కూర రాజన్నే సూత్రధారి | Sakshi
Sakshi News home page

కూర రాజన్నే సూత్రధారి

Published Sat, Dec 30 2017 12:04 PM

kura rajanna key roll in Weapons Supply - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన చండ్రపుల్లారెడ్డి (సీపీ)బాట అజ్ఞాత దళం ఏర్పాటులో జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న కీలకమని మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు గుర్తించారు. ఈ దళానికి 27 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు పలువురిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌ జిల్లాలకు చెందిన 11 మంది 2016, సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌కు వెళ్లి కూర రాజన్నను కలిశారని, ఆ సమయంలో ఆయా జిల్లాల పరిధిలో సీపీబాట పేరుతో దళాన్ని ఏర్పాటు చేయాలని, ఆయుధాలు సరఫరా చేస్తానని రాజన్న చెప్పినట్లు విచారణలో మధు వెల్లడించాడు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 18న 27 తుపాకులు, మందుగుండు సామగ్రిని పంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసినందుకు కూర రాజన్నతోపాటు మరికొంత మందిపై గూడూరు పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement