యాక్షన్‌ థ్రిల్లర్‌ | Dear Cinema First Look, Motion Poster Release | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ థ్రిల్లర్‌

Jun 28 2017 12:06 AM | Updated on Sep 5 2017 2:36 PM

యాక్షన్‌ థ్రిల్లర్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

నవీన్, జీవా, మధు, సుమన్‌ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డేర్‌’.

నవీన్, జీవా, మధు, సుమన్‌ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డేర్‌’. ప్రవీణ్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్‌ దర్శకత్వంలో ఎన్‌. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్‌. సీనియర్‌ నటులతో పాటు కొత్తవారూ నటించారు.

త్వరలో ఆడియో, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్‌ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్‌ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్‌. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్‌. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్‌ నరేన్, సమర్పణ: ఎన్‌. కరుణాకర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement