టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ ఎడిటర్‌ కన్నుమూత | Tollywood Editor Madhu Reddy Passed Away | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ ఎడిటర్‌ కన్నుమూత

Apr 19 2026 6:16 PM | Updated on Apr 19 2026 6:24 PM

Tollywood Editor Madhu Reddy Passed Away

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ప్రముఖ సినీ ఎడిటర్‌ మధు రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో ఏప్రిల్ 18న గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సహచరులు, స్నేహితులు, ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఎడిటర్‌గా మధు రెడ్డికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమాలోని ఎమోషన్, రిథమ్, నరేటివ్ ను అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. 'దళం', 'దక్ష', 'అహ నా పెళ్ళంట', 'జగమేమాయ', 'వాలెంటైన్స్ నైట్' వంటి చిత్రాలతో పాటు, త్వరలో విడుదల కానున్న 'అగ్ని నక్షత్రం' లాంటి సినిమాలు ఆయన పనితీరును, కథను పర్‌ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసే విధానాన్ని తెలియజేస్తాయి.

కేవలం ఫీచర్ ఫిలిమ్స్‌కు మాత్రమే కాదు.. ఆయన వందలాది చిత్రాలకు ట్రైలర్ ఎడిటర్‌గా కూడా పనిచేశారు. 'జగడం', 'జల్సా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ట్రైలర్స్ కట్ చేసింది ఆయనే. ఆ ట్రైలర్స్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచడంలో ఆయన ఎడిటింగ్ మార్క్ ఎంతో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement