మెదక్ జిల్లా (నర్సాపూర్): చదువుకు దూరం అవుతూ వచ్చిన మధు ‘సాక్షి’చొరవతో బడిబాట పట్టాడు. సంగాయిపేట గ్రామానికి చెందిన మధు మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే తండ్రి బెదిరింపులతో మేకల కాపరిగా మారిన డాకె మధుపై ఆదివారం ‘సాక్షి’మెయిన్‌లో ‘బడికి వెళ్తానంటే.. మేకల కాడికి పంపిస్తుండ్రు‘అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది.
దీనికి స్పందించిన జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు మధు ఇంటికి వెళ్లి అతని తండ్రి సాయిలుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయులు మధును స్కూటర్‌పై ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొచ్చారు. పాఠశాల ఆవరణలో అడుగుపెట్టిన ఆ క్షణం మధు కళ్లలో సంతోషం కనిపించింది.
బడికి వెళ్తానంటే... మేకల కాడికి పంపిస్తుండ్రు


