‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’ | CPM Leader Madhu Comments On BJP Leader Somu Veerraju | Sakshi
Sakshi News home page

బీజేపీ.. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతుంది

Nov 19 2020 4:36 PM | Updated on Nov 19 2020 4:43 PM

CPM Leader Madhu Comments On BJP Leader Somu Veerraju - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా కేసులు, రాష్ట్రంలోని పరిస్థితులు పరిగణనలోకి తీసుకునే ఎన్నికలకు ఈసీ ముందుకెళ్లాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ సమన్వయంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాలన్నారు. సెకండ్ వేవ్ వస్తుందని కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రమాద పరిస్థితులు కనబడుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై నిర్లక్ష్యం పనికిరాదన్నారు. (చదవండి: ఆంధ్రజ్యోతి ఆనాడు ఎందుకు రాయలేదు..?)

‘‘బీజేపీతో కలిశాక పవన్‌కల్యాణ్‌కు తొలిచిన ఆలోచననే జమిలి ఎన్నికల మాట. జమిలి ఎన్నికలు వస్తే జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలకే ప్రమాదం. అధికారంలో ఉన్న బీజేపీ.. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతుంది. సోము వీర్రాజు  తల, తోక లేని రాజకీయాలను రాష్ట్రంలో నడుపుతున్నారు. మతోన్మాదం మీద ఆధారపడ్డ పార్టీ బీజేపీ.  దేశం మొత్తాన్ని కార్పొరేట్‌లకు బీజేపీ  తాకట్టు పెడుతుంది. వామపక్షాలు నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడాయి. నేడు రైతుల కోసం ఉద్యమిస్తున్నాయి. బీజేపీ రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినప్పుడు సోము వీర్రాజు ఎక్కడున్నారు..?. కార్మిక చట్టాలు కాల రాసినప్పుడు నోరు మెదపలేదే’’ అని మధు ప్రశ్నించారు. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement