టెట్‌ మినహాయింపు కోసం వెళ్తే.. ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తారా!? | MLC Chandrasekhar Reddy Fire on Chandrababu Govt over Teachers Issue | Sakshi
Sakshi News home page

టెట్‌ మినహాయింపు కోసం వెళ్తే.. ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తారా!?

Aug 15 2026 5:13 AM | Updated on Aug 15 2026 5:13 AM

MLC Chandrasekhar Reddy Fire on Chandrababu Govt over Teachers Issue

టీచర్ల సమస్యలపై కేంద్ర మంత్రిని కలవడం నేరమా? 

ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ చరిత్రలో మనుగడ సాగించలేదు

సస్పెన్షన్‌ వెనక్కు తీసుకోకపోతే ఉపాధ్యాయ సంఘాలతో ఆందోళన 

డీఎస్సీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కొత్త నాటకాలు 

కొడుకు లోకేశ్‌ను కాపాడుకునేందుకే 163 మంది గ్రూప్‌–1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటం

వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ ఎమ్మెల్సీలు ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్‌

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడతామని మాయమాటలు చెప్పి, వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, నారా లోకేశ్‌.. ఇప్పుడు వారి కష్టాలను పట్టించుకోకపోవడమే కాక వారిని సస్పెన్షన్‌ పేరుతో వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ ఎమ్మెల్సీలు ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయుల తడాఖా ఏమిటో ఇక ముందు తండ్రీకొడుకులు చూస్తారని వారు హెచ్చరించారు. 

వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టెట్‌ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని, ఇన్‌ సర్వీస్‌ టీచర్లను టెట్‌ పరీక్ష భారం నుంచి తప్పించాలని సీకే వెంకటనాథరెడ్డి (ఏపీవైఎస్‌ఆర్‌టీఏ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌), ఎస్‌. అమరనాథ్‌ (ఏపీవైఎస్‌ఆర్‌టీఏ కడప జిల్లా అధ్యక్షుడు), ఎన్‌. సంగమేశ్వర్‌ (ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో కడప జిల్లా అధ్యక్షుడు) కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషిని కలిసి విజ్ఞప్తి చేయడం తప్పా చంద్రబాబూ? అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు ఏమన్నారంటే..

ఉపాధ్యాయుల కోసం మాట్లాడినా తప్పేనా!?..
లక్షలాది మంది ఉపాధ్యాయుల ప్రయోజనం కోసం ఆ ముగ్గురు ఉపాధ్యాయులు సొంత ఖర్చులు పెట్టుకుని ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రిని కలవటం నేరమా? ఏం తప్పుచేశారని వారిని సస్పెండ్‌ చేశారు? దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టెట్‌ గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తప్పా? పైగా.. సస్పెన్షన్‌ ఆర్డర్‌లో డీఎస్సీ గురించి అని తప్పుడు సమాచారంతో వీరిని సస్పెండ్‌ చేశారు. అస్సలు వీరు డీఎస్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు.

 ఎవరికీ ఎలాంటి రిప్రెజెంటేషన్‌ కూడా ఇవ్వలేదు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల కోసం మాట్లాడినా  తప్పే అనడం విచిత్రంగా ఉంది. వెంటనే వీరి సస్పెన్షన్ను ఎత్తేయాలి. లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తాం. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు చరిత్రలో మనుగడ సాగించలేదన్న విషయం సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాలి. 

డీఎస్సీ స్కాంను పక్కదారి పట్టించేందుకే..
డీఎస్సీ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఈ స్కాంలో లోకేశ్‌ అడ్డంగా దొరికిపోయారు. దీంతో తన కొడుకును కాపాడుకునేందుకే 163 మంది గ్రూప్‌–1 అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. వీరిద్దరికీ ఎలా అడ్డుకట్ట వేయాలో మాకు తెలుసు. శాసనసభ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ డీఎస్సీ స్కాంపై నిలదీస్తుందనే భయంతో చంద్రబాబు ఇలా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement