బెంగళూరులో గ్యాంగ్ వార్ | bhanukiran follower madhu gets tortured by manjunath gang | Sakshi
Sakshi News home page

బెంగళూరులో గ్యాంగ్ వార్

Oct 20 2016 1:06 PM | Updated on Oct 9 2018 4:20 PM

బెంగళూరులో గ్యాంగ్ వార్ - Sakshi

బెంగళూరులో గ్యాంగ్ వార్

గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది.

బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటక రాజధాని బెంగళూరులో గ్యాంగ్ వార్ నడుస్తోంది. ఓ ఆస్తి వివాదంలో భానుకిరణ్ అనుచరుడు ఎర్నంపల్లి మధు జోక్యం చేసుకున్నాడు. దీంతో బెంగళూరుకు చెందిన మంజునాథ్ గ్యాంగ్ ఆగ్రహించి మధును కిడ్నాప్ చేసి చితకబాదింది. ఇక ముందు తాను ఎలాంటి సెటిల్ మెంట్లకు పాల్పడబోనని ఎంతగానో వేడుకోవడంతో మంజునాథ్ గ్యాంగ్ మధును విడిచిపెట్టింది.

గతంలో మధును బెదిరించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియోను మంజునాథ్ గ్యాంగ్ విడుదల చేసింది. భానుకిరణ్ పేరుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మధు సెటిల్ భారీ మొత్తాలలో సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు. మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డి (సూరి) హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకిరణ్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలే సూరి హత్యకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement