కస్టడీ

Madhu Murder Case Investigation Speedup - Sakshi

సీఐడీ విచారణకు నిందితుడు సుదర్శన్‌  

రాయచూరులో విద్యార్థిని మధు అనుమానాస్పద మృతికేసులో పురోగతి  

నిర్లక్ష్యం ఆరోపణలపై మహిళా ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్‌ సస్పెండ్‌

ఈ నెల 13వ తేదీన రాయచూ రు నగరం లో అదృశ్యమై 16వ తేదీన అక్క డి మాణిక్‌ప్రభు ఆల యం వెనుక గుట్టల్లో శవమై తేలిన సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ అనుమానాస్పద మృతి కేసులో సీఐడీ విచారణలో పురోగతి నమోదైంది. నిందితున్ని  4 రోజుల కస్టడీకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు మధు హంతకులను శిక్షించాలని రాయచూరుతో పాటు పలు చోట్ల ప్రజాసంఘాల ధర్నాలు ముమ్మరమయ్యాయి.  

రాయచూరు రూరల్‌: విద్యార్థిని మధు పత్తార్‌ (23) కేసులో ప్రధాన నిందితునిగా అనుమానిస్తున్న సుదర్శన్‌ యాదవ్‌ (29)ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాయచూరు జిల్లా ప్రధాన కోర్టులో హాజరుపరచిన సీఐడీ ఎస్పీ శరణప్ప నిందితుణ్ని విచారించడానికి 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కోర్టు 4 రోజులకు మాత్రమే అనుమతించింది. సాయంత్రం నిందితున్ని జిల్లా జైలు నుంచి సీఐడీ అధికారులు విచారణకు తీసుకొని వెళ్లారు. 

ఇల్లు, కాలేజీలో సీఐడీ పరిశీలనలు  
మధు మృతిపై విచారణకు రాయచూరు వచ్చిన సీఐడీ అధికారుల బృందం బుధవారం మధు నివాసాన్ని పరిశీలించారు. సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవిశంకర్, సీఐ దిలీప్‌ కుమార్‌ తదితర నలుగురు అధికారులు మధు తల్లిదండ్రులను కలిసి వారి వద్ద నుంచి సమాచారం సేకరించారు. తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని,ఆమె ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని వారు అధికారులకు తెలిపారు. మధు పుస్తకాలను తనిఖీ చేశారు. అలాగే మధు చదివిన నవోదయ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధ్యాపకులను, ప్రిన్సిపాల్‌ను సీఐడీ అధికారులు కలిసి వివరాలను సేకరించారు. మధు హత్య కేసు దర్యాప్తులో ఆమె రాసిన డెత్‌నోట్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.  

పోలీస్‌ కానిస్టేబుల్‌ సస్పెండ్‌?  
సుదర్శన్‌ యాదవ్‌ బావ (అక్కభర్త) ఆంజనేయులుసదర్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌. ఇతడు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మధు తల్లిదండ్రులు రేణుక, నాగరాజులు మూడురోజుల క్రితం బళ్లారి ఐజీపీ నం జుండ స్వామిని కలిసి  మధు మృతి కేసు లో ఆంజనేయులు ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు. మధు స్కూటీ తాళాలు, మొబైల్‌ ఫోన్‌ ఆంజనేయులు చేతిలో ఉ న్నాయని, అవి అతనికి ఎలా వచ్చాయో విచారించాలని కోరారు. దీంతో ఉన్నతాధికారులు ఆంజనేయులను సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్పీ కిశోర్‌బాబు, సీఐ రాజాసాబ్‌లను సంప్రదించగా స్పందన రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోలేదనేఆరోపణపై మహిళా పీఎస్‌ ఎస్‌ఐ బేబి మరియమ్మను కూడా సస్పెండ్‌ చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం నుంచి ఆందోళనల్ని ఉధృతం చేయనున్నట్లు పలు విద్యార్థి, ప్రజాసంఘాలు తెలిపాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top