తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో (వీడియో) | RB Choudary Death: Jeeva Breaks Down In Tears, Video Viral | Sakshi
Sakshi News home page

తండ్రి మరణం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో జీవా (వీడియో)

May 6 2026 9:34 AM | Updated on May 6 2026 10:38 AM

RB Choudary Death: Jeeva Breaks Down In Tears, Video Viral

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సినీ నిర్మాత, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌బీ చౌదరి మృతి చెందిన విషయం తెలిసిందే. తన పూర్వీకుల ఊరు అయినటువంటి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళుతుండగా మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. తండ్రి మరణవార్త విని ఆయన కుమారుడు, హీరో జీవా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 

రోడ్డు ప్రమాదం గురించి తన బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతూ బోరున విలపించాడు. పరామర్శకు వచ్చిన వారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్‌బీ చౌదరికి నలుగురు కొడుకులు. జీవా అందరి కంటే చిన్నవాడు.పెద్ద కొడుకు జీవన్‌ తన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. రెండో కొడుకు రమేశ్‌ నటుడుగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.మూడో కొడుకు సురేశ్‌ కూడా నిర్మాణ రంగంలోనే ఉన్నాడు. జీవా ఒక్కడే పూర్తిస్థాయి నటుడిగా రాణిస్తున్నాడు. నాన్న అంటే అతనికి చాలా ఇష్టం. పలు సందర్భాల్లో నాన్నే తన రోల్‌ మోడల్‌ అని చెప్పాడు. కాగా, ఆర్‌బీ చౌదరి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరుగుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement