ఆంధ్రజ్యోతి ఆనాడు ఎందుకు రాయలేదు..? | AP BJP President Somu Veerraju Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో నీరు-చెట్టు’ పేరుతో దోచేశారు..

Nov 19 2020 2:16 PM | Updated on Nov 19 2020 2:19 PM

AP BJP President Somu Veerraju Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో నీరు-చెట్టు పథకం పేరుతో దోచేశారని.. అప్పుడు ఆంధ్రజ్యోతి ఎందుకు రాయలేదని, ఇప్పుడు కథనాలు ఎందుకు రాస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేరు మార్చి చంద్రన్న బాట అని పెట్టారు. ఏ మోదీ అన్న బాట అని పెట్టవచ్చుగా. ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులన్నీ దోచుకున్నారు. చంద్రబాబు 3,500  కోట్ల ప్యాకేజీ కి ప్రత్యేక హోదానే మరిచిపోయారు. చంద్రబాబు 100 గొంతుకలతో మాట్లాడారంటూ’’ ఆయన దుయ్యబట్టారు. (చదవండి: పూటకో మాట వల్లే టీడీపీకి 23 సీట్లు)

Advertisement
 
Advertisement
Advertisement