చంద్రబాబును నిలదీయండి
అనంతపురం అగ్రికల్చర్ :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతపురం అగ్రికల్చర్ :
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నేతలు డి.హీరేహాళ్ మండలం నుంచి చేపట్టిన పాదయాత్ర మంగళవారం అనంతపురం చేరుకుంది. ముగింపు సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీపై పూటకో మాట మాట్లాడుతూ తీవ్రజాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిధుల సేకరణకు ఎర్రచందనం దుంగలను, ఇసుక క్వారీలను అమ్ముకోవాలని చూస్తున్న చంద్రబాబుకు దిమాక్ కరాబ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఆగడాలను సాగనివ్వబోమని హెచ్చరించారు. రక్షిత మంచి నీటిని ప్రజలకు ఉచితంగా చంద్రబాబును నిలదీయండి
అందించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అయితే ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2కే 20 లీటర్ల నీరు ఇస్తామని వ్యాపారం చేయడం తగదన్నారు. రేపు రూ.8, తర్వాత రూ.20 అని నీటికి ధర నిర్ణయించడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ఏర్పాటు చేయబోయే వాటర్ ప్లాంట్లను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రుణ మాఫీ, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల వయో పరిమితి పెంపు వంటి హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడినట్లేనని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఖుద్రేముఖ్ ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా డి.హీరేహాళ్ మండలం నేమకల్లులో పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చౌకడిపో డీలర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలను అక్రమంగా తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచివి కావన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, నీళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజల జీవితాలనే మారుస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా పూర్తి చేసేందుకు రూ. 10వేల కోట్లు కేటాయించాలని కోరారు. హంద్రీనీవాను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, 100 టీఎంసీలను జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రాంభూపాల్, కార్యవర్గ సభ్యులు నల్లప్ప, కొండారెడ్డి, ఇంతియాజ్, రైతు సంఘం నాయకులు పెద్దిరెడ్డి, హరి, కృష్ణమూర్తి, అంజి, చంద్రమోహన్, నరేష్, తిరుపాల్, వెంకటనారాయణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.