టీఆర్‌ఎస్‌ నుంచి నాకు ప్రాణహాని ఉంది

Habeas corpus filed for CPI-ML (ND) leader Madhu - Sakshi

హైకోర్టులో నాగం జనార్దన్‌రెడ్డి పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. 

నా భర్తకు ప్రాణహాని
హైకోర్టును ఆశ్రయించిన న్యూడెమోక్రసీ నేత మధు భార్య పద్మ
సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న తన భర్త సీపీఐ–ఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) ప్రాంతీయ కార్యదర్శి ఎ.నారాయణస్వామి అలియాస్‌ మధుకు ప్రాణహాని ఉందని, వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన భార్య పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.  ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం  విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top