ ర్ 46 రోజులపాటు కార్మికులతో సమ్మె చేయిం చి.. ఇప్పుడు సమ్మె చేస్తే సంస్థను మూసి వేస్తామనడంలో ఆంత్యరం ఏమిటని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టాలబాట పడుతుందని ఆరోపించారు. సంస్థలో పని చేసేది 52 వేల కార్మికుల కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజ ల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికుల తమ ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు సమ్మె నిర్వహించి తీరాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దింపేంది కార్మికులేనన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ ఇచ్చింది కేవలం రూ.508 కోట్లు మాత్రమేనని, సంస్థను వ్యాపార రంగంగా కాకుండా ప్రజల సంక్షేమ రంగంగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్, జేఏసీ నాయకులు ఐలయ్య, సత్యనారాయణ, ఎజాజ్, వసంత్, హన్మంతు, సుధాకర్ పాల్గొన్నారు. -
విజయవాడలో సీపీఎం నేతల అరెస్ట్
సాక్షి, విజయవాడ: పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు రోడ్డులోని అప్సర సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ..కేంద్రం చీటికి మాటికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డీ విరుస్తుందని మండిపడ్డారు. పెట్రోల్ ధర రూ.31 ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాభై రూపాయలను పన్ను రూపంలో వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని, లేనట్లయితే ఆందోళనలు కొనసాగిస్తామని మధు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నేతల్లో మధు, బాబూరావు, కాశీనాధ్, తదితర నాయకులు ఉన్నారు. -
చంద్రబాబుది విలువలేని దీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్షకు విలువలేదని ఆ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. చంద్రబాబుది కేవలం రాజకీయ పోరాటం మాత్రమేనని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ మహాసభల ప్రాంగణంలో మధు విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు మోదీ ప్రభుత్వంతో అంటకాగి ఇప్పడు కోట్లకు కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టి దీక్షలు చేయటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి విపక్షాలన్ని హోదా కోసం పోరాడుతున్నాయని.. అప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం పోరాటాలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. ప్యాకేజీలతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ధర్నాలు, దీక్షలు అవసరం లేదన్న బాబు.. ఇప్పుడెందుకు దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. సీపీఎం, సీపీఐ, జనసేన కలసి ప్రజాసమస్యలపై పోరాడుతాయన్నారు. హోదా, విభజన హామీలు, ఏపీ రాజకీయ పరిస్థితులపై మహాసభల్లో చర్చ జరుగుతుందని.. పొత్తులపై ఎన్నికల సమయంలో చర్చిస్తామని మధు చెప్పారు. -
‘పవన్ ట్వీట్లు నూటికి నూరుపాళ్లు నిజం’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది దొంగ జపం.. దొంగ దీక్ష అని సీపీఎం నాయకుడు మధు విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా కేంద్రంతో చేతులు కలిపిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రత్యేకహోదా నినాదాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిందన్నారు. హోదా కోసం ఉద్యమాలు, బంద్‌లు చేపడితే పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. యువత, విద్యార్థులపై పీడీ యాక్టులతో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ నెల 16న బంద్‌కు పిలుపునిస్తే.. బంద్‌లు ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తాయి తప్ప, హోదా వస్తుందా అన్నారన్నారు. గతంలో హోదా వద్దని ఇపుడు ఆయనే హోదా కావాలంటారు.. అవిశ్వాసం అవసరం లేదని అవిశ్వాసం పెడతారని మండిపడ్డారు. దీక్షలో టీడీపీ కార్యకర్తలు తప్ప ప్రజల మద్దతు లేదన్నారు. హోదాపై తీర్మానం ఉంటుందన్నారు. ఈనెల 24న హోదా సాధనకోసం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని.. ఆ రోజు బ్లాక్‌డే కూడా పాటిస్తామని మధు స్పష్టం చేశారు. మరో వైపు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మధు స్పందించారు. చంద్రబాబుపై పవన్ చేసిన ట్వీట్లు నూటికి నూరుపాళ్లు నిజమని ఆయన వ్యాఖ్యానించారు. -
న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మధు ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ రమణకుమార్, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, మెదక్ ఏసీబీ డీఎస్పీ ప్రతాప్, మరో ఎనిమిది సీఐలతో పాటు మరి కొంతమంది పాల్గొన్నారు. న్యాయమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇటీవల తీవ్ర ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. న్యాయమూర్తి పలు కేసులను కావాలని పక్కదోవ పట్టించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, ఏకంగా జగిత్యాలలోని న్యాయవాదులు అంతా కూడా ఇటీవలే ధర్నా కూడా చేశారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రత్యేక హోదాపై చంద్రబాబు పిల్లిమొగ్గలు వేశారు
-
అఖిలపక్ష సమావేశం మధ్యలోనే ...
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంమధ్యలోనే సీపీఎం పార్టీ నేత మధు బయటకు వచ్చేశారు. అఖిలపక్షం చేసిన తీర్మానం రాష్ట్రానికి మేలు చేసేలా లేదని విమర్శించారు. రాష్ట్రం నష్టపోవడానికి కారణం తెలుగు దేశం, బీజేపీ పార్టీలే కారణమని ఆయన దుయ్యపట్టారు. ఏపీకి అన్యాయం చేసిన పాపం బీజేపీతో పాటు టీడీపీకి ఉంటుందన్నారు. ‘ దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు’ అని మధు పేర్కొన్నారు. అఖిలపక్ష డ్రామాతో చంద్రబాబు చేసిన పాపాన్ని అందరికి రుద్దాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ...‘బీజేపీ నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం చేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. పోలవరం నిర్వాసితుల డబ్బుకి కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ అంటోంది. బీజేపీ ఎంత అన్యాయం చేసిందో టీడీపీ అంతే అన్యాయం చేసింది. మేం ఎన్నిసార్లు అడిగినా సీఎం లెక్కలు చెప్పలేదు. మేం హోదా కోసం ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి, తులనాడారు. ఆ విషయాన్ని చంద్రాబాబును నిలదీశాను. తీర్మానం చేస్తామన్నారు...దాన్ని వ్యతిరేకించాను. రాష్ట్రానికి అన్యాయం చేసింది టీడీపీ, బీజేపీనే. చేసిన పాపాలన్నీ చేసి...అమ్మ, నాన్నని చంపినవాడు తల్లిదండ్రులు లేనివాడిని క్షమించండి అన్నట్లు...రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉంది. కేంద్రం కళ్లు మూసుకుని రాజకీయం చేస్తోంది. మేం మీతో కలిసి పోరాటం చేయమని ఖరాఖండిగా చెప్పాం. సీఎం ఎక్కడా పోరాటం చేస్తామని చెప్పలేదు. మేం పోరాడినప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన లేచారు. టీడీపీతో కలిసి పోరాటం చేసే ప్రసక్తే లేదు.’ అని స్పష్టం చేశారు. -
సీపీఎం వ్యాఖ్యలు: చంద్రబాబు సమాధానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం అఖిల సంఘాల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమస్యలు, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో పాల్లొన్న సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. ‘దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేది. మరోవైపు బీజేపీ అధ్యక్షడు అమిత్‌షా రాజకీయ స్కోరు కోసం లేఖ రాశారు. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించడం బీజేపీ లక్ష్యమ’ని అభిప్రాయపడ్డారు. మధు వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం సీపీఎం నేత మధు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. నాలుగేళ్లు తర్వాత రాష్ట్రానికి ఇవ్వాల్సింది అడిగితే ఇంత పెడసరిగా వెళుతున్నవారు.. తొలిరోజు నుంచే తాను దూకుడుగా వెళ్లి వుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా అన్నారు. అలా జరిగి ఉంటే ‘సీఎం కాస్త ఓపిక పట్టి వుంటే బావుండేది, దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ప్రయోజనాలు రాబట్టుకుంటే బావుండేది. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశార’ని అప్పుడు మీరే అనేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పసిగుడ్డు లాంటి రాష్ట్రమని, మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా ఉన్నామని ఆయన తెలిపారు. -
‘అసెంబ్లీ ముగిసేలోపు ప్రభుత్వం స్పందించాలి‘
సాక్షి, ఒంగోలు: ఒంగోలు కలెక్టరేట్ వద్ద సీపీఎం నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నీ విధాలా వెనుకబడిన ప్రకాశం జిల్లాను ప్రభుత్వం ఆదుకోకుండా, అడిగిన వారిపై నాన్ బెయిల్‌బుల్ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సీపీఎం నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మధు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వం స్పందించి ప్రకాశం ను వెనుకబడిన జిల్లాగా గుర్తించి.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘ఏపీ కోలుకోవటానికి 30 ఏళ్లు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీరును పలు పార్టీల కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజన హక్కుల సాధన సమితి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న విధంగా నిధుల కేటాయింపు జరిగిందా లేదా చెప్పాలని టీడీపీ నేతలను పార్థసారధి డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో బాబు కేవలం ఆయన స్వార్ధం కోసం పని చేస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆరోపించారు. బాబుకు మంచి వైద్యం చేయించాలి: సీపీఐ నేత రామకృష్ణ ‘రాష్ట్రానికి ఏం సాధించాలి, ఏవి కావాలన్న విషయం మీద ఒక్క చంద్రబాబుకి తప్ప, ఏపీ నేతలతో పాటు ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజితో సమానమని చెప్పారు. ఇప్పుడు అది నిజం కాదనే ధోరణిలో వ్యవహరిస్తూ పక్కా గందరగోళంలో ఉన్నారు. చంద్రబాబు సందిగ్ధత నుంచి ముందు బయటకు రావా. లేదా ఆయనకు మంచి వైద్యం అందించాలి. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలంటూ’ అన్ని పార్టీల నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది: సీపీఎం నేత మధు ‘రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు సంప్రదింపులకే బీజేపీ నేతలకు నాలుగేళ్లు పట్టిందా. 11 జాతీయ విద్యా సంస్థలకు, మరో 9 సంస్థలుకు అనుమతులు ఇచ్చారు. రూ. 9000 కోట్ల నిధులకు కేవలం రూ. 420 కోట్లు మంజూరు చేశారు. ఈ విధంగా నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది. ఇక ముసుగులో గుద్దులాటలు ఉండవు. మార్చి 5, 6 కల్లా అంతా తేలిపోతుంది. ఇన్నేళ్లలో అఖిలపక్షం ఏర్పాటు చెయ్యమంటే చేయనేలేదు. సీఎం దుర్మార్గంగా, ఏ బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రానిది ఒక నాటకం.. రాష్టానిది ఒక నాటకం. మార్చి 6వ తేదీ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని’ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన: కొణతాల రాష్ర్ట విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక విశాఖపట్నం బీచ్ లో మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శన నిర్వహించనుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. -
టీడీపీతోనే పోలవరానికి చిక్కులు: సీపీఎం
విజయవాడ: పోలవరం ప్రాజెక్టును తాము కడతామని టీడీపీ తీసుకోవడం వల్లే చిక్కులు మొదలయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కీలక అంశాలపై ప్రతిపక్షంతో ఎందుకు సీఎం సంప్రదింపులు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం సంస్కారం ఏమయ్యిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం పాతాళానికి తొక్కేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఆలోచన ఈ సీఎంకు లేదని వ్యాఖ్యానించారు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని,11 జాతీయ విద్యా సంస్థలకు రూ.6,600 కోట్లు రావాల్సి ఉండగా..కేంద్రం కేవలం రూ. 450కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం పెట్టిన ఖర్చుకు ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు అనే మాట సీఎం నోటి నుంచి రావడం బాధాకరమన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. మరో స్వతంత్ర పోరాటం అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. బీజేపీపై పోరాటానికి అందరూ ముందుకు రావాలని కోరారు.ఎన్నికల సంస్కరణలు అవసరమని, ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరుగుతోందని,35 శాతం ముఖ్యమంత్రులు నేర నేపథ్యం కలిగిన వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం తమ ఆదాయ వివరాలను ప్రకటించాలన్నారు. టీడీపీలోని అవినీతి ప్రజాప్రతినిధుల వ్యవహారంను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమంతోనే సమాధానమిస్తామని చెప్పారు. ఈ విషయంపై రేపు వామపక్ష పార్టీలతో పాటు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని తెలిపారు. -
తొమ్మిదేళ్ల తర్వాత ప్రతీకారం..
ప్యాపిలి: పాతకక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. తొమ్మిదేళ్ల జరిగిన ఓ హత్యకు ప్రతీకారంగా ప్యాపిలిలో శనివారం అర్ధరాత్రి జరిగిన హత్య సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని స్థానిక కుంటగడ్డ వీధిలో నివాసం ఉంటున్న తొండపాడు మధు (35) శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు మధును వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికారు. కొన ఊపిరితో ఉన్న మధును కుటుంబ సభ్యులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. మృతుడికి భార్య ఇంద్రజ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, డోన్, బనగానపల్లె సీఐలు రాజగోపాల్ నాయుడు, శ్రీనివాసులు, ప్యాపిలి, బనగానపల్లె, దేవనకొండ, బేతంచర్ల ఎస్ఐలు పీరయ్య, రాకేశ్, గంగాధర్, తిరుపాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి చిన్నాన్న తొండపాడు మద్దయ్య ఫిర్యాదు మేరకు తొండపాడు పాండురంగడు, రామాంజనేయులు, పూజారి సూర్యనారాయణ, ఓబులేసు, మధు, కొండా కొండన్న, పూజారి వెంకటేశ్, పోదొడ్డి శివ, డైలి రామాంజనేయులు, వైటీ చెరువు నాగేంద్ర, పూజారి శ్రీనివాసులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య పచ్చి బాలింత మధు, ఇంద్రజ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారం క్రితమే ఇంద్రజ మూడో శిశువుకు జన్మనిచ్చింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్న ఆమెను శనివారమే డిశ్చార్జి చేశారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చిన మధు భార్య, పొత్తిళ్లలో ఉన్న చిన్నారితో కొద్దిసేపు గడిపాడు. అనంతరం పట్టణంలో జరుగుతున్న తిరునాలను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తూ దారుణహత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. తొమ్మిదేళ్ల తర్వాత ప్రతీకారం.. 2009లో పట్టణంలోని స్థానిక శ్రీరామా టాకీస్ వద్ద తొండపాడు లక్ష్మీరంగయ్య దారుణ హత్యకు గురయ్యాడు. లక్ష్మీరంగయ్య, మధు దగ్గరి బంధువులే అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో వైరం ఉంది. లక్ష్మీరంగయ్యకు చెందిన నాటుసారా కుండలను మధు వర్గీయులే ధ్వంసం చేశారన్న నెపంతో అప్పట్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో మధు వర్గీయులు 2009లో లక్ష్మీరంగయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో మధుతో పాటు 16 మంది ముద్దాయిలుగా ఉన్నారు. అయితే గతేడాది డిసెంబర్లో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మీరంగయ్య వర్గీయులు మధును హతమార్చేందుకు పథకం పన్నారు. మధు ఇంటికి వెళ్లాలంటే ప్రత్యర్థి పాండురంగడు ఇంటిని దాటుకుని వెళ్లాలి. ఇదే అదనుగా భావించిన దుండగులు శనివారం రాత్రి తిరునాల నుంచి ఇంటికి వెళ్తున్న మధు పాండురంగడు ఇంటి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. -
ఏపీకి దగా: మధు
సాక్షి, గుంటూరు: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమీ లేదని, బడ్జెట్‌ను కేవలం రాజకీయ ప్రచారం కోసం వాడుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలున్న రాష్ట్రాలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారని ఆరోపించారు. కేంద్రం ఏపీని దగా చేసిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేహోదా కంటే ప్యాకేజీనే మంచిదంటూ ఇంతకాలం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. రేపు విజయవాడలో వామపక్షాల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్ కోసం తాము చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చేవారితో చేతులు కలపడానికి సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతోనైనా కలిసి పోరాటం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని మధు అన్నారు. -
మలయాళ సినిమా మొదలు పెట్టిన రానా
బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ద్విభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్న 1945, హాథీమేరి సాథీ సినిమాల్లో నటిస్తున్న రానా.. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుకొచ్చాడు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. ట్రావెన్ కోర్ రాజు మార్తండ వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో రాజా మార్తండ వర్మగా నటిస్తున్నాడు రానా. 18వ శతాబ్ధంలో జరిగిన కథతో భారీ చారిత్రక చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కె.మధు. ఈ సినిమాకు మార్తండ వర్మ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా 2018లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
‘అపర్ణ వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే హత్య చేశా’
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చందానగర్‌లో ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు మధు సోమవారం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మూడు హత్యలను తానే చేసినట్లు అతడు అంగీకరించాడు. పోలీసుల విచారణలో అతడు పలు విషయాలు వెల్లడించాడు. ‘ అపర్ణతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. అయితే ఆమె వేరే వ్యక్తితో చనువుగా ఉంటుంది. దాన్ని సహించలేకే హత్య చేశారు. ముందుగా కార్తికేయ, అపర్ణ తల్లి విజయమ్మను గొంతు నులిమి చంపాను. ఆ తర్వాత అపర్ణను గోడకేసి కొట్టి చంపాను.’ అని తెలిపాడు. కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ .. కూకట్‌పల్లికి చెందిన మధుతో కలిసి చందానగర్‌లో నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్‌గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్‌లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. -
కూర రాజన్నే సూత్రధారి
సాక్షి, మహబూబాబాద్: ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన చండ్రపుల్లారెడ్డి (సీపీ)బాట అజ్ఞాత దళం ఏర్పాటులో జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న కీలకమని మహబూబాబాద్ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ దళానికి 27 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు పలువురిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాలకు చెందిన 11 మంది 2016, సెప్టెంబర్ 9న హైదరాబాద్‌కు వెళ్లి కూర రాజన్నను కలిశారని, ఆ సమయంలో ఆయా జిల్లాల పరిధిలో సీపీబాట పేరుతో దళాన్ని ఏర్పాటు చేయాలని, ఆయుధాలు సరఫరా చేస్తానని రాజన్న చెప్పినట్లు విచారణలో మధు వెల్లడించాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 18న 27 తుపాకులు, మందుగుండు సామగ్రిని పంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు మరికొంత మందిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. -
సీపీబాట దళనాయకుడు మధు అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: సీపీఐ(ఎంఎల్)చండ్ర పుల్లారెడ్డి(సీపీ) బాట దళనాయకుడు షేర్ మధు అలియాస్ రమాకాంత్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. గూడూరు, కొత్తగూడ ఎస్సైలు గూడూరు మండలం భూపతిపేట, కొత్తగూడ రోడ్డుపై ఉదయం 8 గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బస్సులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి కనిపించాడు. అతడు బస్సు దిగి భూపతిపేట అడవి వైపు పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించగా అతడు ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన షేర్ మధు అలియాస్ రమాకాంత్‌గా తేలింది. పోలీసులు అతడి వద్ద నుంచి 12 బోర్తుపాకీ, 25 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. గోపన్న మాటలకు ఆకర్షితుడై దళంలోకి.. షేర్ మధు 2006లో న్యూడెమోక్రసీ దళ నేత గోపన్న మాటలకు ప్రభావితమై అతడి దళంలో చేరి 2012 వరకు కొనసాగాడు. అనంతరం గోపన్న దళంతో బేధాభిప్రాయాలు వచ్చి ఆవునూరి మధు దళంలోకి వెళ్లాడు. 2016 సెప్టెంబర్‌లో గంగారం మండలం పెద్దఎల్లాపూర్కు చెందిన బోయిని ఓంప్రకాశ్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. అతడు మధును సీపీబాట పార్టీలో చేరమని కోరగా అందులో చేరాడు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న ఆదేశాల మేరకు సీపీబాట దళం కార్యకలాపాలను ప్రారంభించారు. ఆయన ఆదేశాల మేరకు దళాలు వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను పార్టీ చందాల పేరు చెప్పి బెదిరించి వసూలు చేసేవారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌తో చెల్లాచెదురు.. డిసెంబర్ 14న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగి తొమ్మిది మంది చనిపోవడంతో మిగతా సభ్యులు భయంతో అక్కడి నుంచి చెల్లాచెదురయ్యారు. ఎన్కౌంటర్ గురించి తెలియగానే మధు తన వద్ద ఉన్న బోరు తుపాకీ, 25 రౌండ్లను గూడూరు అటవీ ప్రాం తంలో దాచి నర్సంపేటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కాడు. షేర్ మధుపై హత్య, బెదిరింపు కేసులు.. షేర్ మధుపై గూడూరు మండలం బొద్దుగొండ చిల్లగండి తండావద్ద జరిగిన ఇద్దరిని చంపిన కేసు, ఖానాపురం మండలం బుధరావుపేటలో నకిలీ తుపాకీతో కొమ్మినేని సోమయ్య అనే వ్యక్తిని బెదిరించిన కేసు, ఇదే గ్రామంలో పసునూరి అనూష అనే అమ్మాయిని మోసం చేసిన కేసులు ఉన్నాయి. షేర్ మధును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్, డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్, గూడూరు, మహబూబాబాద్ టౌన్ సీఐలు బానోత్ రమేష్, షేక్ అబ్దుల్ జబ్బార్, ఎస్సైలు సతీష్, యాసిన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఎక్కడ బాబూ..?
కోటగుమ్మం (రాజమహేంద్రవరం): విద్య, వైద్యం వ్యాపారంగా మార్చి అంగడి సరుకుగా అమ్మడం దారుణమనని, విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం యువత ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక అంబళ్ళ సూర్యారావు భవన్లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ప్రకారం ఇంటికో ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. విద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు తీసుకువెళుతున్నారని విమర్శించారు. ఇటువంటి తరుణంలో విద్యార్ధి, యువజనుల పోరాటాల ద్వారానే తమ హక్కులు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని దుయ్యబట్టారు. రూ. 2 వేల నిరుద్యోగ భృతి సంగతి ఎప్పుడో మరచిపోయారన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అసెంబ్లీలో చట్టాలు చేయాలని, అశ్లీల చిత్రాలపై నిషేధం విధించాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నాయకులు వంగమూడి కొండలరావు, కరిబెండి శ్రీనివాస్, వీసరపు రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక...: సమావేశం అనంతరం నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా గంటా జాన్ప్ర కాష్, ఎఐవైఎఫ్ జిల్లాఅధ్యక్షుడిగా అప్పారావునుఎన్నుకున్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్రను ఆహ్వానిస్తున్నాం
ఒంగోలు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చేపట్టనున్న పాదయాత్రను తాము ఆహ్వానిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వెల్లడించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజోపయోగమైన పాదయాత్రలు ఎవరు చేసినా తమ పార్టీ ఆహ్వానిస్తుందని, అందులో భాగంగా వైఎస్ జగన్ చేయనున్న పాదయాత్రను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దోపిడీదారుల కేటగిరీలో లెక్కకట్టాల్సి వస్తోందని మధు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులు, వారి కుటుంబీకుల అక్రమాల గురించి వారి పార్టీకి చెందిన నాయకులే విమర్శిస్తుంటే సీఎం నోరెత్తకపోవడమేంటని ప్రశ్నించారు. తన సహచర మంత్రులపై వస్తున్న విమర్శల పట్ల సీఎం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. -
న్యాయం జరగకపోతే ఉద్యమమే
రెవెన్యూ అధికారుల అవినీతి నిర్వాసితులకు అన్యాయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని, చట్ట ప్రకారం అమలు కావలసిన ప్యాకేజీ అమలు కావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ముంపు గ్రామాలైన కొరుటూరు, శివగిరి, తల్లవరం, గాజులగొంది, పైడిపాక, వాడపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. పోలవరంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలోనూ, అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. రెవెన్యూ అధికారులు అవినీతిలో కూరుకుపోయారని, జాబితాలో పేర్లు రాలేదని అడిగితే తిడుతున్నారని మధు విమర్శించారు. 2013 చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. మొదటి విడత గ్రామాలు ఖాళీచేయించారని యించారని, చేగొండపల్లి నిర్వాసితులకు మంచి భూములు ఇవ్వలేదని, ఇళ్లు కారిపోతున్నాయని అన్నారు. గిరిజనేతరులకు చెందిన 50 వేల ఎకరాల భూములు ఉండగా, వాటి జోలికి వెళ్లకుండా, వివాదాస్పద భూములు నిర్వాసితులకు ఇస్తున్నారన్నారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని, న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు.రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ ఈనెల 19విజయవాడలో రాష్ట్ర ప్రాజెక్టుల నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై సమావేశం రాజమహేంద్రవరంలో నిర్వమిస్తామన్నారు. సీపీఎం డివిజన్ నాయకుడు ఎ.రవి, బొరగం భూచంద్రరావు, గుడెల్లి వెంకట్రావు పాల్గొన్నారు. -
న్యాయం జరగకపోతే ఉద్యమమే
రెవెన్యూ అధికారుల అవినీతి నిర్వాసితులకు అన్యాయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని, చట్ట ప్రకారం అమలు కావలసిన ప్యాకేజీ అమలు కావటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ముంపు గ్రామాలైన కొరుటూరు, శివగిరి, తల్లవరం, గాజులగొంది, పైడిపాక, వాడపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలసి పర్యటించారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. పోలవరంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలోనూ, అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. రెవెన్యూ అధికారులు అవినీతిలో కూరుకుపోయారని, జాబితాలో పేర్లు రాలేదని అడిగితే తిడుతున్నారని మధు విమర్శించారు. 2013 చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. మొదటి విడత గ్రామాలు ఖాళీచేయించారని యించారని, చేగొండపల్లి నిర్వాసితులకు మంచి భూములు ఇవ్వలేదని, ఇళ్లు కారిపోతున్నాయని అన్నారు. గిరిజనేతరులకు చెందిన 50 వేల ఎకరాల భూములు ఉండగా, వాటి జోలికి వెళ్లకుండా, వివాదాస్పద భూములు నిర్వాసితులకు ఇస్తున్నారన్నారు. సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తామని, న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని అన్నారు.రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ ఈనెల 19విజయవాడలో రాష్ట్ర ప్రాజెక్టుల నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ మొదటి వారంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై సమావేశం రాజమహేంద్రవరంలో నిర్వమిస్తామన్నారు. సీపీఎం డివిజన్ నాయకుడు ఎ.రవి, బొరగం భూచంద్రరావు, గుడెల్లి వెంకట్రావు పాల్గొన్నారు. -
నంద్యాలలో పోలీసుల ఏకపక్ష వైఖరి
-
ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి
సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ అనంతపురం న్యూసిటీ: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ మోసగిస్తోందన్నారు. హద్దూపద్దు లేని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను అన్ని రంగాల్లో అసంతృప్తి పరిచిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేయడమే కాక, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన వాగ్దా నాలను అమలు చేయలేదన్నారు. అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయన్నారు. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలన్నారు. -
ప్రాణాలు తీసిన ఫ్రెండ్షిప్ డే
- ఆలస్యంగా ఇంటికి వచ్చిన విద్యార్థిని మందలించిన తల్లిదండ్రులు - మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు - 24 గంటలు అనాథగా మిగిలిపోయిన మధు శవం కాశీబుగ్గ: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి ఆలస్యంగా రావడం ఏమిటని అడిగినందుకు చిన్నబోయి క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు. ఈ హృదయవిధారక సంఘటన పలాసలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు పద్మనాభపురం కాలనీలో చెంచాన రాజేంద్ర, జ్యోతి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుమారుల్లో పెద్దవాడు చెంచాన మధు(21). ఇతడు కాశీబుగ్గలోని శ్రీమేధ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వెనుక భాగంలో దాబా నడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు. మధు చదువులో అంతంతమాత్రంగా రాణించడంతో తల్లిదండ్రులు బాగా చదువుకోమని నచ్చజెప్పేవారు. అయితే ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన మధు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చక్కని దుస్తులు ధరించి స్నేహితులతో కలిసి పలాసకు 7 కిలోమీటర్లు దూరంలో ఉన్న శివసాగర్ బీచ్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి సైతం ఇంటికి రాకుండా రాత్రి 8 గంటలకు చేరుకున్నాడు. ఉదయం వెళ్లి ఇప్పటివరకు రాకపోవడంపై తల్లిదండ్రులు మందలించారు. బుద్ధిగా చదువుకోకుండా బీచ్‌లలో తిరుగుళ్లేమిటని ఆగ్రహించారు. ఈ విషయం మధుకు రుచించక ఇంట్లో వారితో మాట్లాడకుండానే ఆ రాత్రి నిద్రించాడు. మనస్తాపానికి గురైన ఇతడు సోమవారం ఉదయం ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలాస నుంచి సున్నాదేవి వైపు ఉన్న రైలు మార్గంలో గుర్తుతెలియని రైలు కింద తలపెట్టి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే జీఆర్పీ సిబ్బంది హెచ్‌సీ పి.కోదండరావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని స్టేషన్‌కు తరలించారు. మొహం పోల్చుకునే రీతిలో లేకపోవడంతో మృతుని తల్లిదండ్రులు పనిచేస్తున్న దాబా పక్కనుంచే పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి 24 గంటలు అనాథ శవంగా వదిలేశారు. రోజంతా మధు కనబడక తల్లడిల్లిన తల్లి జ్యోతి స్నేహితులతో ఆరా తీయించింది. కుటుంబ సభ్యులు, బంధువులతో వెతికించారు. ఈ తరుణంలో కొంతమంది స్థానికులు గుర్తుతెలియని వ్యక్తి మృతి అనే విషయం పత్రికల్లో రావడాన్ని తెలియజేశారు. దీంతో మంగళవారం ఉదయం మధు కుటుంబ సభ్యులంతా పలాస ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. చదువుకోమని చెప్పినందుకే ఆత్మహత్య చేసుకుంటావా అంటూ తల్లి మధు మృతదేహంపై పడి విలపించిన తీరు అక్కడివారికి కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం కాశీబుగ్గ టెలిఫోన్ ఎక్చేంజ్‌కు ఎదురుగా ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం తమన్నా చెల్లెలు!
క్రైమ్ పేరెంటింగ్ హిందీలో ‘తమన్నా’ అంటే ఆశ.. కోరిక.. కాంక్ష. ఏదో కావాలన్న ఆశ. ఏదో అయిపోవాలన్న కోరిక. ఒక్క ఛాన్స్ వస్తే.. స్టార్ అవ్వాలన్న కాంక్ష. ఇవన్నీ లేకపోతే.. అమ్మాయిలు హీరోయిన్లు ఎలా అవుతారు? కష్టం ఉండాలి.. నష్టం ఉండాలి.. దీక్ష ఉండాలి.. ప్రతిభ ఉండాలి. వీటన్నిటితో పాటు ఇంకోటి కూడా ఉంటోంది! అమాయకత్వం! ‘అచ్చు.. తమన్నా చెల్లెల్లా ఉన్నావు’ అని ఎవరైనా అంటే... మన అమ్మాయికి ఆశ కలగదా? కోరిక పుట్టదా? కాంక్ష.. పెడదారి పట్టదా?! ‘‘పిల్ల ఏం చేస్తోంది? ఏమాలోచిస్తోంది– అని ఒక్కసారైనా పట్టించుకున్నావా?’’ కోపంతో అరిచాడు సురేష్ భార్య మీద.‘‘దాని మనసులో ఇలాంటి ఆశలున్నాయని నేను మాత్రం కలగన్నానా?’’ కళ్లల్లో తిరిగిన నీళ్లను పమిటచెంగుతో తుడుచుకుంటూ అంది రత్న.‘ముందునుంచీ చెప్తున్నా.. పిల్లలు చెప్పినట్టు ఆడొద్దు.. ఏది కావాలంటే అది ఇప్పించొద్దు అని?’.. అదే పిచ్‌లో అన్నాడు సురేశ్.‘‘తప్పు నా ఒక్కదానిదేనా? మీకు లేదా బాధ్యత? ఎప్పుడూ ఆఫీస్, క్యాంప్‌లు అని తప్ప ఇంట్లోవాళ్ల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా?’’ ఒక్కసారిగా ఏడ్చేసింది రత్న. పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించి రత్న తల్లిదండ్రులు, సురేష్ తల్లిదండ్రులు.. మధ్యలో కల్పించుకున్నారు. ‘‘ఇది తప్పొప్పులు ఎంచుకునే టైమ్ కాదు. ముందు పిల్ల జాడ వెదికే ప్రయత్నం చేయండి’’ అన్నాడు సురేష్ తండ్రి. ‘‘బావగారూ... రశ్మి ఇంటిలోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్ కంప్లయింట్ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. బేలగా చూశాడు సురేష్. అక్కడున్న అందరూ అవునన్నట్టు కళ్లతోనే చెప్పారు. తప్పదన్నట్లుగా రశ్మీ ఫోటో, వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి రాసిన ఉత్తరం.. తీసుకొని బావమరిదిని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు సురేష్. హైదరాబాద్.. యూసుఫ్‌గూడ ‘‘అబ్బ.. సేమ్ టు సేమ్ తమన్నా!’’ అన్నాడు మధు. బ్లూజీన్స్, బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వచ్చిన రశ్మిని చూసి ముగ్ధుడైనట్టు. ‘‘అంత కలర్ ఉన్నానా?’’ ఆ కితాబుకు కొంచెం సిగ్గు పడుతూ అంది రశ్మి. ‘‘అంతకన్నా ఎక్కువే ఉన్నావ్! అయినా నీకేం తక్కువరా.. మంచి కలర్, మాంచి ఫిగర్.. నువ్వు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక నిన్ను చూసి తమన్నా కుళ్లుకోకపోతే అడుగు!’’ సవాలు విసురుతున్నట్టుగా అన్నాడు మధు. ‘‘తెలుగులో కాదు.. హిందీలో చాన్సెస్ కావాలి.. రాజమండ్రిలో నన్నంతా ‘బాలీవుడ్ భామలాగుంటావే’ అనేవాళ్లు’’ అంది అద్దం ముందు అటూ ఇటూ రకరకాల భంగిమల్లో కదులుతూ. ‘‘అబ్బో..’’ అని సణుక్కున్నాడు. ‘‘ఏమన్నావ్?’’ అంది కాస్త మొహం ఎర్రగా చేసుకుంటూ.. ‘‘అబ్బా.. అన్నాను మెచ్చుకుంటూ’’ సవరించుకున్నాడు మధు. రశ్మి మొహం వెలిగిపోయింది.‘‘నీకు తెలుసా.. నేను లాంగ్ టాప్.. నీలెంగ్త్ లెగ్గింగ్ వేసుకుంటే...’’ అని రశ్మీ చెప్తుంటే ‘బాబోయ్ మొదలెట్టిందిరా మళ్లీ’ అన్నట్టుగా చూపులను నేలకు దించి.. తనలో తనే మెల్లగా గొణుక్కున్నాడు. ‘‘ఏయ్.. మధూ..’’– వింటున్నావా లేదా అన్నట్టుగా గద్దించింది.‘‘అదే.. రశ్మీ.. వింటున్నా... నీలెంగ్త్ లెగ్గింగ్, లాంగ్ టాప్ వేసుకొని వెళితే నీ ఫ్రెండ్స్ అంతా ‘దీపికా పడుకోన్లా ఉన్నావే’ అని కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు అవునా...’’ ఎన్నిసార్లు చెప్తావ్ అనే ధ్వని మధు మాటలో.‘‘దీపికా కాదు.. కత్రినా..’’ సరిదిద్దింది.‘‘అదేలే.. జీన్స్ వేసుకుంటే దీపికాలా .. హెయిర్ లీవ్ చేస్తే అనుష్కలా.. లాంగ్‌స్కర్ట్ వేసుకుంటే ఆలియాలా.. పటియాలా వేసుకుంటే కరీనాలా.. కదా..’’ అన్నాడు మధు.. కరెక్ట్‌గా గుర్తుంది అన్నట్టుగా!‘‘ఊ.. అవును’’ మళ్లీ సిగ్గుపడింది.‘‘రశ్మీ.. ఈరోజు మా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు రూమ్‌కి. మనం ఖాళీ చేసేయ్యాలి’’ అన్నాడు. ‘‘ఎలా మరి?’’ అంది కంగారుగా.‘‘నువ్వేమో ‘బాలీవుడ్ చాన్స్‌లే కావాలి’ అంటున్నావ్. ముంబైలో మా ఫ్రెండ్‌కి రాత్రి కాల్ చేస్తే.. ‘ముందు మోడలింగ్‌కి ట్రై చేయాల్రా.... తర్వాతే సినిమాల్లోకి’ అన్నాడు. వాడికి నీ ఫోటో కూడా పంపా..’’ చెప్పాడు.‘‘ఏమన్నాడు..’’ రశ్మీ గొంతులో ఆత్రం, కళ్లల్లో మెరుపుతో అడిగింది.‘మోడలింగ్‌లో ఈజీగా చాన్స్ దొరుకుతుందిరా ఆ ఆమ్మాయికి అన్నాడు. కాని.. ’ అంటూ ఆగాడు మధు.‘‘కాని ఏంటీ?’’ ఆందోళనగా అంది ఆమె.‘‘మనం ముంబై వెళ్లడం అంత ఈజీకాదు. నాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఇక్కడలా కాదు. రూమ్‌లో షేర్ చేసుకోవడానిక్కూడా ఇష్టపడరు. ముందు కనీసం వారం రోజులైనా హోటల్లో ఉండాలి.. ఆ తర్వాత రూమ్ వెదుక్కోవాలి. నా దగ్గర అంత డబ్బు లేదు’ ’అన్నాడు బాధపడ్తున్నట్టు.‘‘నా దగ్గర ఉంది కదా..’’ అంటూ గబగబా తన హ్యాండ్ బ్యాగ్ తీసి ఐదు వందల నోట్లతో ఉన్న యాభైవేల రూపాయల కట్ట తీసింది ‘‘ఇవిగో... ‘ఇంకా మా అమ్మమ్మ నా కోసం చేయించిన చైన్, బ్రేస్లెట్, ఇయర్రింగ్స్, రెండు రింగ్స్ కూడా తెచ్చా.. ఏదో ఒక చాన్స్ దొరికేదాకా పనికొస్తాయి కదా..’’ అంది భరోసా ఇస్తున్నట్టు. ఈసారి మెరుపు మధు కళ్లల్లో.‘‘రేపటికి రిజర్వేషన్ చేయించనా ముంబైకి’’ అన్నాడు మధు. ‘‘డన్’’ అంది రశ్మి. కుడిచేయి పిడికిలి బిగించి బొటన వేలును మాత్రం పైకి చూపిస్తూ! ‘‘బావగారూ... రశ్మి ఇంట్లోనుంచి వెళ్లిపోయి మూడు రోజులు. పరువుకోసం చూసుకుంటే మొదటికే మోసం రావచ్చు. పోలీస్ కంప్లయింట్ ఇస్తేనే మంచిది’’ అన్నాడు రత్న తమ్ముడు. రాజమండ్రి పోలీస్‌స్టేషన్ ‘‘చదువు చదువు అని ఏమన్నా ఇబ్బంది పెట్టారా?’’ అడిగాడు ఎస్ఐ.‘‘లేదు సర్. ఒక్కానొక్క కూతురు. తననెప్పుడూ ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టరు మా అక్క, బావ’’ ఆన్సర్ చేశాడు సురేష్ బావమరిది.‘‘మరి.. బాయ్‌ఫ్రెండ్...’’ ఆగాడు ఎస్ఐ.‘‘అబ్బే .. చిన్నపిల్లండి. మొన్ననే టెన్త్ అయిపోయింది. అలాంటిదేం లేదు సర్’ అన్నాడు నొచ్చుకున్నట్టుగా సురేష్.‘ఆరోజు కోప్పడ్డం కాని... కొట్టడం కాని ఏమన్నా చేశారా..’’ ఎస్ఐ కూపీలాగుతుండగానే రశ్మీ రాసిన లెటర్ తీసిచ్చాడు సురేష్. చదవడం పూర్తి చేస్తూ ‘సినిమా పిచ్చి అన్నమాట’ అన్నాడు లెటర్‌ను పేపర్‌వెయిట్ కింద పెడుతూ ఎస్ఐ. ఏం మాట్లాడాలో తెలియక మొహమొహాలు చూసుకున్నారు బావ, బావమరుదులు.‘‘వెళ్తూ వెళ్తూ ఏమన్నా తీసుకెళ్లిందా?’’ ఎస్ఐ. ‘‘యాభై వేలు, కొంచెం బంగారం’’ చెప్పాడు బావమరిది.‘ఊ...’ నిట్టూరుస్తూ కానిస్టేబుల్ని పిలిచాడు ఎస్ఐ.. అమ్మాయి ఫోటో తీసుకొని వివరాలు రాసుకొమ్మని పురమాయించాడు.‘‘సర్.. కొంచెం త్వరగా..’’ రిక్వెస్ట్ చేశాడు సురేష్. ‘ట్రై చేస్తాం లెండి. అయినా మూడు రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోతే ఇప్పుడా చెప్పడం’’ అని చీవాట్లు కూడా వేశాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ‘‘ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లావ్? అటే వెళ్లి పోయావ్?’’ తనను అంతసేపు వెయిట్ చేయించాడనే కోపంతో అంది రశ్మీ.‘‘సారీ! కాస్త లేట్ అయింది’’ అని ఆమెకు సమాధానమిచ్చి తన పక్కనే ఉన్న వ్యక్తిని చూపిస్తూ ‘‘రశ్మీ.. ఇతని పేరు సతీష్. నా ఫ్రెండ్’’ అని పరిచయం చేశాడు.‘‘హాయ్’’ అంది రశ్మి. కళ్లతోనే పలకరించాడు ఆ వ్యక్తి.కాస్త దూరంగా వీళ్ల ముగ్గురినే గమనిస్తూ ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు నిలబడున్నారు.మధు అటూ ఇటూ చూసి రశ్మీకి దగ్గరగా వస్తూ కాస్త చిన్నగా.. ‘‘సారీ.. నాకు ముంబై రావడం కుదరట్లేదు. ఇక్కడ షూటింగ్ పనిపడింది అర్జెంట్‌గా. మూడు రోజుల్లో వస్తాను. సతీష్ నాకు చాలా క్లోజ్. బాగా బతిమాలితే నిన్ను తీసుకెళ్తానన్నాడు. అక్కడ నీకు ఆనంద్‌ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బు ఆనంద్ అకౌంట్లో వేశా. నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు. గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకున్న ఎమౌంట్ సతీష్ దగ్గర ఉంది. ఖర్చులకు కావాలి కదా.. ’ నచ్చజెప్పాడు. ‘‘అయ్యో నువ్వు రావట్లేదా? మరి అతనికి అన్నీ తెలుసా?’’ అడిగింది రశ్మి.‘‘అన్నీ తెలుసు. నీ స్క్రీన్ టెస్ట్ కల్లా నేను అక్కడ ఉంటాగా’’ భరోసా ఇచ్చాడు. స్క్రీన్ టెస్ట్ అనగానే మొహం చేటంతయింది రశ్మీకి. సతీష్‌కు కళ్లతోనే ఏదో సైగ చేస్తూ... ‘‘వస్తా మరి’’ అని అక్కడ నుంచి కదులుతుండగా... నలుగురు మనుషులు వేగంగా వచ్చి ఈ ముగ్గురినీ పట్టేసుకున్నారు ‘‘ఎక్కడికిరా వచ్చేది’’ అంటూ! వాళ్లు పోలీసులు. రశ్మి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ‘మీ అమ్మాయి దొరికింది’ అని. పేరెంట్స్‌కీ కౌన్సెలింగ్ మధుది అమలాపురం. హైదరాబాద్‌లో బ్రోకర్ పనులు చేసేవాడు. ముఖ్యంగా అమ్మాయిల ట్రాఫికింగ్‌లో మధుకి క్రైమ్రికార్డ్ ఉంది.కొన్నాళ్లు హైదరాబాద్ జైల్లో కూడా ఉన్నాడు. కౌన్సెలింగ్ ఇచ్చి మరీ విడుదల చేశారు పోలీసులు. అప్పుడే రాజమండ్రికి వెళ్లాడు వాళ్ల అక్క దగ్గరకు. అక్కడే రశ్మి పరిచయం అయింది. మెల్లగా తనతో స్నేహం చేశాడు. ఆమెకు మోడలింగ్ అంటే మోహమని, సినిమా అంటే పిచ్చి అని అర్థమైంది. దాన్ని క్యాష్ చేసుకుందా మనుకున్నాడు. తనకు హైదరాబాద్, ముంబైలలో చాలామంది సినిమా ఫ్రెండ్స్ ఉన్నారని... ఈజీగా చాన్స్లిప్పిస్తానని, ఓవర్‌నైట్‌లో హీరోయిన్ను చేసేస్తానని రశ్మీని మాయలోపెట్టాడు. గుడ్డిగా నమ్మింది ఆ పదహారేళ్ల పిల్ల. ఒకరోజు మధుతో ట్రైన్ ఎక్కింది. ఇప్పుడిలా పోలీసుల చేతికి దొరికింది. ‘చూడమ్మాయ్.. వాడు నిన్ను ముంబై తీసుకెళ్తోంది నీకు సినిమా చాన్స్లిప్పించడానిక్కాదు. అక్కడ రెడ్‌లైట్ ఏరియాకు పంపించడానికి. నీ దగ్గరున్న డబ్బు లాక్కొని నిన్ను ఆ సతీష్ అనే వాడికి అమ్మేశాడు తెలుసా... ’ అన్నాడు ఎస్ఐ. అవాక్కయింది రశ్మీ.‘‘చూడ్డానికి బాగుండగానే సినిమాలో చాన్స్‌లు దొరకవు. ఒకవేళ ఆ కెరీర్ కావాలనుకుంటే దానికి వేరే మార్గం ఉంటుంది. ఇలా ఎవరు పడితే వాళ్లు సినిమా చాన్స్లిస్తామంటే నమ్మకూడదు. వెంట వెళ్లకూడదు. ముందు బాగా చదువుకో. లోకజ్ఞానం పెంచుకో. అర్థమైందా?’’ అని చెప్పి రాజమండ్రి పంపించారు. అక్కడ ఆమె తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు..‘‘టీన్స్‌లో ఉన్న అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి వాళ్లు ఎవరైనా ‘మీ అమ్మాయికేం. చందమామ తునక.. నాకు ఫలానా ప్రొడ్యూసర్ తెలుసు.. కెమెరామన్ తెలుసు.. డైరెక్టర్ తెలుసు.. చాన్స్‌లు ఇప్పిస్తా. డబ్బే డబ్బు’ అంటారు. అలాంటి వాళ్లను దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఒక్క సినిమా చాన్సే కాదు... సిటీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, బోలెడు డబ్బని.. ఆడవాళ్లు, మగవాళ్లు, ఎవరు చెప్పినా నమ్మి పిల్లలను వాళ్ల వెంట పంపొద్దు’’ అని. రశ్మి అమ్మా నాన్నా ఊపిరి పీల్చుకున్నారు. – శరాది -
యాక్షన్ థ్రిల్లర్
నవీన్, జీవా, మధు, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్’. ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్. సీనియర్ నటులతో పాటు కొత్తవారూ నటించారు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్ నరేన్, సమర్పణ: ఎన్. కరుణాకర్ రెడ్డి. -
రొయ్యల చెరువులను ధ్వంసం చేయండి
‘ఆక్వా’పై సీపీఎం ప్రచారోద్యమం: సీపీఎం నేత మధు సాక్షి, అమరావతి: పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన రొయ్యలు, చేపల చెరువులను ధ్వంసం చేయాలని సీపీఎం పిలుపిచ్చింది. ఆక్వా సాగుతో ముంచుకొస్తున్న ముప్పును ప్రజలకు వివరించేందుకు త్వరలో 10 రోజుల పాటు ప్రచారోద్యమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగవుతున్న చేపలు, రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోకుంటే సీఎం చంద్రబాబుపై క్రిమినల్ కేసు వేస్తామని హెచ్చరించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 22 దేశాలు రొయ్యల సాగును నిషేధిస్తే చంద్రబాబు మాత్రం ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా సాగు వల్ల మంచినీటి కొరత, కాలుష్యం, నివసించలేనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించారు. అలాగే కోనసీమలో కొబ్బరి తోటలు, పాడి పరిశ్రమ, వరి సాగు నిర్వీర్యమవుతున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా సీఎం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
చంద్రబాబుది నాలుకో.. తాటిమట్టో..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నగుబాటుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోద్రా మరణకాండకు కారణమైన మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. అప్పట్లో నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతో జతకట్టారని విమర్శించారు. సమయానుకూలంగా సిద్ధాంతాలను మార్చుకోవడం చంద్రబాబుకు అలవాటే అని, అసలు ఆయనది నాలుకో.. తాటిమట్టో అర్థం కావడం లేదని విమర్శించారు. 2019లో ప్రజలు కచ్చితంగా టీడీపీకి గుణపాఠం చెబుతారని మధు అన్నారు. -
పెద్దలు ఒప్పుకోలేదు..చనిపోదామనుకున్నారు
జనగామ: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవటం లేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దెంకి గ్రామానికి చెందిన మధు(24), వరంగల్ క్రిస్టియన్ కాలేజీకి చెందిన మౌనిక(23) హైదరాబాద్‌లోని యశోద హాస్పెటల్లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ శుక్రవారం ఎల్లమ్మగుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పురుగుమందుతాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. -
ఆక్వా చెరువులతో మానవ విధ్వంసం
చంద్రబాబు వచ్చాకే విచ్చలవిడితనం త్వరలో ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అమలాపురం రూరల్/ అల్లవరం/ ఉప్పలగుప్తం : ఆక్వాసాగు కోనసీమ మానవ మనుగడను ప్రశ్నార్థ్ధకం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి బాబు సర్కారే కారణమని ఆయన విమర్శిం చారు. అక్రమ సా గును ప్రోత్సహిస్తున్న స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అక్రమ ఆక్వాసాగు పరిశీలనకు కోనసీమలో బుధవారం ఆయన రాజోలు, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆక్వాసాగును ప్రపంచ దేశాలు నిషేధిస్తున్నాయని, మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో నిషేధముందని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టాక ఆక్వా సాగుకు తలుపులు బార్లా తెరిచారని, ఆక్వా హబ్ పేరుతో విలువైన మాగాణి భూములను బీళ్లుగా మార్చి అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఈ సాగు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవుపెట్టారు. గూడాలలో మహిళలు మాట్లాడుతూ అక్రమ చెరువులను అడ్డుకున్నవారిపై అక్రమంగా కేసులు పెట్టి భయపెడుతున్నారని, 11 మందిపై కేసులు పెట్టి, జైల్లో పెట్టి తవ్వకాలు సాగించారని వివరించారు. ఉప్పలగుప్తం మండలం శింగరాయపాలెంలో మహిళలు, స్థానికులు ఆక్వా సాగు వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. అమలాపురం మండలంలో తాండవపల్లి, వన్నెచింతలపూడి, భట్నవిల్లిలో బాధితులతో ఆయన మాట్లాడారు. కోర్టు స్టే ఇచ్చినా కూడా చెరువు తవ్వకాలు ఆపడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. మధు వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడాల సుబ్బారావు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మోర్తా రాజశేఖర్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్.రమణి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వసంతకుమార్, ఆ పార్టీ నాయకులు ఉడుపూడి రాఘవమ్మ, టి.నాగవరలక్ష్మి, భీమాల శ్రీను, వి.దొరబాబు, టి.ప్రసాద్, బి.వెంకట్రావులు పాల్గొన్నారు. -
ఆ దుండగునికి దండన విధించాలి
-హోలీ ఏంజెల్స్ ‘మధు’ను అరెస్టు చేయాలి -‘రంప’లో గిరిజన విద్యార్థుల ప్రదర్శన రంపచోడవరం : న్యాయం కోసం గిరిజన విద్యార్థులు చేసిన నినాదాలతో రంపచోడవరం వీధులు మార్మోగాయి. గిరిజన విద్యార్థినులపై దౌర్జన్యానికి పాల్పడిన రాజమహేంద్రవరం హోలీ ఏంజెల్స్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును అరెస్టు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని, దోషులను వదిలే ప్రస్తకే లేదని పీవో దినేష్‌కుమార్ హామీ ఇచ్చారు. కాగా గిరిజన విద్యార్థినులను చితకబాదిన మధుసూదనరావును తక్షణం అరెస్టు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థినులను అమానుషంగా కొట్టిన రాజమహేంద్రవరం హోలీఏంజెల్ పాఠశాల డైరెక్టర్ మధుసూదనరావును తక్షణం అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థులు బుధవారం రంపచోడవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఐటీడీఏ పీఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కుంజా శ్రీను, సీపీఐ డివిజన్ కార్యదర్శి జత్తుక కుమార్ ఆధ్వర్యంలో రంపచోడవరంలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో విద్యార్థులతో పీఓ ఏఎస్ దినేష్‌కుమార్ మాట్లాడారు. జ్యుడిషియల్ విచారణలో వాస్తవాలు తెలుస్తాయని దోషులను వదిలే ప్రస్తకే లేదన్నారు. పదో తరగతి పరీక్షలకు ఎంతో సమయం లేనందున శ్రద్ధగా చదువుకోవాలని, అక్కడ ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేర్‌టేకర్‌ను నియమిస్తామన్నారు. విద్యార్థినులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. అక్కడి పరిస్ధితిపై విచారణ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుజాతను పంపినట్టు తెలిపారు. విచారణ చేయమని ఏటీడబ్ల్యూఓ ఆకుల వెంకటేశ్వరరావును ఆదేశించామని వివరించారు. దీంతో విచారణకు వచ్చిన ఏటీడబ్ల్యూఓ ఐటీడీఏ పీఓకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండానే సర్దుబాటు చేయాలని యాజమాన్యంతో మాట్లాడినట్టు పీఓ దృష్టికి విద్యార్థులు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే రాజేశ్వరి డిమాండ్.. హోలిఎంజెల్స్లోని గిరిజన విద్యార్థినులను చావకొట్టిన పాఠశాల డైరెక్టర్ మధుసుదన్రావును తక్షణం అరెస్టు చేయాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించిన డైరెక్టర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల చదువు కోసం గిరిజన సంక్షేమ శాఖ రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే అక్కడ వారికి కనీసం భోజనం కూడా సక్రమంగా పెట్టడడం లేదన్నారు. ఆడపిల్లలను డైరెక్టర్ కొట్టడం హేయమన్నారు. విద్యార్థినులకు న్యాయం చేసేవరకూ పక్షాన పోరాడతానని చెప్పారు. -
సీపీఎం నేత మధు అరెస్ట్, ఉద్రిక్తత
కృష్ణా: ఇలపర్రులో తమ భూములను అగ్రవర్ణాలు లాక్కున్నాయంటూ దళితులు చేస్తున్న ఆందోళనకు సీపీఎం అండగా నిలిచింది. దళితుల భూ ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని, భూములను స్వాధీనం చేసుకుంటామని పార్టీ నేత రాఘవులు చేసిన అల్టిమేటం గడువు సోమవారంతో ముగుస్తుండటంతో.. సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గుడివాడలో సీపీఎం నేత మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ భూములు కాపాడుకోవడానికి ఎంతమంది నేతలను కలిసినా ప్రయోజనం లేదని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూములు దక్కేవరకు ఆందోళన ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు. -
పోలీసులూ... డేంజర్లో పడతారు
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం మాటలు విని కొందరు పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే ప్రమాదంలో పడతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తమ ఆస్తిపాస్తుల కోసమో స్వప్రయోజనాల కోసమో ధర్నాలు చేయడం లేదని, ప్రజల ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తుంటే పోలీసులతో అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మధు విమర్శించారు. టీడీపీ జన చైతన్య యాత్రలకు, మంత్రులు బయట తిరగడానికి పోలీసుల రక్షణ కావాలని, పోలీసులను వాళ్ల డ్యూటీలను చేయడనివ్వడంలేదని మండిపడ్డారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ చూడటం, దొంగలను పట్టుకోవడం, రౌడీయిజం చేసేవారి ఆట కట్టించడం వంటివి చేయాల్సి ఉంటే.. ప్రభుత్వం మాత్రం వారి చేత నీరు-మట్టి, జన చైతన్య యాత్రలు, పుష్కరాలు, మంత్రుల వెనకే తిప్పించుకోవడం వంటివి చేయిస్తోందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో ఓ దళితుడు చేసిన 2500 రూపాయలు అప్పు తీర్చడం ఆలస్యమైందని పోలీసు స్టేషన్లో పెట్టి, ఎస్సై ఒకరు ఆయనకు వాతలు పడేలా కొట్టారని, ఈ కేసు గురించి తెలుసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు 20 సార్లు వెళ్లినా కలవలేకపోయానని, శ్రీకాకుళం ఎస్పీని కలిసేందుకు ఐదుసార్లు ప్రయత్నించినా కలవడం కుదరలేదని తెలిపారు. ఇది పోలీసుల తప్పు కాదని, టీడీపీ ప్రభుత్వ అడ్డగోలు విధానమనే కారణమని దుయ్యబట్టారు. -
బసవపున్నయ్య ప్రపంచ నేత: ఏచూరి
హైదరాబాద్: మాకినేని బసవపున్నయ్య ప్రపంచ కమ్యూనిస్టు నేత అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయన మంగళవారం చిక్కడపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఏచూరి ప్రసంగించారు. హోచిమిన్, స్టాలిన్, ఫిడెల్‌క్యాస్ట్రో వంటి దేశాధినేతలతో బసవపున్నయ్యకు దగ్గరి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. -
రైతు శ్రమను గుంజుకుంటారా..?
► బలవంతపు భూ సేకరణ వ్యతిరేకిస్తున్నాం ► టీడీపీ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తోంది ► ఉద్యోగాలంటూ ఊరించడమే.. అమలు చేసింది లేదు ► సీపీఎం నేత పి.మధు ధ్వజం ► దొనకొండలో పార్టీ శ్రేణుల ర్యాలీ ► ప్రకాశంను కరువు జిల్లాల జాబితాలో చేర్చాలరి డిమాండ్ దొనకొండ : రైతులు తమ రక్తం ధారపోసి, నిరుపయోగంగా ఉన్న కొండలు, గుట్టలను చదును చేసుకున్నారు. సేద్యానికి అనువుగా మార్చుకుని అందులో సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ భూములను భూసేకరణ పేరుతో బలవంతంగా లాక్కుంటారా..? అని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యుడు పి.మధు ప్రశ్నించారు. బలవంతపు భూ సేకరణకు తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాను కరువు జిల్లాల జాబితాలో చేర్చాలని, దొనకొండ మండలాన్ని అభివృద్ధి చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలో ప్రజలు జీవనం సాగించడం రాబోయే రోజుల్లో చాలా కష్టంగా ఉంటుందన్నారు. పట్టా భూములతో సమంగా పరిహారమివ్వాలి.. రైతు సమస్యలు తెలుసుకునేందుకే కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర ఏర్పాటు చేసిందని మధు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో పంటలు ఎండు ముఖం పట్టాయని, భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడంతో రైతులు పెట్టుబడులైనా వస్తాయో రావోననే ఆందోళనతో ఉన్నారన్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు లేక చాలా మంది వలస బాట పట్టారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా అభివృద్ధిని అరచేతిలో స్వర్గం చూపిస్తుందన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని అనేక దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని, వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊరించడమే తప్ప అమలు చేసిందేమి లేదన్నారు. 2103 భూసేకరణ చట్టం ప్రకారం సెటిల్మెంట్ పట్టా భూములతో సమానంగా అసైన్డ, ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం ఇవ్వాలని, ఆ భూముల్లో పనులు కోల్పోతున్న కూలీలకు పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటారుుంచి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దొనకొండ నుంచి బయలుదేరిన పాదయాత్ర ఆరు నియోజక వర్గాలు, 15 మండలాలు, 102 గ్రామాలలో 350 కిమీ 15 రోజుల్లో పర్యటించి డిసెంబర్ 23వ తేదీకి ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి పనుల్లేక ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారని, జిల్లాలో 65 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించిన సమయంలో అందులో మన జిల్లాను చేర్చాలని పట్టుబట్టిన ప్రజాప్రతినిధి జిల్లాలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం కరువు, వలసలు, అనావృష్టి, పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు దారిద్య్రంలో జీవిస్తున్నారన్నారు. సీపీఎం పాదయాత్ర ప్రజలను జాగృతం చేసేందుకు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మధుకు అందజేశారు. అనంతరం పాదయాత్రను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి సోమయ్య, రమేష్, స్థానిక నాయకులు తాండవ రంగారావు, వెంకటేశ్వరరెడ్డి, కళావతి, కర్నా హనుమయ్య, జొన్నలగడ్డ రాజు, కె.అనిల్, చంటి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాత కొత్తల మేలు కలయిక 'మధుపత్రాలు'
కవి సన్నిధానం నరసింహశర్మ కవితాసంపుటి ఆవిష్కరణ రాజమహేంద్రవరం కల్చరల్ : పాత విలువలను కాపాడుకుంటూ, ఆధునిక భావాలకు స్వాగతం పలికిన ‘మధుపత్రాలు’ కవితా సంపుటిని వెలువరించిన కవయిత్రి ఉప్పలూరి శైలజ అభినందనీయురాలని ప్రాణహిత కవి సన్నిధానం నరసింహశర్మ అన్నారు. ఎన్జీఓ హోమ్‌లో కళాగౌతమి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మధుపత్రాలు కవితా సంపుటి ఆవిష్కరణ సభలో ఆయన పుస్తక సమీక్ష చేశారు. కవితా సంపుటిలో కవయిత్రి అన్ని అంశాలను స్పృశించారని చెప్పారు. అలతి, అలతి పదాలలో అనల్పమైన భావాన్ని కవయిత్రి చెప్పగలిగారని, భావజాలం వ్యక్తీకరణలో ఎక్కడా గందరగోళం లేదని ఆయన ప్రశంసించారు. బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి మాట్లాడుతూ ‘కాగితాలు ఎన్నెన్ని పితికితే–కవిత ఒలికేను చుక్కలా’ అన్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి కవితను ఉటంకించారు. ‘క’ అంటే కమనీయం, ‘వి’ అంటే విద్వత్, ‘త’ అంటే తాత్వికతని కవితకు ఆయన అర్థం చెప్పారు. కుటుంబం, సమాజం, ఆధ్యాత్మికం అన్నిటిని కవయిత్రి కవితల రూపంలో స్పృశించారని కొనియాడారు. కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య వంతం చేసే అంశాలను కవయిత్రి అక్షరబద్ధం చేశారని తెలిపారు. డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు (పేరవరం) మాట్లాడుతూ కవులు పరమహంసల వంటివారని, చెడును వదిలి, మంచిని స్వీకరిస్తారని చెప్పారు. సాహితీవేత్త చీకటి దివాకర్ (విజయనగరం) సభకు అధ్యక్షత వహించారు. మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ (కాకినాడ), డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ (వరంగల్), కె.నాగేశ్వర్ (హైదరాబాద్) తదితరులు కవయిత్రని అభినందించారు. కవయిత్రి శైలజను ఘనంగా సత్కరించారు. ముళ్ళపూడి శేషుకుమార్ స్వాగత వచనాలు పలికారు. కవయిత్రి భర్త, బ్యాంకు అధికారి యు.వి.పి.ఆర్.కె.ప్రసాద్ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
‘నీ పార్టీ పనైపోయింది బాబు’
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రజాగర్జనకు భారీ స్పందన చింతూరు : రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని అయినా నన్నేం చేయలేరని చంద్రబాబు విర్రవీగుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా ఆయన్ని తరిమి కొడతామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో విలీన మండలాల్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం చింతూరులో ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఫిరాయించడం ద్వారా బలపడుతున్నానని చంద్రబాబు భ్రమపడుతునారని, ఆయన వెంట నాయకులే తప్ప ప్రజలంతా వైఎస్సార్ సీపీ, వామపక్షాల వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాలను అణగ దొక్కడం, ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లకు పంపడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని, దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతు తెలిపితే తనను కూడా జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. నోట్ల రద్దుతో దేశమంతా అట్టుడుకుతోందని, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. పోలవరం ముంపు కింద గతంలో ఎకరాకు రూ.లక్షా 15 వేలు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచి ఇవ్వడం కదురదంటూ స్వయంగా చింతూరులో చంద్రబాబు తేల్చి చెప్పారని, పార్లమెంటు ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఐదేళ్లలో ప్రాజెక్టు చేపట్టకపోతే తిరిగి వారికి పరిహారం చెల్లించాలని ఉన్నా ఇవ్వమనడం సబబు కాదన్నారు. పోలవరం ఉద్యమం భవిష్యత్ ప్రణాళికలో భాగంగా డిసెంబరు 5న ముఖ్యమంత్రిని కలసి సమస్యలు వివరిస్తామని, 6న వామపక్ష పార్టీలు, సంఘాలతో కలసి చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, జిల్లా కార్యదర్శి అరుణ్, రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, సుబ్బారావు, జిల్లా నాయకులు ప్రకాష్, రాధ, మురళి, శిరమయ్య, పెంటయ్య, సీతారామయ్య, శేషావతారం, వెంకట్, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజాగర్జనకు విశేష స్పందన సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చింతూరులో నిర్వహించిన ప్రజాగర్జన సభకు విశేష స్పందన లభించింది. ఈ నెల నాలుగు నుంచి 28 వరకు విలీన మండలాల్లోని 250 గ్రామాల్లో 600 కిలోమీటర్ల మేర నాయకులు పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 200 గ్రామాల్లో ప్రజలు తాగునీరు, విద్య, వైద్యం సరిగా అందడం లేదని నాయకులు తెలిపారు. ప్రజాగర్జన సందర్భంగా చింతూరులో నిర్వహించిన ర్యాలీలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులకు గిరిజన సాంప్రదాయ రీతిలో కొమ్ము, కోయ నృత్య బృందం తమ నృత్యాలతో స్వాగతం పలికింది. అనంతరం చింతూరులో నిర్వహించిన సభకు నాలుగు మండలాలకు చెందిన ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సభకు వైఎస్సార్సీపీ నాయకులు, సీపీఐ నాయకులు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. నాయకుల ప్రసంగానికి ముందు ప్రజానాట్య కళామండలి సభ్యులు పలు నృత్యాలను ప్రదర్శించారు. -
నన్ను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారు
డీజీపీకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవారుుపేటలో ఈ నెల 3న తనను తుని రూరల్ సీఐ అడ్డగించి ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారని డీజీపీ నండూరి సాంబశివరావుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీజీపీకి మధు సోమవారం లేఖ రాశారు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీని కలిసేందుకు వెళ్లిన తనపై తుని రూరల్ సీఐ చెన్నకేశవరావుతోపాటు పలువురు పోలీసులు దాడి చేసి దారుణంగా కొట్టారని మధు పేర్కొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించాలి: మధు
-
ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమం
మచిలీపట్నం : భూసమీకరణకు ఒక్క ఎకరం కూడా రైతులు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని, వారికి తాము అండగా ఉంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చెప్పారు. మచిలీపట్నం మండలంలో భూసమీకరణకు వ్యతిరేకంగా భూ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్ర బుధవారం రెండో రోజుకు చేరుకుంది. పాదయాత్రలో పాల్గొన్న మధు మాట్లాడుతూ పాదయాత్ర ముగింపు రోజున ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. రైతులపై లాఠీచార్జ్ చేసినా, కాల్పులు జరిపినా వెనుకంజ వేసేది లేదన్నారు. రైతులపై దాడి చేస్తే ప్రభుత్వ దుర్మార్గం బయటపడుతుందని, అప్పుడైనా భూసమీకరణ నోటిఫికేషన్ రద్దు అవుతుందన్నారు. ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆయన ముక్కు నేలకు రాసేలా చేస్తామని హెచ్చరించారు. టీడీపీలోకి 20 మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వచ్చినట్లు గొప్పలు చెబుతున్నారని, అయితే వారి వెంట ప్రజలు వెళ్లలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను వివరించేందుకే... వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు రైతులను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తారని, రైతులు బెదిరిపోవద్దన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను వివరించేందుకే పాదయాత్రను చేపట్టినట్లు చెప్పారు. భూసమీకరణపై ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామన్నారు. గోకవరం నుంచి పాదయాత్ర ప్రారంభమై పాతరెడ్డిపాలెం, ఓడరేవుపాలెం, సిరివెళ్లపాలెం, మంగినపూడి, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, పోతిరెడ్డిపాలెం, మేకవానిపాలెం, చినకరగ్రహారం, పెదకరగ్రహారం గ్రామం వరకు కొనసాగింది. ఈ పాదయాత్రలో వైఎస్సార్ సీపీ సీపీ, వామపక్షాల నాయకులు షేక్ సలార్‌దాదా, లంకే వెంకటేశ్వరరావు, కొడాలి శర్మ, మాదివాడ రాము, బొర్రా విఠల్, మారుమూడి విక్టర్‌ప్రసాద్, మోకా భాస్కరరావు, వాలిశెట్టి రవిశంకర్, అక్కినేని వనజ, కొల్లాటి శ్రీనివాసరావు, మోదుమూడి రామారావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
న్యూడెమోక్రసీ దళ కమాండర్ అరెస్టు
టేకులపల్లి: న్యూడెమోక్రసీ(రాయల) అజ్ఞాత దళ కమాండర్ ఆజాద్ అలియాస్ మధు(45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ శనివారం టేకులపల్లి సీఐ కార్యాలయంలో ఈ వివరాలు వెల్లడించారు. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన మధు ఇరవయ్యేళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడని తెలిపారు. శనివారం ఉదయం ఆళ్లపల్లి మండలం బాటన్ననగర్లోని ఓ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నాయని, ఈ మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. -
బెంగళూరులో గ్యాంగ్ వార్
-
బెంగళూరులో గ్యాంగ్ వార్
బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ ఆస్తి వివాదంలో భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ ఆగ్రహించి మధును కిడ్నాప్ చేసి చితకబాదింది. ఇక ముందు తాను ఎలాంటి సెటిల్ మెంట్లకు పాల్పడబోనని ఎంతగానో వేడుకోవడంతో మంజునాథ్ గ్యాంగ్ మధును విడిచిపెట్టింది. గతంలో మధును బెదిరించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోను మంజునాథ్ గ్యాంగ్ విడుదల చేసింది. భానుకిరణ్ పేరుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు సెటిల్ భారీ మొత్తాలలో సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలే సూరి హత్యకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
ఆరు విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు!
* ప్రభుత్వానికి వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ప్రతిపాదన * నష్టపోయిన రైతులకు రూ.20 వేల నుంచి రూ.40 వేల పరిహారం * నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక విత్తన చట్టం తేవాలని సూచన * విత్తన కంపెనీల యజమానులు పరారీ... * కాపాడాలంటూ ప్రజాప్రతినిధులను కలుస్తున్న డీలర్లు! సాక్షి, హైదరాబాద్: రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టిన ఆరు విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు పరిహారంగా చెల్లించాలని కోరనుంది. ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్త సైదయ్య, ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధు సహా పలువురి బృందం మూడు రోజుల పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించి.. పలు కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినట్లు నిర్ధారించింది. దీనిపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మం గళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథికి అందజేయనుంది. ఖమ్మం జిల్లాలో జీవా అగ్రి జెనిటిక్స్ లిమిటెడ్‌కు చెందిన జేసీహెచ్-801 విత్తనాలను, గ్రీన్ ఎరా కంపెనీకి చెందిన సీఎస్-333 విత్తనాలను రైతులకు అంటగట్టారు. వరంగల్ జిల్లాలో జీవాతోపాటు ఆగ్రో జెనిసీడ్, క్రాప్ జెనిటిక్స్కు చెంది న బేలా-2205, క్యామ్‌సన్ సీడ్స్ లిమిటెడ్‌కు చెందిన పెన్నార్, లక్కీ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన అంజనీ, మహా నంది కంపెనీకి చెందిన మహాతేజ మిరప విత్తనాలను విక్రయించారు. ఈ విత్తనాల్లో సగానికిపైగా నకిలీ విత్తనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం తేల్చిం ది. నకిలీ విత్తన న మూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపి, పూర్తి వివరాలను తేల్చనున్నారు. భారీగా నష్టం.. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంత మంది రైతులు నష్టపోయారనే అంశాలను జిల్లా కలెక్టర్లు నిర్ధారిస్తారని శాస్త్రవేత్తల బృందం నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నష్టపోయిన రైతులు మిరప విత్తనాలు, సాగు కోసం ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారని.. ఈ మేరకు పరిహారం చెల్లించాలని సూచించినట్లు సమాచారం. దీనిని కంపెనీల నుంచే వసూలు చేయాలని.. నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్లనూ బాధ్యులను చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక నకిలీ విత్తనాలు విక్రయించే వారికి కఠిన జైలుశిక్ష, జరిమానాలు విధించేలా విత్తన చట్టాన్ని తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వమే పరిశోధన, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని చేపట్టాలని, హైబ్రిడ్ కాకుండా సూటి రకాలను తయారుచేసి రైతులకు అందజేయాలని... విత్తనాలపై రైతులను చైతన్యం చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. అడ్రస్‌లన్నీ నకిలీవే.. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలన్నీ కూడా నకిలీ అడ్రస్‌లు ఇచ్చి లెసైన్సులు పొందాయి. ఆయా చిరునామాల్లో అధికారులు దాడులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఇలా అడ్రస్ లేకుండా నడిపించే విత్తన కంపెనీలకు ఎలా లెసైన్సులు ఇచ్చారనేది తేలడం లేదు. లంచం తీసుకుని లెసైన్సులు ఇస్తున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నకిలీ విత్తనాల బాగోతం బయటపడడంతో కొన్ని కంపెనీల యజమానులు, కొందరు డీలర్లు పరారీలో ఉన్నారు. కొందరు కంపెనీ ప్రతినిధులు, డీలర్లు ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి తమను ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వ్యవసాయశాఖకు చెందిన కొందరు అధికారులను కూడా వారు కలిసి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
భీమవరం : పెద్దఎత్తున కాలుష్యాన్ని వెదజల్లే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ పి.మధు స్పష్టం చేశారు. శనివారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించి పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి భరోసా ఇవ్వడానికి వచ్చిన తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ సందర్భంలో పోలీసులు నీచాతినీచంగా వ్యవరించారని, దుర్మార్గంగా తనపై దాడి చేశారని మధు వాపోయారు. తమను దొంగలు, రౌడీలు మాదిరిగా ఈడ్చుకువెళ్లారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వాపార్క్ నిలుపుదల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఆదివారం ధర్నాలు నిర్వహిస్తామని, తద్వారా ముఖ్యమంత్రికి హెచ్చరికలు పంపుతామని అన్నారు. ఈనెల 6వ తేదీన భీమవరంలో యనమదుర్రు డ్రెయిన్ కాలుష్యంపై సదస్సు నిర్వహించనున్నామని, యనమదుర్రు కాలుష్యానికి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీయే కారణమని ధ్వజమెత్తారు. తణుకు పట్టణంలోని కొన్ని ఫ్యాక్టరీల కారణంగా కాలుష్యం పెరిగిపోయిందన్నారు. ఈనెల 8వ తేదీన ఆక్వా ఫుడ్ పార్క్‌పై సదస్సు నిర్వహిస్తామని, దీని నిర్మాణాన్ని నిలుపుదల చేసేవరకూ అంచలంచెలుగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, వైఎస్సార్ సీపీ నాయకులు గాదిరాజు తాతరాజు, కోడే యుగంధర్, మునిసిపల్ కౌన్సిలర్ భూసారపు సాయిసత్యనారాయణ, సీపీఎం నాయకులు బి సత్యనారాయణ, బీవీ వర్మ, వాసుదేవరావు ఉన్నారు. -
కిందపడి బాలుడికి గాయాలు
హిందూపురం అర్బన్ : చెట్టు ఊడలు పట్టుకుని ఊయల ఊగుతూ జారి కిందపడి పోవడంతో పరిగి మండలం చిన్నపల్లికి చెందిన మధు (12) మంగళవారం రాత్రి తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. సాయంత్రం పిల్లలతో కలిసి ఆడుకుంటూ కింద పడిపోయాడు. తల, కంటిపైభాగంలో బలమైన గాయాలయ్యాయి. -
గ్యాస్ అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోరే?
- సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, అది ప్రజల సొమ్మని ఆ సంస్థ నుంచి నష్టపరిహారం వసూలు చేయాలని సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆదివారం లేఖ రాశారు. కేజీ బేసిన్లో గ్యాస్‌ను రిలయన్స్ అక్రమంగా తరలించినట్లు జస్టిస్ షా కమిషన్ గత ఆగస్టు 31న కేంద్ర పెట్రోలియం శాఖకు నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2009 నుంచి మార్చి 2015 వరకు రిలయన్స్ కంపెనీ రూ.10 వేల కోట్ల విలువ చేసే 1,100 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను అక్రమంగా విక్రయించినట్లు జస్టిస్ షా కమిషన్ విచారణలో తేలిందని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో మెగా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఆ ప్రాతంలో పర్యటిస్తున్న ఏపీ ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవితోపాటు మరో ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మరో ప్రకటనలో ఖండించారు. -
పాక్ బాలిక కల నెరవేర్చిన ఢిల్లీ సీఎం, సుష్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో చదవాలన్న ఓ పాకిస్థాన్ నుంచి వచ్చిన బాలిక కల నెరవేరింది. రెండేళ్లుగా ఏ స్కూల్లో అవకాశం ఇవ్వకపోయినా ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో చివరకు ఆ అమ్మాయికి ఢిల్లీ స్కూల్లో చదివే అవకాశం వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన మధు అనే పదహారేళ్ల అమ్మాయి రెండేళ్ల కిందట ఢిల్లీకి వచ్చింది. తన తల్లి, సోదరులు, బాబాయ్‌తో కలిసి ఇక్కడ అడుగు పెట్టింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరుగుతున్న మతపరమైన హింసను భరించలేక వారి కుటుంబం ఇండియాకు తరలి వచ్చింది. అయితే, స్కూలుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు పోగొట్టుకుంది. దీంతో ఆమెకు ఎక్కడా అడ్మిషన్ ఇవ్వలేదు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోపాటు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ను ఆ అమ్మాయి కలిసింది. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఆ అమ్మాయిని చేర్చుకోవాల్సిందిగా లేఖ రాశారు. దీంతో ఆ అమ్మాయికి ప్రవేశం లభించింది. దీంతో సిసోడియాకు ధన్యవాదాలు తెలుపుతూ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. మానవతా దృక్పథంతోనే ఆమెకు సీటు ఇచ్చినట్లు సిసోడియా చెప్పారు. -
లెక్క తర్వాత తేలుస్తారు!
మహేశ్‌బాబు అభిమానులకు, ప్రేక్షకులకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అందరికీ కొత్త మహేశ్‌ను చూపిస్తానంటున్నారు. మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. గతంలోనే మహేశ్-మురుగదాస్ ఓ చిత్రం చేయాలనుకున్నారట. ఇప్పటికైనా కుదిరినందుకు మురుగదాస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడూ బాగుంటుంది. కానీ, ఈసారి ప్రేక్షకులు విభిన్నమైన మహేశ్‌ను చూస్తారు’’ అని మురుగదాస్ తెలిపారు. సుమారు వంద కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, మహేశ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిదనీ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం గురించి మురుగదాస్‌ని అడగ్గా... ‘‘చిత్రీకరణ ప్రారంభమైంది ఇప్పుడే కదా. అప్పుడే బడ్జెట్ గురించి చెప్పడం కష్టమే. ఆ లెక్క తర్వాత తేలుతుంది. దర్శకుడిగా మంచి చిత్రం ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నిస్తాను. ఎప్పుడూ స్క్రిప్టే బడ్జెట్‌ను నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కి మహేశ్‌బాబు స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారట. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. -
పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం: మధు
జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. రాజకీయ స్పందనను కమ్యూనిస్టులుగా తాము పరిశీలిస్తున్నామని అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలో కరువు పర్యటనకు విచ్చేసిన ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. గో సంరక్షణ పేరుతో బీజేపీ అనుసరిస్తున్న మత రాజకీయాలను పవన్ తప్పు పట్టడం హర్షణీయమన్నారు. తనకు కులం, మతం, ప్రాంతీయతత్వం లేవని చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ కేంద్రంపై పోరాడాలని పవన్ పిలుపునివ్వడం మంచి పరిణామమన్నారు. టీడీపీ ఎంపీ, మంత్రులు వ్యవహరిస్తున్న తీరును పవన్ తప్పుపట్టడం సరైందేనన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధి సబ్‌కమిటీ కన్వీనర్ జి.ఓబులు, జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడారు. -
బంద్‌కు బాబు మద్దతు ఇవ్వాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ గుంటూరు వెస్ట్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించి హోదాను సాధించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఖరి ఇందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఒకపక్క ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అన్యాయం అంటూనే బంద్ అవసరం లేదని, ఉద్యమాలు చేయవద్దని, అఖిల పక్ష సమావేశాలు సైతం అనవసరమని చంద్రబాబు ప్రకటించడం అవకాశవాదం తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఈనెల 2వ తేదీన జరిగే బంద్‌లో పెద్దఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మధు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
'ఏకపక్ష నిర్ణయాలు తగదు'
నెల్లూరు: ఏపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. శనివారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమెరికా దేశానికి తలొగ్గిన ప్రభుత్వం ప్రజలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా జిల్లాలోని కావలి సమీపంలో అణుద్యుత్కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేయడం తగదన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. -
బాబు వచ్చాడు.. జాబులు పోయాయి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజం సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాబు వస్తే జాబు వస్తుందన్న ఎన్నికల వాగ్దానం నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 79,224 తగ్గడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. బుధవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2013 డిసెంబర్ 31 నాటికి 5.67 లక్షలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2016 జనవరి నాటికి 4.88 లక్షలకు తగ్గిపోయిందన్నారు. విభజన సమయంలో కమలనాథన్ కమిటీ లెక్కకట్టిన 1.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోగా రెండేళ్లలో 79,224 ఉద్యోగులను తగ్గించేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. -
హోదాపై వైఖరి ప్రకటించకుంటే బాబు ద్రోహే
- పదేళ్ల హోదా వాగ్దానం ఏమైంది - చంద్రబాబు పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విజయవాడ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని, ఇంత జరిగినా బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న చంద్రబాబు తన వైఖరి ప్రకటించకుంటే రాష్ట్ర ప్రజల దృష్టిలో ద్రోహిగానే మిగిలిపోతాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వాస్తవాలను ప్రజలకు చెప్పి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం పచ్చి అవకాశవాదమే అవుతుందన్నారు. కార్మికులు, ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేయడం, వామపక్షాల గొంతు నొక్కడం మినహా రెండేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా విభజన సమయంలో ఏపీకి హోదాతోపాటు వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీలు, పోలవరం, లోటు బడ్జెట్ భర్తీ వంటి అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. తమను గెలిపిస్తే విభజన హామీలు అమలు చేస్తామని, ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానాలు చేసి ఇప్పుడు హోదా పై మాట మార్చారని అన్నారు. అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం వేసి రాష్ట్రానికి విభజన హామీలు సాధించేలా చొరవ తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర ప్రజల దృష్టిలో చంద్రబాబు నమ్మక ద్రోహిగానే ముద్రవేసుకుంటారని దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
గొడవ ఆపడానికి వెళ్తే కత్తి పోట్లు
అన్నదమ్ముల మధ్యలో జోక్యం చేసుకున్న పక్కింటి యువకుడు వారి చేతిలో కత్తిపోట్లకు గురయ్యాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... బ్లాక్‌నెంబర్ 52లో శోభ అనే మహిళ తన కుమారులు నాగరాజు, మధుతో కలసి నివసిస్తోంది. మధు ప్లంబర్‌గా పనిచేస్తుండగా నాగరాజు మద్యం, గంజాయి వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ తల్లితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో నాగరాజు తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు మధు అడ్డుకున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో పక్కింట్లో ఉండే కిరణ్ వచ్చి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తమ గొడవలో ఎందుకు జోక్యం చేసుకుంటావని ఆగ్రహంతో కిరణ్‌పై నాగరాజు కత్తితో దాడి చేశాడు. కిరణ్ భుజం, చేతికి కత్తిపోట్ల కారణంగా గాయాలు కావడంతో అతడ్ని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఫిరాయింపులు కాదు..అభివృద్ధి చేయండి'
కడప: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. గురువారం ఆయన కడపలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పలోభాలకు గురిచేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం తగదని హితవు పలికారు.ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను సవరించాలని, ఆ దిశగా ప్రస్తుతం జరుగుతున్న చర్చను తమ పార్టీ ఆహ్వానిస్తోందని చెప్పారు. ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గుర్తింపుపై స్పీకర్ అధికారాలను తగ్గించాలని సూచించారు. అక్రమ ఫిరాయింపులపై తాము త్వరలో ఉద్యమం చేపడతామని చెప్పారు. -
ఐపీఎల్ బెట్టింగ్‌కు యువకుడు బలి
ఆర్థిక ఇబ్బందులకు తోడు ఐపీఎల్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాహతుకు మించి అప్పులు చేసి జల్సాలు చేస్తున్న యువకుడు ఐపీఎల్లో భారీగా బెట్టింగ్ కాసి ఓడి పోవడంతో.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మధు(24) సెల్‌ఫోన్ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో.. జల్సాలకు అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్ ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చని ప్లాన్ వేశాడు. బుధవారం జరిగిన కోల్ కతా, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ పెట్టాడు. బెట్ ఓడిపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక.. తన దుకాణంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'వైద్య బకాయిలపై ప్రభుత్వానికి సీపీఎం లేఖ'
విజయవాడ : ఎన్టీఆర్ వైద్య సేవల నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సిన రూ.350 కోట్ల బకాయిలను చెల్లించి పేదలకు అందాల్సిన వైద్యసేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు రాసిన లేఖను గురువారం పత్రికలకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వంతో చర్చలు నిర్వహించినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నెల 25 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో వైద్యసేవలు పొందాల్సిన అనేక మంది పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోకపోతే పేదలకు ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యంతో చర్చలు జరిపి, బకాయిలను చెల్లించి వైద్యసేవలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి మధు విజ్ఞప్తి చేశారు. -
'బాబూ.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి'
విజయవాడ: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానించడం చంద్రబాబు దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బలహీనపరిచేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని మధు తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అనుసరించిన విధానాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. -
నైజీరియాలో రోడ్డు ప్రమాదం..తెలుగు వ్యక్తి మృతి
నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మధు(35) అనే వ్యక్తి మృతిచెందాడు. మధు ఐదేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం నైజీరియాకు వెళ్లాడు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా. మధు మృతిలో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోజా సస్పెన్షన్ సిగ్గుచేటు: సీపీఎం
-
రోజా సస్పెన్షన్ సిగ్గుచేటు: సీపీఎం
తిరుపతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 'రోజా ప్రస్తావించిన అంశాలన్నీ సమంజసమే. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో అధికార పార్టీ నేతలే ఉన్నారు. వారి పై చర్యలు తీసుకోకుండా ఇతరులను విమర్శిస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు. -
'ప్రభుత్వ కనుసన్నల్లోనే కాల్ మనీ వ్యాపారం'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో అన్నీ అరాచకాలే జరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ...కాల్ మనీ వ్యవహారం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. కేసు సీరియస్‌గా ఉన్న సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను సెలవుపై పంపడం ఎంతవరకు సబబని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మధు డిమాండ్ చేశారు. -
సైకో మధు ఇంటరాగేషన్‌లో నమ్మలేని నిజాలు!
-
మాయగాడు మధు రివర్స్ ఇంటరాగేషన్ !
పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్న మహామాయగాడు మధు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా తమ కస్టడీలోకి తీసుకున్న నిందితుల్ని పోలీసులు ప్రశ్నిస్తారు. ఇది రొటీన్‌గా జరిగే వ్యవహారమే. అయితే నగరంలో వేల మంది యువతులకు వల వేసి, వందల మందిని వంచించిన మహా మాయగాడు మధు విషయంలో భిన్నంగా ఉంది. నిందితుడే పోలీసు అధికారులకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. న్యాయస్థానం అనుమతితో అతడిని కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వరుసగా మూడో రోజైన శుక్రవారమూ విచారించారు. ఈ నేపథ్యంలోనే మధు నుంచి వీరికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓపక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ముసుగులో, బంగారు భవితకు అవసరమైన సలహాలు ఇస్తానంటూ అనేక మంది యువతుల్ని వంచించినట్లు అంగీకరిస్తున్నాడు. మరోపక్క ‘నేను ఎవరినీ మోసం చేయలేదు. బలవంతంగా అత్యాచారమూ జరపలేదు. అలాంటప్పుడు ఏం తప్పు చేసినట్లు సార్?’ అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నాడు. మధు చేతిలో వంచనకు గురైనట్లు అనుమానిస్తున్న బాధితులను సంప్రదించడానికి సీసీఎస్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలో ‘ఓవర్’, ‘డేంజర్’, ‘వేస్ట్’ అంటూ రిమార్క్స్ ఉన్న వారిని గుర్తించి, ఫిర్యాదులు తీసుకునేందుకు అధికారులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని ఫోన్లు పని చేయకపోవడమో, మరికొన్నింటి నుంచి సరైన స్పందన లేకపోవడమో జరుగుతోంది. నిందితుడిపై మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. -
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
హైదరాబాద్ : అమాయక యువతుల్ని లోబరుచుకున్న మహా మాయగాడు మధును సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మధును తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నగర సీసీఎస్ పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందుకు నాంపల్లి కోర్టు అయిదు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఎఫ్ సీఐ లో ఉద్యోగం చేస్తూ సస్పెండ్ అయ్యాడు. వందలాది మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని మోసం చేశాడు. మధును షీ-టీమ్స్ బృందం గత గురువారం పట్టుకుంది. నయవంచకుడి చేతిలో మోసపోయిన బాధితుల వివరాలతో పాటు ఇంకా ఏవైనా పంథాలు అనుసరించి ఎవరినైనా మోసం చేశాడా... అనే కోణంలో విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఇతడి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ విశ్లేషించి, నివేదిక ఇవ్వడం కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపాలని నిర్ణయించారు. వీటి ఆధారంగా బాధితుల వివరాలతో పాటు మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
పోలీసు కస్టడీకి మాయగాడు మధు
-
'రాజధానిని సింగపూర్.. పోలవరాన్ని జర్మనీకి అప్పగిస్తారా?'
అనంతపురం : నూతన రాజధాని నిర్మాణం పనులు సింగపూర్‌కు, పోలవరం ప్రాజెక్టును జర్మనీకి అప్పగిస్తారా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం పట్టణంలో గురువారం నాడు మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మధు సంఘీభావం తెలిపారు. తనపై ఉన్న కేసులు భయటపెడతారనే భయంతోనే సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంటూ విమర్శించారు. ఏపీని చంద్రబాబు విదేశాలకు తాకట్టు పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/బూర్జ: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలు, రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్లో సీపీఎం జిల్లా నాయకులను, శ్రేణులను కలవనీయకుండా బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన ఎవరితో మాట్లాడకుండా ముందస్తుగానే సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమయంలో సీఐ నవీన్‌కుమార్, మధు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులు, జిల్లా పార్టీ నేతలను మధుతో మాట్లాడనివ్వలేదు. నేతలు పోలీసులతో వాదనకు దిగడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హుటాహుటిన చేరుకున్న శ్రేణులు మధు అరెస్టు వార్త తెలియడంతో జిల్లా పర్యటనలోనే ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దడాల సుబ్బారావుతో పాటు జిల్లా నలుమూలల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి బైఠాయించి, మధు అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో పలువురు నాయకుల్నీ పోలీసులు అరెస్టు చేశారు. మధును 151, 120బి,188, 34 రెడ్‌విత్ సెక్షన్లపై అరెస్టు చేసినట్లు రాత్రి 7.45 సమయంలో మీడియాకు తెలిపారు. అప్పటి వరకూ మీడియాను కూడా అనుమతించలేదు. ఆ తర్వాత మధును విడుదల చేశారు. పొలిట్‌బ్యూరో ఖండన మధును అరెస్ట్ చేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటనలో ఖండించింది. విద్యుత్ కేంద్రానికి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారన్న విషయం తెలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళుతున్న మధును రైల్వే స్టేషన్లోనే అరెస్ట్ చేయడం దుర్మార్గం, అప్రజాస్వామికమని పేర్కొంది. తమ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. -
'టీడీపీ నేతల రౌడీయిజం పెరిగిపోతోంది'
అనంతపురం: అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల రౌడీయిజం రోజురోజుకు పెరిగిపోతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. సోమవారం అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాలో భయంకరమైన కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ హంద్రీనీవాకు నీరు ఎందుకు ఇవ్వరంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజధాని భూముల విషయంలోనూ టీడీపీ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని, పంటలను తగలబెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. రాజధాని పొలాల దహనంపై న్యాయవిచారణ ఊసే లేకుండాపోయిందన్నారు. -
ద్విముఖ పోరాటమే నేటి అవసరం
ఈ నెల 9న జరిగే పది వామపక్షాల సమావేశం గురించి సీపీఎం ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి మధు పత్రికలకు వెల్లడించిన వివరాలు విని సంతోషించిన కమ్యూనిస్టు శ్రేయోభిలాషులలో నేనూ ఒకడిని. ఆంధ్ర రాజధాని ప్రాంత రైతుల, కూలీల, వ్యవసా యాధారిత వృత్తుల వారి సమస్యల గురించి చర్చిం చి, వాటి పరిష్కారం కోసం లక్షమంది మహిళలతో త్వరలో చేపట్టబోయే ఉద్యమం గురించి చర్చించ డమే ఆ సమావేశం ఉద్దేశం. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీయాలన్నది వామపక్షాల లక్ష్యం. సమస్య తీవ్రమైనది. అందుకు తగ్గట్టు ఉద్యమాన్ని ఉధృత స్థాయిలో నిర్వహించాలన్న వామపక్షాల నిర్ణయం కూడా అభినందనీయమే. ప్రతిపక్షాలకే కాదు, అసలు ప్రజానీకానికే జవాబుదారులం కాదన్నట్టు వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమం తగిన గుణపాఠం నేర్పాలని కూడా కోరుకుందాం. దిగజారిన చంద్రబాబు ప్రతిష్ట చంద్రబాబు నేడున్నంత ఆత్మరక్షణ పరిస్థితిలో గత ఏడాదికాలంలో ఎన్నడూ లేరు. ఎన్నికల హామీలలో ఒక్కటీ నెరవేర్చక పోవడంతో చంద్రబాబుపై విశ్వ సనీయత అంతంత మాత్రంగా మిగిలింది. రేవంత్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని జరి పిన ఓటుకు కోట్లు కుంభకోణంతో ఆ కాస్త విశ్వసనీయత అధ ఃపాతాళానికి పడిపోయింది. రేవంత్ పాత్రధారిగా, తానే సూత్రధారిగా సాగించిన ఈ బాగోతం వీడియోలను, ఆడియోలను తెలుగు ప్రజలు చూశారు. దీనితో ఒక విధమైన ఆత్మన్యూనతా భావం చంద్రబాబును ఆవరించింది. అదంతా విశ్వామిత్ర సృష్టి అని చెప్పడం సాధ్యం కాక, తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందనీ, సెక్షన్ 8ని గుర్తించడం లేదనీ, ఏపీ ప్రయోజనా లను అడ్డుకుంటూ కేసీఆర్ అహంకార ధోరణితో ఉన్నారనీ చంద్రబాబు ఎదు రుదాడికి దిగుతున్నారు. తనతోపాటు తన అనుచరగణాన్ని కూడా ప్రోత్స హించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అశాంత వాతావరణానికి దోహదం చేస్తున్నారు. చంద్రబాబు ఎదురుదాడిలో ఏదో మేర వాస్తవం ఉండవచ్చు. స్వచ్ఛమైన ప్రజాస్వామికవాది అని కేసీఆర్‌ను ఎవరూ అనలేరు. కానీ ఆ ఎదు రుదాడితో చంద్రబాబును ఆవరించిన ఓటుకు కోట్లు అవినీతి వ్యవహారం మరుగునపడదు. వామపక్షాలు చేపట్టబోయే మహోద్యమాన్ని స్వాగతించే సమయంలో ‘ఓటుకు కోట్లు’ ప్రస్తావించడానికి కారణం ఉంది. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం ప్రకారం ఆర్థిక పునాదికి అనుగుణంగా ఉపరితలం మీద రాజకీయాలు, కళలు, మతం, సంస్కృతి వంటి అంశాలు ఉంటాయి. అలాంటి ఆర్థిక అంశం మీదనే వామపక్షాలు ఉద్యమించనున్నాయి. నిజానికి రాజధాని ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడిన జనం పరిస్థితి జీవన్మరణ సమస్యగా పరిణ మించింది. దీని మీద గతంలోనూ వామపక్షాలు ఉద్యమాలు నడిపాయి. ఇప్పటి మహోద్యమం ఆలోచన వాటి నుంచి ఉద్భవించి ఉండవచ్చు. అలాం టి ప్రజా ఉద్యమాన్ని ఓటుకు కోట్లు వ్యవహారం మీద కూడా వామపక్షాలు నడిపి ఉండవలసింది. ఉపరితల అంశాలూ ముఖ్యమే అదలా ఉంచుదాం! ఏంగిల్స్ పునాది ఉపరితలం గురించి వివరణ ఇస్తూ, నేనూ, మార్క్స్ చెప్పింది అంతిమంగా ఆర్థిక పునాదే నిర్ణయాత్మకమవుతుం దని మాత్రమే. అంతమాత్రాన ఉపరితలంలో ఉండే రాజకీయాలు, మతం, కళలు, సంస్కృతి ఇత్యాది అంశాల ప్రభావమేమీ ఉండదని అర్థంకాదు! పైగా ఆర్థిక పునాదికి సంబంధించిన అంశాలకంటే చాలా సందర్భాలలో ఉపరిత లంలోని అంశాలపైనే త్వరితగతిన విస్తృతస్థాయిలో ప్రజలు స్పందిస్తారని అన్నారు. మన అనుభవం కూడా అదే! రాజకీయ అవినీతి ఉపరితల అంశ మే! బహుశా అందుకే దానిపై ప్రజలలో అంత ఆసక్తి, వ్యతిరేకతలతో చర్చ జరుగుతున్నది. ఎన్నో ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలు చేపట్టినా సాధారణ ప్రజానీకంలో ప్రభుత్వంపై కలగనిఏహ్యభావం ఈ ఓటుకు కోట్లు బాగోతం వల్ల కలిగింది! అదే సమయంలో టీడీపీ నేతల గళాలు గతంలో కంటే హె చ్చుస్థాయిలో ఎదురుదాడితోనూ, ఆ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుం టాయేమోనన్న భయంతో వైఎస్సార్ సీపీపైన, కాంగ్రెస్‌పైన వ్యర్థంగానూ విరుచుకుపడుతున్నాయి. జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌తో కుమ్మక్కయాడట! సరే అలాగే అనుకున్నా, రేవంత్‌రెడ్డిని లోబరుచుకుని, ఈ ఓటుకు కోట్లు బాగోతాన్ని సృష్టించి, టీడీపీ పరువును చంద్రబాబు పలుకుబడిని దిగజార్చ మని జగన్ ప్రోత్సహించారా? ఇలాంటి ప్రశ్నలూ, వింత వింత సమాధా నాలు ప్రజల దృష్టిని బాగా ఆకర్షించి, తెలుగుదేశం, చంద్రబాబు ప్రతిష్టలను బాగా మసకబారుస్తున్నాయి. రాజధాని ప్రాంత సమస్యలకూ, ‘ఓటుకు కోట్లు’ రగడకీ మూలం - అవి నీతే. దొడ్డిదారినో అడ్డదారినో ఆర్జించిన ధనంతో పదవిలో కొనసాగాలన్న అధికార దాహం చంద్రబాబుది. రాజధాని ప్రాంతంలో భూసమీకరణ, ఒప్పు కోకుంటే భూసేకరణ పేరుతో బెదిరింపులు, పర్యాటక కేంద్రాలు, హోటళ్లు, రిసార్టులు, గోల్ఫ్ పార్కులు ఇవన్నీ, అదీ ప్రైవేట్ రంగంలో విదేశీ స్వదేశీ గుత్తాధిపతులకు కట్టబెట్టి తద్వారా తనకు, తన అనుయాయులకు తరతరా లకు తరగని ఆస్తి సమకూర్చాలన్న తపన తప్ప ఏముంది? అవినీతితో ఈ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో వ్యవహరిస్తున్న దళారి స్వభావంలో ఉంది. ఆ నైజాన్ని బహుళ అంతస్తుల భవనాలు, సింగపూర్, జపాన్ తరహాలో మెట్రో రైళ్లు, అత్యాధునిక విమానాశ్రయాలు, 1000 సంవత్సరాలు సైతం చరి త్రలో నిలబడే రాజధాని పేరిట రంగుల కలలతో కప్పిపెట్టుకుంటున్నారు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం! అదీ ఈ ఓటుకు కోట్లు బాగోతం ప్రాధాన్యం. ఆర్థిక పునాది అంతిమ నిర్ణయాత్మకమని కమ్యూనిస్టు పార్టీలు గుర్తుంచుకోవాలి! ఈ లోపల ఉపరి తలంలో ఉంటున్న విష సంస్కృతిపై పోరాడాలి! రాజకీయ అవినీతితో పాటు, నిచ్చెన మెట్లలాంటి వర్ణవ్యవస్థ, దళితులు, ఆదివాసీ గిరిజనులు బాగా వెనుకబడిన కులాల వారిపై అగ్ర పెత్తందారీ కులాలు జరుపుతున్న దోపిడీ దౌర్జన్యాలు, మైనారిటీలలో అభద్రత, మహిళల జీవితాలను ధ్వంసం చేస్తున్న మనుస్మృతి భావజాలం ఇవన్నీ మన వ్యవస్థ ఉపరితలంలోని విష సంస్కృతి భాగాలే! ఈ ద్విముఖ పోరాటం జరపకుండా మన ప్రత్యేక పరిస్థి తిలో సామాజిక పురోగమనం అసాధ్యం. కనుక ఈ క్షణాన ఇటు రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఆర్థిక పోరాటం, మరోవంక రాజకీయ అవినీతికి నిలువుటద్దం పట్టిన చంద్రబాబు ఓటుకు కోట్లు బాగోతం రెంటినీ సమన్వ యపరచి, వామపక్షాలు సమైక్య సమరశీల మహోద్యమం చేయాలి. ఈ వామ పక్ష ఐక్యత, ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసమే! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ నం: 98480 69720) - ఏపీ విఠల్ -
'చంద్రబాబువి మనీ పాలిటిక్స్'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనీ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారని సీపీఐ, సీపీఎం ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధు మండిపడ్డారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఏడాది గడిచినా హామీల అమలులో ఆయన విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాజధాని భూములు కొల్లగొడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ఓట్ల కోసం జనాన్ని చంద్రబాబు వాడుకున్నారని వారు దుయ్యబట్టారు. -
మైమ్ ద్వారా గుర్తింపు పొందాలని..మైమ్ కళాకారుడు మధు
మైమ్ కళ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించి మంచి కళాకారుడిగా గుర్తింపు పొందడమే లక్ష్యమని మైమ్ కళాకారుడు మధు అన్నారు. గోదారి నవ్వింది షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లో మైమ్ ప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. జులైలో న్యూజిలాండ్, అమెరికాలో ప్రదర్శనలివ్వనున్నట్టు తెలిపారు. బర్డ్ అండ్ హంటర్, డ్రీం ప్రదర్శనలు మైమ్‌లో తనకెంతో గుర్తింపు నిచ్చాయన్నారు. జెమినీ టీవీలో ప్రసారమయ్యే శ్రావణ సమీరాలు సీరియల్లో విశాల్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందన్నార -
'రైతులకు అండగా నిలుస్తాం'
-
రైతు రుణమాఫీ అంతా బూటకం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నెల్లూరు: సీఎం చంద్రబాబు చేస్తున్న రైతు రుణమాఫీ అంతా బూటకం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఈ విధంగా మోసం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ తీరు చూస్తుంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల వడపోతే లక్ష్యంగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న వడపోతలతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. కౌలు రైతుల రుణాలు మాఫీ విషయంలోనూ అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. అధికార దాహంతో చంద్రబాబు చేసిన మోసం వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు ఆల్లాడిపోతున్నారన్నారు. రుణమాఫీపై కల్లబొల్లి మాటలు చెబు తూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన బాబు ఏమాత్రం బాగుపడరని శాపనార్థాలు పెట్టారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే విధం గా చేసిన బాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. -
'ఆకాశంలోంచి కాదు.. కింద నుంచి చూస్తే బాగుండేది'
గుంటూరు: సింగపూర్ బృందం ఆకాశం నుంచి గాక నేలపై ఏపీ రాజధాని నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించి ఉంటే బాగుండేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో మధు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఏపీ రాజధాని నిర్మించనున్నప్రాంతంలో సింగపూర్ బృందం ఇటీవల ఏరియల్ సర్వే చేసింది. మధు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సింగపూర్ బృందం ప్రజెంటేషన్ చూస్తే బాగుండేదని అన్నారు. గతంలో తీసుకున్న భూములకే ఇంతవరకు ఏ ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ప్రభుత్వం రుణుమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. -
‘ఎర్ర’ స్మగ్లింగ్‌లో ప్రభుత్వంపైనే అనుమానం
సీఎంకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ప్రభుత్వంపైనే అనుమానాలు బలపడుతున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. దీనిపై శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ప్రభుత్వంలోని పెద్దలు సక్రమంగా ఉంటే అధికారులు ఎలా స్మగ్లర్లకు సహకరిస్తారని లేఖలో పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పలుమార్లు ప్రకటించిన తరువాత కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా స్మగ్లింగ్ కొనసాగుతోందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. -
యువతే లక్ష్యంగా...
సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యువతను లక్ష్యంగా చేసుకొని కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పనిచేసిన అందరూ చక్కగా సహకరించారు. వచ్చే నెల రెండోవారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతకు కావాల్సిన సందేశంతో ఈ చిత్రం రూపొందిందని సహ నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
చంద్రబాబును నిలదీయండి
అనంతపురం అగ్రికల్చర్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నేతలు డి.హీరేహాళ్ మండలం నుంచి చేపట్టిన పాదయాత్ర మంగళవారం అనంతపురం చేరుకుంది. ముగింపు సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై పూటకో మాట మాట్లాడుతూ తీవ్రజాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల సేకరణకు ఎర్రచందనం దుంగలను, ఇసుక క్వారీలను అమ్ముకోవాలని చూస్తున్న చంద్రబాబుకు దిమాక్ కరాబ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఆగడాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. రక్షిత మంచి నీటిని ప్రజలకు ఉచితంగా చంద్రబాబును నిలదీయండి అందించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అయితే ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2కే 20 లీటర్ల నీరు ఇస్తామని వ్యాపారం చేయడం తగదన్నారు. రేపు రూ.8, తర్వాత రూ.20 అని నీటికి ధర నిర్ణయించడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటు చేయబోయే వాటర్ ప్లాంట్లను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రుణ మాఫీ, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల వయో పరిమితి పెంపు వంటి హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడినట్లేనని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఖుద్రేముఖ్ ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా డి.హీరేహాళ్ మండలం నేమకల్లులో పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చౌకడిపో డీలర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలను అక్రమంగా తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచివి కావన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, నీళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజల జీవితాలనే మారుస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా పూర్తి చేసేందుకు రూ. 10వేల కోట్లు కేటాయించాలని కోరారు. హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, 100 టీఎంసీలను జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, కార్యవర్గ సభ్యులు నల్లప్ప, కొండారెడ్డి, ఇంతియాజ్, రైతు సంఘం నాయకులు పెద్దిరెడ్డి, హరి, కృష్ణమూర్తి, అంజి, చంద్రమోహన్, నరేష్, తిరుపాల్, వెంకటనారాయణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
‘పవనిజం’ ఆడియో ఆవిష్కరణ
-
అరెస్టుల పర్వంలో ...అదే వరుస !
భాకరాపేట తరహాలో చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అందులోనూ టీడీపీ ప్రచారకార్యదర్శి వసంత్‌తో పాటు మధు పేరు ‘సాక్షి’ కథనంతో జిల్లా నుంచి వసంత్ పరార్.. అదే బాటలో మరికొందరు నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం... ‘పచ్చ’ నేతలకు బెయిల్ వచ్చే అవకాశం భాకరాపేట...చిత్తూరు టూ టౌన్. ఊరు ఏదైనా అరెస్టుల పర్వంలో అదే తంతు. ఎర్రచందనం స్మగ్లింగ్లోని ప్రధాన నిందితుల అరెస్టులో నిర్లిప్తత కొనసాగుతోంది. పోలీసులపై అధికారపార్టీ ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్, ఆపార్టీ నేత మధుపై ఎఫ్ఐఆర్ నమోదై కళ్లెదుట తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. అలాంటి వ్యవహారం చిత్తూరు టూ టౌన్లో జరిగింది. ఇక్కడ కూడా వారిపై కేసులు నమోదైనా పోలీసులు అరెస్టు చేయలేదు. అరెస్టుల పర్వంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుల జాబితాలో మరో నలుగురి పేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగల విచారణలో మరో నలుగురు దొంగలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో మొన్నటి వరకూ 196గా ఉన్న సంఖ్య 200కు చేరినట్లయింది. జాబితాలో చేరిన ఆ నలుగురు స్మగ్లర్లు తమిళనాడువాసులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. చిత్తూరు టూటౌన్లోనూ అదే సీన్.. టీడీపీ జిల్లా ప్రచారకార్యదర్శి వసంత్‌కుమార్, ఆ పార్టీ నేత మధుతో పాటు 19మంది ఎర్రచందనం దొంగలపై ఈ నెల 13న భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. వసంత్, మధు జిల్లాలో తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే వీరిని అరెస్టు చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసు కవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో వసంత్, మధుతో పాటు జిల్లాకు సంబంధించిన జాబితాలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. అయితే భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో కూడా ఈ నెల 13నే 16మంది ఎర్రచందనం స్మగ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. సెక్షన్యు/ఎస్379, 109ఐపీసీఆర్/డబ్ల్యూ మరియు ఏపీ ఫారెస్ట్యాక్ట్ 1967 సెక్షన్ 29, 32తో పాటు ఎర్రచందనం అక్రమరవాణా, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. భాకరాపేటలో ఎఫ్ఐఆర్ నమోదైన 19 మందిలోని 11 మంది వ్యక్తులపై చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. వీరిపై మరో కేసు ఉంటే పీడీయాక్టు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే 13 నుంచి భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసులు కూడా వీరి అరెస్టుపై దూకుడు ప్రదర్శించలేదు. దీనికి కారణం కూడా ‘పచ్చ’ నేతలకు ‘ప్రభుత్వ’ అండ ఉండటమే అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ 84మంది స్మగ్లర్ల అరెస్టు ఎర్రచందనం స్మగర్ల అరెస్టులు, కూంబింగ్‌లో వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వీరి పరిధిలో ఈ నెల 22 వరకూ 80 మంది దొంగలు ఉన్నట్లు తెలిసింది. సోమవారం ఎర్రావారిపాళెం పరిధిలో మరో నలుగురు అరెస్టయ్యారు. దీంతో ఈ సంఖ్య 84కు చేరింది. తక్కిన 116 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఇద్దరు ఏఎస్పీలు, 20మంది సీఐలు, వందమంది పోలీసులు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. వీరు మరో స్మగ్లర్ ఆరని రమేష్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రమేష్‌పై భాకరాపేట పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై చిత్తూరు టూటౌన్ ఎస్ఐ లక్ష్మణరెడ్డిని వివరణ కోరగా వారం రోజులుగా తాను ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఉన్నానని తెలిపారు. నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం మంగళవారం జరగనుంది. ఇప్పటి వరకూ పీడీయాక్టు నమోదైన 14మంది స్మగ్లర్లతో పాటు ఇంకెవరిపై పీడీయాక్టు నమోదు చేయాలి? అనే కోణంలో విచారణ జరగనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన దొం గలుగా ఉన్న రెడ్డినారాయణ, మహేశ్‌నాయుడు భార్యలు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడును కలిసిన సంగతి తెలిసిందే! పార్టీ కోసం తమ భర్తలు పనిచేశారని, భారీగా డబ్బు కూడా ఖర్చు చేశారని, వారిని కేసుల నుంచి ఎలాగైనా తప్పించాలని వారు కోరినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు కూడా వారికి ‘అభయం’ ఇచ్చినట్లు తెలిసిం ది. దీంతో ఆ ఇద్దరికీ బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
సమాజ చైతన్యం కోసం...
మధు, సుధీర్, ఇషా, జయంతి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘పవనిజం’. ఈ.కె. చైతన్య దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కనిష్క పాటలు స్వరపరిచారు. ఈ నెల మూడో వారంలో పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బుధవారం ప్రచార గీతాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ -‘‘సామాజిక స్పృహతో పవన్‌కల్యాణ్ మాట్లాడే ప్రతి మాటా యువకులలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ చైతన్యం నుంచి పుట్టినదే పవనిజం. అభిమానులు కేవలం పవన్ సినిమాలను అభిమానించడం మాత్రమే కాదు.. ఆయన భావాలకు అనుగుణంగా సమాజ సేవ చేయడం అనేదే పవనిజం. పవన్ అభిమానులు తల్చుకుంటే సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చనేది ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ డోలా, ఎడిటింగ్: సత్య. -
కొలిక్కిరాని కామ్రేడ్ల సర్దుబాటు
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆచరణాత్మక ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని ప్రకటించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. ఎన్నో సమస్యలపై ఏకాభిప్రాయంతో ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టిన సీపీఐ, సీపీఎంల మధ్య ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన సర్దుబాటు మాత్రం ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. సీమాంధ్రలో నామినేషన్ల గడువు మరో రెండ్రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 20న మరోవిడత చర్చలు జరపాలని నిర్ణయించాయి. అరుుతే అప్పటికే నామినేషన్ల పర్వం ముగుస్తున్నందున ఉపసంహరణల తేదీ నాటికి సీట్ల సర్దుబాట్లపై అవగాహనకు ప్రయత్నిస్తామని, లేకుంటే వివాదాస్పద సీట్లలో ఇరు పార్టీలు స్నేహపూర్వక పోటీలకు దిగుతాయని ఆయా పార్టీల ఆంధ్రప్రదేశ్ నేతలు మధు, రామకృష్ణ తెలిపారు. -
టీడీపీ కాంగ్రెస్‌గా మారింది: మధు
విశాఖపట్నం: బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం అవకాశవాదమని ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి మధు విమర్శించారు. మతతత్వ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం దేశానికే ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. వలసలను ప్రోత్సహిస్తున్న టీడీపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీగా మారిందని మధు విమర్శించారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకుని ఎన్నికల్లో గెలవాలనుకోవడాన్ని తప్పుపట్టారు. విశాఖపట్నం జిల్లాలో రెండు లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని మధు చెప్పారు. -
దేశం కోసం బతకడమే ‘పవనిజం’
‘జనగళమున జనం స్టార్... పద కదమున పవర్‌స్టార్.... చెడు జరిగితే ఖబడ్దార్..’ ‘పవనిజం’ చిత్రం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాబా సెహగల్ పాడిన ఈ పరిచయగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర దర్శకుడు ఇ.కె.చైతన్య చెప్పారు. దేశం కోసం బతకడమే పవనిజం అని, యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుందని, జనవరికి చిత్రీకరణ పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్. -
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఓ యువకున్ని ఎత్తుకెళ్లి రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ ముఠాను శుక్రవారం డోన్ పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆ యువకునికి విముక్తి కల్పించి తండ్రికి అప్పగించారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని దొరపల్లెకు చెందిన ఎల్లప్ప కుమారుడు మధు హైదరాబాద్‌లో చిరువ్యాపారం చేసుకుంటూ గత నెల 20వతేదీన కిడ్నాప్‌కు గురయ్యాడు. అదే సమయంలో అతని వెంట ఉన్న మరో బాలుడు జంగాల నాగరాజు తప్పించుకున్నాడు. మధును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు రూ. 15లక్షలు ఇస్తే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో తండ్రి ఎల్లప్ప, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు డబ్బులు డిమాండ్ చేసేందుకు కిడ్నాపర్లు వాడిన సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసును చేధించారు. డోన్‌కు చెందిన జంగాల ఇప్పి నాగశెట్టి, జంగాల ఈర్లపల్లి చంద్రయ్య, దేవనకొండ మండలం పి.కోటకొండకు చెందిన బోయ పంపన్న, బోయ గడివేముల వెంకటేష్, బోయ కోలంట్ల రామాంజనేయులు, బోయ గిడ్డయ్య, కమ్మరికౌలుట్లయ్య దొరపల్లె క్రాస్‌రోడ్డు వద్ద 44వ నెంబర్జాతీయ రహదారిపై సఫారీ వాహనంలో సంచరిస్తుండగా అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న సీఐ డేగలప్రభాకర్, ఎస్ఐలు మోహన్‌రెడ్డి, సతీష్, సిబ్బందిని అభినందించారు. -
లగడపాటి మీడియా సమావేశంలో అసలేం జరిగింది?
-
ఏక పాత్రతో ‘నయన’
‘‘ఏక పాత్రతో మధు చేసిన ఈ వినూత్న ప్రయోగం ఫలించాలని కోరుకుంటున్నాను. మధుకి పరిశ్రమ పట్ల మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనతో మంచి సినిమా తీసి ఉంటారని నమ్ముతున్నాను’’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. నటాషా టైటిల్ రోల్లో చండ్ర మూవీస్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో చండ్ర మధు నిర్మించిన చిత్రం ‘నయన’. కార్తీక్ రోడ్రిజ్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ఆవిష్కరించి, కొమర వెంకటేష్‌కి ఇచ్చారు. ‘‘కథ మీద పట్టు లేకపోతే ఇలాంటి సినిమా చేయలేరు. పాటలు బాగున్నాయి’’ అని ట్రైలర్స్‌ను ఆవిష్కరించిన అనంతరం అచ్చిరెడ్డి చెప్పారు. మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న చిత్రం ఇదని కార్తీక్ అన్నారు. చండ్ర మధు మాట్లాడుతూ -‘‘తొలి ప్రయత్నంగా ఓ అవార్డ్ మూవీ చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేశాను. రిథమ్ స్టూడియోవారు అందించిన సహకారం మరువలేనిది. కార్తీక్ మంచి పాటలతో పాటు చక్కని నేపథ్య సంగీతం కూడా ఇచ్చారు. ఈ నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.