ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి | CPM, CPI leaders Madhu, Ramakrishna comments on Nandyal by election | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి

Aug 12 2017 1:40 AM | Updated on Aug 13 2018 8:12 PM

ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి - Sakshi

ఉప ఎన్నికల్లో టీడీపీని ఓడించండి

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు.

సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ 
 
అనంతపురం న్యూసిటీ: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను టీడీపీ మోసగిస్తోందన్నారు. హద్దూపద్దు లేని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలను అన్ని రంగాల్లో అసంతృప్తి పరిచిందని ధ్వజమెత్తారు.

ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేయడమే కాక, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన వాగ్దా నాలను అమలు చేయలేదన్నారు. అవినీతి, లంచగొండితనం, పార్టీ ఫిరాయింపులు పెరిగిపోయాయన్నారు. అధికార టీడీపీ, బీజేపీ కూటమిని నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి ప్రభుత్వ పాలనపట్ల నిరసన తెలియజేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement