ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ప్రభుత్వంపైనే అనుమానాలు బలపడుతున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
సీఎంకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ప్రభుత్వంపైనే అనుమానాలు బలపడుతున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. దీనిపై శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ప్రభుత్వంలోని పెద్దలు సక్రమంగా ఉంటే అధికారులు ఎలా స్మగ్లర్లకు సహకరిస్తారని లేఖలో పేర్కొన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పలుమార్లు ప్రకటించిన తరువాత కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా స్మగ్లింగ్ కొనసాగుతోందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.