పవన్‌కల్యాణ్‌పై సీపీఎం మధు సీరియస్

సాక్షి, విశాఖపట్నం: పవన్‌కల్యాణ్‌కు ఒక సిద్ధాంతమంటూ లేదని సీపీఎం నేత మధు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన హామీల గురించి మాట్లాడకుండా.. పవన్ పొత్తులపై మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
చదవండి: పవన్‌కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి
గతంలో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు.. ఇప్పుడు బీజేపీ, టీడీపీతో పొత్తు అంటున్నాడు.. వామపక్షాలతో పొత్తు అని మాకు తెలియకుండానే పవన్ కల్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడంటూ నిప్పులు చెరిగారు. పవన్ తీరు చూస్తూంటే జనసేనకు ఒక సిద్ధాంతం అంటూ లేదని సీపీఎం మధు వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు