న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు | ACB searches in The judge house | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తి ఇంట్లో ఏసీబీ సోదాలు

Apr 6 2018 8:44 AM | Updated on Aug 17 2018 12:56 PM

ACB searches  in The judge house - Sakshi

న్యాయమూర్తి ఇంటి వద్ద ఏసీబీ అధికారులు

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ మధు ఇంటిపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్‌ అడిషనల్‌ ఎస్పీ రమణకుమార్‌, కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌, మెదక్‌ ఏసీబీ డీఎస్పీ ప్రతాప్‌, మరో ఎనిమిది సీఐలతో పాటు మరి కొంతమంది పాల్గొన్నారు.

న్యాయమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇటీవల తీవ్ర ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. న్యాయమూర్తి పలు కేసులను కావాలని పక్కదోవ పట్టించి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, ఏకంగా జగిత్యాలలోని న్యాయవాదులు అంతా కూడా ఇటీవలే ధర్నా కూడా చేశారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement