హంతకులను వదిలిపెట్టొద్దు | Madhu Parents Demands Justice For Madhu | Sakshi
Sakshi News home page

హంతకులను వదిలిపెట్టొద్దు

Apr 22 2019 9:33 AM | Updated on Apr 22 2019 9:33 AM

Madhu Parents Demands Justice For Madhu - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో కూర్చున్న నిందితుడు సుదర్శన్‌

రాయచూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ అనుమానాస్పద మృ తి కేసు విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు బ ళ్లారి ఐజీపీ రాయ చూరుకు వచ్చి సమీక్షించారు. తమ కంటివెలుగును కబళించిన హం తకులను పట్టుకుని శిక్షించా లని కన్నవారు డిమాండ్‌ చేశారు.

రాయచూరు రూ రల్‌:  తమ కూతురు విషయంలో న్యాయం చేయాలని సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ తల్లిదండ్రులు రేణుక, నాగరాజ కోరారు. ఆదివారం రాయచూరుకు వచ్చిన బళ్లారి ఐజిపి నంజుండస్వామికి వారు వినతి పత్రం సమర్పించి మాట్లాడారు. తన కూతురుని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన హంతకులకు కఠిన శిక్ష విధించాలన్నారు. కూతురిని బలిగొన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదని కోరారు. కాగా, నేతాజీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడు సుదర్శన్‌ను ఆరుబయట కూర్చో బెట్టి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని, అతనికి రక్షణ
కల్పించడంలో పోలీసుల ఆసక్తి ఏమిటో అర్థం కావడం లేదని వాపోయారు. 

ప్రత్యేక దర్యాప్తు బృందం: ఐజీపీ  
ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ అనుమానాస్పద రీతిలో మృతిచెందింది, కేసు విచారణకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పా టు చేశాం అని  బళ్లారి ఐజీపీ నంజుండప్పస్వామి తెలిపారు. ఆయన జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.  మధును హత్య చేసిన హంతకుల ను పట్టుకుంటామని తెలిపారు. విచారణ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులకు శిక్షలు విదించేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఊహగానాలకు అవకాశం కల్పించరాదని అన్నారు. పోస్టుమార్టం, ఇతర నివేదికలు రావాల్సి ఉందన్నారు. 

కేసు విచారణ సిఐడికి అప్పగింత    
రాయచూరు నగరంలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని మధు పత్తార్‌ (23) అనుమానస్పద మృతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. నవోదయ ఇంజనీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్న మధు ఈ నెల 13న అదృశ్యం కావడం, 16న గుట్టల్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం కనిపించడం తెలిసిందే. ప్రేమించలేదని అక్కసుతో ఒక యువకుడు ఆమెను అంతమొందించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పోలీసుల అసమర్థతపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. సర్కారు ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి అప్పగించింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి హంతకులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని హోంశాఖ  ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement