మీ భూ దోపిడీని అడ్డుకున్నానని.. నాపై తప్పుడు రాతలా? | Kakani Govardhan Reddy Fires on Yellow Media | Sakshi
Sakshi News home page

మీ భూ దోపిడీని అడ్డుకున్నానని.. నాపై తప్పుడు రాతలా?

Aug 15 2026 5:05 AM | Updated on Aug 15 2026 5:05 AM

Kakani Govardhan Reddy Fires on Yellow Media

రామదాసుకండ్రిగ భూ వ్యవహారంపై సోమిరెడ్డి అండ్‌ కో దుష్ప్రచారంపై కాకాణి నిప్పులు

పచ్చపత్రిక ఈనాడులో వండివార్చిన కథనంపై విమర్శలు

దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్‌

నెల్లూరు (వేదాయపాళెం): రామదాసుకండ్రిగ భూ దోపిడీకి 2016లో సోమిరెడ్డి అండ్‌ కో చేసిన య­త్నాన్ని తాను అడ్డుకున్నానన్న కడుపుమంటతో.. ఇప్పుడు అదే భూములకు సంబంధించి తనపై పచ్చ­పత్రిక ఈనాడు­లో తప్పుడు రాతలు రాయిస్తున్నా­రని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తప్పుడు రాతలకు దమ్ముంటే ఆధారాలు చూపా­లని ఆయన సవాలు విసి­రారు. పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో శుక్ర­వారం కాకాణి మీడి­యాతో మాట్లాడుతూ, ‘సదరు భూముల వ్యవహా­రంపై సీబీఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. అధికార పార్టీ నేతలకు ఈ దమ్ములేదు. సీబీఐ విచారణ జరిపితే తాము చేసిన తప్పులు బయటకు వస్తాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర­మోహన్‌రెడ్డి అండ్‌ కో భయపడడమే దీనికి కారణం. 

సీబీఐ విచారణ జరపా­లని నేను స్వయంగా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను సైతం కొట్టివేయా­లని అధి­కారుల చేత కౌంటర్‌ వేయించడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. రామదా­సు­కండ్రిగ వద్ద వంద ఎకరాల భూ దోపిడీకి 2016లో సోమిరెడ్డి ప్రయత్నించారు. ఎకరా రూ.15 లక్షల భూమికి గాను రూ.6 లక్షలు రైతుల చేతిలో పెట్టి మిగిలిన రూ.9 లక్షల మొత్తాన్ని మింగేయ­డా­నికి కుట్ర పన్నారు. అలాంటి సందర్భంలో నా వద్దకు వచ్చిన­ప్పుడు వారికి అండగా నిలిచి న్యాయ పోరాటం చేశాను. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించిన ధర ప్రకారం రూ.15 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకున్నాను. 

సోమి­రెడ్డి అండ్‌ కో.. తమ మాట వినలేదని పేర్లు తొలగించిన రైతులకు సైతం పరిహారం అందించాం. మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రైత­యి­నా తాను మోసపోయానని స్టేట్‌మెంట్‌ ఇస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 100 ఎక­రాల భూమిలో 50 ఎకరాలను మాత్రమే పరిశ్రమ కోసం ఇవ్వగలిగాం. మిగిలిన 50 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్క్‌ ఏర్పాటు చేసి పరిశ్రమలు తీసుకురావాలి. మీరు చెబుతున్నట్లుగా ఎకరాకు రూ.కోటి చొప్పున రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి.

 కనుపూరు గ్రామంలోని దేవదాయశాఖ భూములను ఆక్రమించి వైఎస్సార్‌సీపీ నాయ­కులు ఇళ్లు కట్టుకున్నారంటూ వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవం. నవర­త్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించాం. దేవదాయశాఖకు  పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభు­త్వంపై ఉంది’ అని స్పష్టం చేశారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూ దోపిడీ వివ­రా­లను త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని కాకాణి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement