దేశం కోసం బతకడమే ‘పవనిజం’
‘జనగళమున జనం స్టార్... పద కదమున పవర్‌స్టార్.... చెడు జరిగితే ఖబడ్దార్..’ ‘పవనిజం’ చిత్రం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే
‘జనగళమున జనం స్టార్... పద కదమున పవర్‌స్టార్.... చెడు జరిగితే ఖబడ్దార్..’ ‘పవనిజం’ చిత్రం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. పవన్‌కల్యాణ్ అభిమానులు తలచుకుంటే సమాజంలో మార్పు తీసుకురాగలరని తెలిపే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాబా సెహగల్ పాడిన ఈ పరిచయగీతం హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర దర్శకుడు ఇ.కె.చైతన్య చెప్పారు. దేశం కోసం బతకడమే పవనిజం అని, యువతలో చైతన్యం నింపేలా ఈ సినిమా ఉంటుందని, జనవరికి చిత్రీకరణ పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మధు, సుధీర్, సింధు, జయంతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: కనిష్క, కెమెరా: సతీశ్ ముత్యాల, నిర్మాత: శ్యామ్ శ్రీన్.