
చంద్రబాబుది నాలుకో.. తాటిమట్టో..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నగుబాటుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ నగుబాటుగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గోద్రా మరణకాండకు కారణమైన మోదీని హైదరాబాద్ రానివ్వబోమని.. అప్పట్లో నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతో జతకట్టారని విమర్శించారు. సమయానుకూలంగా సిద్ధాంతాలను మార్చుకోవడం చంద్రబాబుకు అలవాటే అని, అసలు ఆయనది నాలుకో.. తాటిమట్టో అర్థం కావడం లేదని విమర్శించారు. 2019లో ప్రజలు కచ్చితంగా టీడీపీకి గుణపాఠం చెబుతారని మధు అన్నారు.