'ఆకాశంలోంచి కాదు.. కింద నుంచి చూస్తే బాగుండేది' | cpi leader madhu takes on ap government | Sakshi
Sakshi News home page

'ఆకాశంలోంచి కాదు.. కింద నుంచి చూస్తే బాగుండేది'

Dec 12 2014 7:58 PM | Updated on Aug 18 2018 8:05 PM

సింగపూర్ బృందం ఆకాశం నుంచి గాక నేలపై ఏపీ రాజధాని నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించి ఉంటే బాగుండేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

గుంటూరు:  సింగపూర్ బృందం ఆకాశం నుంచి గాక నేలపై ఏపీ రాజధాని నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించి ఉంటే బాగుండేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం జరిగిన ర్యాలీలో మధు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఏపీ రాజధాని నిర్మించనున్నప్రాంతంలో సింగపూర్ బృందం ఇటీవల ఏరియల్ సర్వే చేసింది. మధు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. సింగపూర్ బృందం ప్రజెంటేషన్ చూస్తే బాగుండేదని అన్నారు. గతంలో తీసుకున్న భూములకే ఇంతవరకు ఏ ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ప్రభుత్వం రుణుమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement