breaking news
case
-
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్నగర్లోలో రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో రిటైర్డ్ అధికారి నివాసం ఉంటున్నారు. బుల్లెట్స్ ఇచ్చే అమ్నేషన్ సెక్షన్ ఇంచార్జి సహకారంతో చోరీ చేశారు. ఈ కేసుల కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.‘‘గత నెల ఆగస్టు 30న తెల్లవారుజామున మద్రాస్ రెజిమెంట్ ఆయుధ గారంలో జరిగిన చోరీ కేసును చేధించాం. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధగారంలో కొన్ని ఆయుధాలు ఆ రోజు దొంగిలించబడ్డాయి. 30వ తేదీ ఉదయం ఆర్మీ ఉద్యోగి వినోద్ కుమార్ తాళాలు పగలగొట్టి ఉన్న విషయం గుర్తించి ఆర్మీ అధికారులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత బ్రిగేడియర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏడు పిస్టళ్లతో పాటు నాలుగు ఏకే 203, ఒక ఇన్సాస్ నైట్ విజన్ బైనాక్యులర్ చోరీకి గురయ్యాయి. రెండో బిల్డింగ్ నుంచి మందగుండు ఉన్న బాక్సులు మిస్ అయ్యాయి...ఉమ్మడిగా మల్కాజిగిరి పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. మొదటి దశలో ఇన్సైడర్ వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు చోరీ చేసే అవకాశం లేదు అని నిర్ధారణకు వచ్చాము. సులువుగా కేసు క్లోజ్ అవుతుందనుకున్నాం.. కానీ కాలేదు. అనుమానితులను ప్రశ్నిస్తే ఎలాంటి లీడ్ దొరకలేదు. అనుమానితులను ప్రశ్నిస్తే ఎలాంటి లీడ్ దొరకలేదు. ఆయుధ గారానికి ఎవరెవరికి అనుమతి ఉంది. వారిని లిస్ట్ ఔట్ చేశాము. ముందుగా పది మందినీ గుర్తించాము. ఆయుధగారం వద్దకు ఆరుగురు సభ్యుల మూవ్మెంట్ కంటిన్యుగా ఉంటుంది. వారిని షార్ట్ లిస్ట్ చేసి విచారించారు...ఏడుగురు ఎలక్ట్రిషియన్, ప్లంబర్.. పనిష్మెంట్ పై వెళ్లిన 36 మందిని కూడా గుర్తించాం. లీవ్‌లో వెళ్లిన 54 మందిని గుర్తించి విచారించాము. సర్వీస్‌లో ఇండిసిప్లిన్ కారణంగా విధులకు దూరంగా ఉన్న ఏడుగురును కూడా విచారించాము. కోపంతో ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో అని దర్యాప్తు చేశాము. వారం రోజులు భిన్న కోణాల్లో క్రాస్ వెరిఫికేషన్ చేశాము. డ్రగ్ మాఫియా కనెక్షన్ యాగిల్లో దర్యాప్తు చేశాము.. స్పై నెట్వర్క్ కోణంలో కూడా విచారణ చేశాము. బృందాలుగా ఏర్పడి సీసీటీవీ డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్. మొబైల్ సిగ్నల్స్ ఈ కేసు దర్యాప్తు చేశారు. ముందుగా ఇద్దర్ని మెయిన్ సస్పెక్ట్‌గా భావించాం.. ఆయుధగారంలో ఇంఛార్జ్ వినోద్ కుమార్ శ్రీరామ్ ప్రసాద్ అనుమానితులుగా భావించి విచారించాం...ఇద్దర్ని విచారించిన కూడా ఎటువంటి క్లూ దొరకలేదు.. ఇదే క్రమంలో ఏడుగురు పెన్షన్ అవుట్ పర్సన్స్‌లో ఇద్దర్ని విచారించాం. ప్రకాశం జిల్లాను చెందిన ఓ హవల్దార్తో పాటు, మల్లేష్ అనే మరో హవల్దార్ విచారించారు. జూన్ ముప్పై తేదీన మల్లేష్‌ను హెల్త్, ఇన్ డిసిప్లిమరీ కారణంగా తీసేసారు. మల్లేష్ కంటోన్మెంట్ పక్కనే ఉన్న బాలాజీ నగర్లో ఉంటాడు అతనిపై అనుమానం రావడంతో అన్ని కోణంలో చెక్ చేశాము. ఏడో తేదీ మల్లేష్‌ను నాగర్ కర్నూల్లో ప్రశ్నించాము. ఆ సమయంలో సరిగా స్పందించలేదు. దీంతో అనుమానం పెరిగింది. అతని మొబైల్‌ను తీసుకుని అతన్ని నాగర్ కర్నూలు పోలీసులకు వాచ్‌లో పెట్టమని అడిగాము. మొబైల్లో చెక్ చేయగా వాట్సాప్ కాల్ లాగ్, చాట్లు అన్ని క్లియర్ చేసే ఉంది. విచారణలో అతను సమాధానం ఇచ్చే తీరు కూడా సస్పెక్ట్ అనిపించింది. అందుకే అతన్ని 8, 9 తేదీలలో విచారణకు రమ్మని చెప్పాము. అతని విచారణకు రాకుండా తప్పించుకున్నాడు.. ఆ తర్వాత భార్యకు కేసు తీవ్రత వివరించాం...ఆమె అతన్ని పదవ తేదీన విచారణకు తీసుకువస్తానని చెప్పింది. విచారణకు వచ్చే క్రమంలో భార్య అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో మల్లేష్ భార్య ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో వారు మాకు సమాచారం ఇచ్చారు. అనంతరం మల్లేష్ నుండి వెపన్స్ రికవరీ చేశారు. 30వ తేదీ రాత్రి ఆయుధగారం వద్ద అతని కదలికలు ఉన్నాయి. 28, 29న ఆయుధాల చోరీ కోసం అతను రెక్కీ చేసాడు. సీసీటీవీ రాత్రి పూట పని చేయదని అతనికి తెలుసు. 30 నుండి రాత్రి బాలాజీ నగర్ నుండి కార్గిల్ గేట్ గుండా లోపలికి వచ్చాడు. ఆయుధ గారంలో తాళం పగల గొట్టి ఆయుధాలను ఒక్కొకటి తీసుకు చీకటి ఉన్న ప్రాంతంలో పెట్టాడు. మందగుండు ఉన్న గది దగ్గకు వెళ్ళి గంట సేపు శ్రమించి తాళం పగల గొట్టాడు. తాళం పగల గొట్టి మందగుండి సామాగ్రి తీసుకుని వెళ్ళాడు. ..దాదాపు గంట పాటు లోపలే ఉండి మందుగుండు సామగ్రిని ఆయుధాలను స్కూటీ లో పెట్టుకుని రెండు కిలోమీటర్ దూరంలో టెంపుల్ దగ్గర పెట్టాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాగజీన్ కవర్ కోసం మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ అతని ప్రశ్నించగా తాను మద్రాస్ రెజిమెంట్ అని చెప్పాడు. ఆ తర్వాత మ్యాగజీన్లను బ్యాగ్‌లో పెట్టుకుని బాలాజీ నగర్లో ఉన్న ఇంటికి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వెళ్ళాడు. తిరిగి ఇంటి నుండి గుడి వద్దకు కారులో వచ్చి అక్కడ నుండి ఆయుధాలు తీసుకుని అక్కడ అచ్చంపేట వైపు వెళ్ళాడు...ఓఆర్ఆర్, సాగర్ హైవే, బొంగులూరు గేట్ వైపు వెళ్ళాడు. సీసీటీవీలు ఉంటాయి శ్రీశైలం హైవేను అవాయిడ్ చేశాడు. దిండి దగ్గర వెహికల్లో ఎక్కించుకుని పేమెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేసాడు. ఉదయం పది గంటలకు అచ్చంపేట చేరుకున్నాడు. అక్కడే సొంత ఇంటి ముందు గడ్డివాము లాంటి ప్రాంతంలో మట్టి తీసి కప్పేశాడు. మళ్లీ ఐదు ఆరు రోజుల తర్వాత వాటిని తీసి పదరా గ్రామానికి షిఫ్ట్ చేశాడు. ఎనిమిదవ తేదీన మళ్ళీ ఆయుధాలను ఇంటికి తీసుకు వెళ్ళాడు. దీని తర్వాత పదవ తేదీ భార్య హైదరాబాద్ తీసుకుని వస్తున్న క్రమంలో నిజం ఒప్పుకుంటాడు. దీంతో కేసు కొలిక్కి వచ్చింది.. పది రోజుల పాటు కేసు ఆందోళన కలిగించింది’’ అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. -
పిల్లలు పుట్టడం లేదని టెస్టులకు వెళ్తే.. లోపల గర్భాశయం!
పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి.. వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. సాధారణంగా పురుషుల్లో ఉండని గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు అతడి శరీరంలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అంతేకాదు.. రెండు వృషణాలు కూడా సాధారణ స్థానంలో లేకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఇన్ఫెర్టిలిటీకి కారణమేంటో తెలుసుకునేందుకు చేసిన పరీక్షలతో ఈ అరుదైన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి వీర్యంలో శుక్రకణాలు పూర్తిగా లేకపోవడం (అజూస్పెర్మియా) గుర్తించారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో గర్భాశయంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి ముల్లెరియన్ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. దీనిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS)గా నిర్ధారించారు.అసలు PMDS అంటే ఏమిటి?మగ శిశువు గర్భంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు.. వృషణాల నుంచి ఉత్పత్తయ్యే యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) ప్రభావంతో ముల్లెరియన్ డక్ట్స్ అనే ప్రారంభ నిర్మాణాలు సాధారణంగా కనుమరుగవుతాయి. అయితే ఈ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదంటే దానికి శరీరం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ నిర్మాణాలు అలాగే ఉండిపోవచ్చు. దీంతో జన్యుపరంగా పురుషుడైన వ్యక్తిలో సాధారణ పురుష బాహ్య జననాంగాలు ఉన్నప్పటికీ.. శరీరం లోపల గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు ఉండొచ్చు. ఈ అరుదైన పరిస్థితినే పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు.పిల్లలు కలగకపోవడానికి కారణమేంటి?ఈ కేసులో ప్రధానంగా గుర్తించిన సమస్య.. వృషణాలు సాధారణ స్థానంలో లేకపోవడం. సాధారణంగా వృషణాలు శరీరం బయట ఉండే సంచిలో ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత శరీరం లోపల కంటే కొంత తక్కువగా ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తికి ఈ పరిస్థితి అవసరం. అయితే వృషణాలు పొత్తికడుపులో లేదంటే గజ్జల ప్రాంతంలోని మార్గంలోనే ఉండిపోతే.. శుక్రకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. పీఎండీఎస్లో ఇది తరచుగా కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగని PMDS ఉన్న ప్రతి వ్యక్తికీ సంతానలేమి ఉంటుందని చెప్పలేం. వృషణాల పనితీరు, శుక్రకణాల ఉత్పత్తి, పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సంతాన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.చికిత్స ఎలా ఉంటుంది?వీర్యంలో శుక్రకణాలు కనిపించని సందర్భాల్లో.. వృషణాల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతున్నాయా? అనే విషయాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. శుక్రకణాలు లభిస్తే ఐవీఎఫ్, ఐసీఎస్ఐ వంటి సహాయక పునరుత్పత్తి విధానాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో వృషణాల పనితీరు సరిగా లేకపోతే.. ఇతర సంతానోత్పత్తి మార్గాలను కూడా వైద్యులు సూచించవచ్చు. పీఎండీఎస్ ఉన్న కొందరు పురుషుల్లో సంతానోత్పత్తి సాధ్యమేనని వైద్య కేసు నివేదికలు చెబుతున్నాయి. చాలా అరుదైన పరిస్థితిపీఎండీఎస్ చాలా అరుదైన వైద్య పరిస్థితి. కొందరిలో చిన్న వయసులోనే వృషణాలు కిందికి దిగకపోవడం లేదంటే గజ్జల్లో హెర్నియా వంటి సమస్యల కారణంగా ఇది బయటపడుతుంది. మరికొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకపోవడంతో.. పెద్దయ్యే వరకు గుర్తించకపోవచ్చు. సంతానలేమి కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అనుకోకుండా నిర్ధారణ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితిని కేవలం ‘వింత’గా చూడకుండా.. వృషణాల పనితీరు, హార్మోన్లు, జన్యు కారణాలు, పునరుత్పత్తి వ్యవస్థను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సమయంలో గుర్తిస్తే సంతానోత్పత్తి అవకాశాలను కాపాడేందుకు, భవిష్యత్ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు చికిత్సా మార్గాలను ఎంచుకోవచ్చు. ఇదీ చదవండి: ఫాస్ట్‌గా తింటున్నారా? అయితే ఇది మీకోసమే! -
సాధిక్ ఖాన్ కేసులో ట్విస్ట్.. కీలక ఆధారాలు లభ్యం
-
వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
TDP ఆఫీసులో వివేకాను చంపిన హంతకుడు
-
సుమలత బహిరంగ క్షమాపణ చెప్పాలి: శేఖర్ మాస్టర్
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌కు, ఫెడరేషన్‌కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. తనపై సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని శేఖర్ మాస్టర్ తెలిపారు.తన ప్రమేయం లేకుండా ఎలాంటి నిరూపిత ఆధారాలు లేకుండా తన మనోభావాలు దెబ్బతినేలా సుమలత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై అభియోగాలు మోపి, నిందలు వేసి వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.పెద్దల మాటకు గౌరవంతో మౌనంఈ వివాదంపై మీడియా ముందుకు రావద్దని, గొడవలు వద్దని పెద్దలు సూచించారని శేఖర్ మాస్టర్ తెలిపారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు.యూనియన్ సభ్యుల కోసం ముందుంటా‘యూనియన్ సభ్యులకు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటా. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో ఎన్నో సాంగ్స్‌ను కూడా వదులుకున్నాను’ అని శేఖర్ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై ఫిర్యాదు -
ఎట్టకేలకు పట్టుకున్నారు
-
జానీ మాస్టర్ సతీమణి సుమలతపై ఫిర్యాదు
సుమలత ఆరోపణలపై రఘు మాస్టర్ కౌంటరిచ్చారు. సుమలత పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రఘు మాస్టర్ ఫిర్యాదు చేశారు. తమ కార్యవర్గాన్ని ఫెడరేషన్ గుర్తించిందని రఘు మాస్టర్ స్పష్టం చేశారు. ఫెడరేషన్ గుర్తింపు లేఖతోనే బ్యాంకును ఆశ్రయించామని వెల్లడించారు. మేం ఇచ్చిన లేఖ ఆధారంగానే బ్యాంకు అనుమతించిందని రఘు మాస్టర్ తెలిపారు.సుమలత ప్యానెల్‌ను ఫెడరేషన్ గుర్తించలేదని రఘు మాస్టర్ ఆరోపించారు. సుమలత వ్యవహారంతో డాన్సర్స్ అసోసియేషన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. అసోసియేషన్‌లో వివాదాలను సుమలత మరింత పెంచుతున్నారని రఘు మాస్టర్ విమర్శించారు. త్వరలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతానని రఘు మాస్టర్ ప్రకటించారు. కాగా.. అంతకుముందు రఘు మాస్టర్ ప్యానెల్‌పై సుమలత ఫిర్యాదు చేసింది. బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ సుమలత ఆరోపించింది. -
కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై ఫిర్యాదు
డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌పై కేసు నమోదైంది. ఆయనపై జానీ మాస్టర్ సతీమణి సుమలత దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఘు మాస్టర్ కార్యవర్గం చెల్లదంటూ ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మరింత తెలియాల్సి ఉంది. అసోసియేషన్ అధ్యక్షురాలిగా తొలగింపు.. కాగా.. గతేడాది డిసెంబరులో జానీ మాస్టర్ భార్య సుమలత.. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబరు వరకు పదవీకాలం ఉంది. కానీ అసోసియేషన్‌లో గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్న సంఘటనల కారణంగా ఈమెని తప్పించారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో యూనియన్ డ్యాన్సర్స్ భేటీ అయ్యారు. ఈ మేరకు కార్యవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులని ప్రకటించారు.డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి రఘు మాస్టర్ ప్రెసిడెంట్ కాగా.. మెహర్ బాబా మాస్టర్ సెక్రటరీ, బసవరాజు వైస్ ప్రెసిడెంట్, రాజన్న జాయింట్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా సతీష్, నాగార్జున, శివ కృష్ణ , జోజో ఉండనున్నారు. అయితే వీళ్లంతా తాత్కాలిక సభ్యులే. త్వరలో ఎన్నికలు జరుగుతాయని రఘు మాస్టర్ చెప్పారు. -
షార్ట్ ఫిలిం నటి అమూల్య కేసులో బిగ్ ట్విస్ట్..
హైదరాబాద్: బాలిక ఆత్మహత్య కేసు నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో నివసించే బాలిక ప్రైవేట్ వీడియోలతో కొందరు బ్లాక్మెయిల్ చేయగా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతల్‌బస్తీకి చెందిన ఎం.మహేష్(20)ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన మహేష్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఏయే పథకాలకు డిమాండ్ ఉందంటే.. -
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
సాక్షి, రంగారెడ్డి: తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. స్థానికంగా మెకానిక్‌గా పని చేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మృతదేహంపై కూడా లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాలపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. దీంతో ఈ ఘటనకు.. కోల్‌కతాలో జరిగిన సంచలన ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనను పోలిన పరిస్థితులు ఉన్నాయనే చర్చ జోరందుకుంది.ఖమ్మం జిల్లా ముల్కలపల్లి మండలానికి చెందిన 21 ఏళ్ల యువతి ఎనిమిది నెలల క్రితం తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. అక్కడే ఆవరణలోని హాస్టల్లో తోటి నర్సులతో కలిసి ఉంటోంది. రాఖీ పండుగ కారణంతో రూమ్మేట్స్ ఊరెళ్లగా.. శుక్రవారం రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రించింది. శనివారం మధ్యాహ్నం వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది అనుమానంతో కిటికీలోంచి చూడగా విగతజీవిగా కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు.. దర్యాప్తులో లభించిన ఆధారాలతో అత్యాచారం, హత్య కోణంలో విచారణ చేపట్టారు. స్థానికంగా పని చేసే మెకానిక్ మహ్మద్ సనావుల్లా(34) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.కిటికీ గ్రిల్స్ లేకపోవడంతో..ఆస్పత్రి పక్కనే ఉన్న కార్ల మెకానిక్ షాపులో బిహార్‌కు చెందిన సనుహుల్లా (34) పనిచేస్తున్నాడు. ఇతర కార్మికులు సాయంత్రం వెళ్లిపోయిన తర్వాత అతడు అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలో.. ఆస్పత్రిలో పనిచేసే నర్సుల కదలికలను కొంతకాలంగా గమనించినట్లు తెలుస్తోంది. యువతి(21) ఒంటరిగా ఉన్న విషయం గమనించి.. అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడ్డాడు. ఆమె ఉంటున్న గది కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో దాని ద్వారా లోపలికి ప్రవేశించాడు. లైంగిక దాడికి ప్రయత్నించగా యువతి ప్రతిఘటించి కేకలు వేయడంతో.. బయటకు శబ్దం వినిపించకుండా ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.నిందితుడు సనావుల్లా ఖాన్పోలీసుల అదుపులో నిందితుడుఅంతకు ముందు.. పోలీసుల ముందే నిందితుడు సనావుల్లా ఖాన్ దర్జాగా తిరిగాడు. డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు ఆస్పత్రి ఆవరణలో తనిఖీలు జరుపుతున్న టైంలో.. ఏం జరిగింది? అంటూ పోలీసులనే ఆరా తీశాడతను. అయితే జాగిలాలు నేరుగా మెకానిక్ షాపు దగ్గరకే వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈలోపు.. నేరం జరిగిన అర్ధరాత్రి నిందితుడు తనకు పదే పదే కాల్ చేశాడని షాపు యాజమానికి పోలీసులకు చెప్పాడు. దీంతో తమదైన శైలిలో విచారించగా సనావుల్లా ఖాన్ నేరం అంగీకరించాడు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో యువతిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే నిందితుడి ఒక్కడి ప్రమేయమే ఉందా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత కేసులో మరిన్ని వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. అలాగే నిందితుడు రోహింగ్యా అంటూ జరిగిన ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కుటుంబ సభ్యుల ఆందోళనమరోవైపు యువతి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. వీళ్లకు మద్దతుగా పలువురు బీజేపీ నాయకులు తరలి వచ్చారు.ఆర్జీకర్ ఘటనలో ఏం జరిగింది?2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఘటన.. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ అర్ధరాత్రి 31 ఏళ్ల ట్రెయినీ డాక్టర్ మృతదేహం లభించింది. ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తాజా తుక్కుగూడ ఘటనలోనూ అర్ధరాత్రే.. అదీ ఆస్పత్రి ఆవరణలోనే అఘాయిత్యం జరగడం గమనార్హం.ఇదీ చదవండి: నీట్ కొట్టింది.. అంతలోనే ఆనందం ఆవిరైంది! -
2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు
-
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య
చండీగఢ్: పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) దారుణ హత్యకు గురయ్యారు. కిడ్నాప్‌నకు గురైన ఆమెను చెట్టుకు కట్టేసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం పీజీఐఎంఈఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న మృతి చెందారు. బాధితురాలి తల్లి కాంతా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్ పోలీసులు ఇద్దరు అనుమానితులపై అపహరణ, హత్య కేసులు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం.. జూలై 3వ తేదీ రాత్రి చండీగఢ్‌లోని సెక్టార్ 34లో గల మద్యం దుకాణం వద్దకు రావాల్సిందిగా ఆమెకు పరిచయస్తులైన శుభి, పిందా అనే వ్యక్తులు ఫోన్ చేశారు. మంజీత్ అక్కడికి చేరుకోగానే, వారు బలవంతంగా ఆమెను కారులోకి లాగి మొరిండా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై తీవ్రంగా దాడి చేసి, చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతున్న ఆమెను గమనించిన ఓ పరిచయస్తుడు దుప్పటితో మంటలను ఆర్పి, వెంటనే స్థానిక మొరిండా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మొహాలీ ఆసుపత్రికి, జూలై 9న పీజీఐఎంఈఆర్ చండీగఢ్‌కు తరలించారు.కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలో ఉన్న మంజీత్, ఆగస్టు 5న కొద్దిసేపు స్పృహలోకి వచ్చి జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆగస్టు 26న ఆమె కన్నుమూశారు. ఈ ఘటనపై సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 140(1) (కిడ్నాప్), 103(1) (హత్య), 3(5) కింద కేసు నమోదైంది. మృతురాలికి విడాకులు అయ్యాయని, ఏడేళ్ల కుమారుడు ఉన్నాడని సెక్టార్ 34 ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ షాదీ లాల్ తెలిపారు. నిందితుల్లో ఒకరితో మంజీత్ గతంలో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్షిప్) చేసినట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.ఇది కూడా చదవండి: ప్రశాంత్ కిశోర్ జన సేవా కేంద్రం ప్రారంభం.. లక్ష్యం ఇదేనట! -
జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
-
జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, కాకినాడ జిల్లా: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి హత్యలో ఎమ్మెల్యే అనుచరుడి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యలో ఎమ్మెల్యే అనుచరుడు కటౌట్ శ్రీను హస్తం ఉందని సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు. కటౌట్ శ్రీను టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు. కేసు నుంచి శ్రీనును తప్పించాలని చూస్తున్నారని.. కటౌట్ శ్రీను నుంచి నాకు ప్రాణహాని ఉందని సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ అన్నారు. ఏడాది క్రిందట జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి తో జయశ్రీకి ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం జయశ్రీ ఐదు నెలల గర్భవతి.జయశ్రీ మాట్లాడుతూ.. ’’కొద్ది నెలల క్రితం కటౌట్ శ్రీను నుంచి అతని భార్య విడాకులు తీసుకుంది. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి సతీష్ రెడ్డే కారణమని కటౌట్ శ్రీను భావించాడు. నేను నా పుట్టింట్లో ఉండగా సాయికిరణ్‌ను వెంట బెట్టుకుని కటౌట్ శ్రీను వచ్చి సతీష్‌ను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకుని సాయికిరణ్‌ను సతీష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్న సాయికిరణ్, సతీష్‌రెడ్డి కి మధ్య వివాదం నడుస్తుంది...మా ఇంట్లో అన్నం తిన్న సాయి కిరణే తన అనుచరులతో నా భర్తను కిరాతకంగా చంపాడు. అయితే ఈ హత్య చేయించింది మాత్రం కటౌట్ శ్రీనే. ఇదే విషయాన్ని పోలీసులకు చెబితే.. శ్రీను పేరు బయటకు చెప్పవద్దంటూ అతనిని తప్పిస్తున్నారు’’ అని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు.ఇదీ చదవండి: సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు? -
జగనన్న ఇచ్చిన హామీతోనే మాకు ఇంత దైర్యం వచ్చింది
-
మార్గదర్శి కేసు: తప్పు.. తప్పు కాకుండా పోతుందా?
భారతదేశంలో రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థలను ప్రభావితం చేయగల అత్యంత శక్తిమంతులలో ఒకరిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్ సంస్థ డిపాజిట్ల సేకరణ కేసులో, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం ఫలించినట్లా? కాదా? ఈ కేసును సుప్రింకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందని, సత్యం గెలిచిందని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచారం చేసుకుంది. తప్పులేదు. ఎందుకంటే వారి గ్రూప్ సంస్థ కనుక తమకు అనుకూలంగా ఎట్టకేలకు తీర్పు వచ్చిందన్న భావనతో ప్రజలలో దీనిపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని తొలగించేందుకు ఆ మీడియా యత్నించింది. కాని అంత మాత్రాన చేసిన తప్పు, తప్పు కాకుండా పోతుందా? అన్నది చర్చనీయాంశం.ఈ తీర్పుపై ఉండవల్లి ఇచ్చిన విశ్లేషణ, ఆయన వేసిన ప్రశ్నలకు మార్గదర్శి సంస్థ తరపున ఈనాడు మీడియా సమాధానం ఇస్తే అప్పుడు ప్రజలు ఇందులో రామోజీరావు తప్పు చేశారా? లేదా? అన్నది ఆలోచించుకుంటారు. కాని అటువైపు నుంచి స్పందన కనిపించలేదు. మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు ఈ కేసు తీర్పు, ఉండవల్లి పోరాటంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన అలుపెరగని పోరాటానికి చివరకు తెరపడిందని, ఈ కేసును ఇంత దూరం తీసుకురాగలుగుతారని తాను అసలు అనుకోలేదని, కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి పడిన శ్రమ మాత్రమే దీన్ని ఇన్నాళ్లు నడిపించాయని ఆయన కొనియాడారు.మంది మార్బలం, అపారమైన శక్తి ఉన్న రామోజీరావు ఎక్కడ? ఒంటరిగా పోరాడిన ఉండవల్లి ఎక్కడ? అని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఈ పోరాటాన్ని బైబిల్లోని 'గోలియత్-డేవిడ్' యుద్ధంతో పోల్చారు. బైబిల్లో డేవిడ్ గెలిచి ఉండవచ్చు కానీ, నిజజీవితంలో ఎప్పుడూ గోలియత్లదే (బలవంతులదే) విజయం అవుతుందని న్యాయపరమైన ముగింపును ఉద్దేశించి ఐవైఆర్ కృష్ణారావు నిగూఢ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరంగా ఈ కేసు వీగిపోవడానికి లేదా ముగియడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలోనే మొత్తం సూక్ష్మం అంతా కనిపిస్తుంది కదా! రామోజీరావు తప్పు చేయలేదన్నట్లుగా ఈనాడు ప్రొజెక్టు చేసుకోవడాన్ని ఉండవల్లి ప్రస్తావించి, తప్పు చేయకపోతే ఈటీవీ షేర్లను విక్రయించి డిపాజిట్ దారులకు డబ్బు ఎందుకు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించివేస్తామని సుప్రింకోర్టును ఎందుకు వేడుకున్నారన్నది ఆయన ప్రశ్న?అంతేకాక ఫైనాన్స్ సంస్థను ఎందుకు మూసివేశారని ఆయన అడుగుతున్నారు. డిపాజిట్ల సేకరణ చేయవచ్చని ఏ కోర్టు చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి నిజమా? కాదా? ఉండవల్లి అడిగిన ప్రశ్నలన్నీ హేతుబద్దంగా ఉన్నాయి కదా! వీటికి రామోజీరావు కుమారుడు కిరణ్ తన మీడియాలో జవాబు ఇస్తే బాగుంటుంది కదా! ఇక్కడ అసలు సమస్య 2600 కోట్ల డిపాజిట్లు తిరిగి చెల్లించారా?లేదా? అన్నది కాదు. చట్టం ప్రకారం డిపాజిట్ల సేకరణ తప్పా? కాదా? అన్నదే. మామూలుగా అయితే రామోజీ ఎంతమాత్రం ఎవరికి లొంగకూడదని అనుకుంటారు. బ్రేక్ ద లా లాఫుల్లీ అన్నది తన విధానం అని ఆయా సందర్భాలలో సన్నిహితులతో రామోజీ అనేవారని చెబుతారు. అంటే ఎక్కడా దొరకకుండా, చట్టంలోని లొసుగులను వాడుకోవాలన్నది ఆయన ధీరీ అన్నమాట.ఆయనకు రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉందన్నది ఎనలేని సత్యం. ఆయన చేసింది సక్రమమా? అక్రమమా? అన్నదానితో నిమిత్తం లేకుండా తెలుగుదేశం మద్దతు ఇస్తుంటుందన్నది చాలామంది భావన. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకినని రామోజీ ప్రకటించుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి చెందినవారు కొందరితో కూడా సత్సంబంధాలు నెరపి, తన వ్యాపార అవసరాలకు వాడుకునేవారని అంటారు. తెలంగాణలో టీఆర్ఎస్తో కూడా చాలావరకు మంచి సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడుగా పేరొందిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాక రామోజీ గ్రూప్‌కు పూర్తి సహకారం లభించసాగింది. అందువల్లే రామోజీ మరణించిన తర్వాత ఆ సంస్థకు అనుకూలంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానంలో అఫిడవిట్లు వేశాయన్నది న్యాయనిపుణుల అభిప్రాయంగా ఉంది.ఇక కేంద్రంలోని బీజేపీతో కూడా ఈ గ్రూపు సఖ్యతతో ఉంటుంది. ఇదంతా తనకు ఉన్న మీడియా బలంతోనే అన్నది బహిరంగ రహస్యమే. బహుశా అందువల్లేనేమో కొంతకాలం క్రితం వరకు డిపాజిట్ల సేకరణ కేసులో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా వాదనలు వినిపించి సెక్షన్ 45 ఎస్ కింద హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసేది. కాని అదే రిజర్వుబ్యాంకు ఈ కేసును ఇకపై తాము పట్టించుకోబోమని ఉండవల్లి రాసిన ఒక లేఖకు బదులుగా చెప్పిందంటే ఏమిటి అర్దం?రామోజీ గ్రూప్‌నకు ఉన్న పరపతి, రాజకీయ పలుకుబడి ముందు తాము నిలబడ లేకపోతున్నామని ఆర్బీఐ అంగీకరించడమే కదా!రామోజీ మరణించినందున ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదన్నది తెలిసిన విషయమే. కాని ఆయన సంస్థ చేసిన తప్పులపై కేసు కొనసాగుతుందని గతంలో కోర్టువారు ఇచ్చిన ఒక తీర్పును ఉండవల్లి ఉదహరించారు. నిజానికి ఉండవల్లి చేస్తున్న పోరాటం ఏమిటి?మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లు వసూలు చేయడం సక్రమమా? అక్రమమా? కేంద్రం తీసుకు వచ్చిన చట్టాన్ని రామోజీ అతిక్రమించారా? లేదా? అన్నది తేల్చాలనే! రామోజీ జీవించి ఉన్నప్పుడు కూడా ఉండవల్లి ఒక మాట చెప్పేవారు. రామోజీని జైలులో పెట్టాలని తాను కోరుకోవడం లేదని, కాని ఈ డిపాజిట్ల కేసును నిగ్గు తేల్చడం ద్వారా ఇకపై అలా ఎవరూ డిపాజిట్లు వసూలు చేయకుండా చూడాలన్నదే తన ఉద్దేశం అని ఆయన అనేవారు. ఎందుకంటే అక్రమ డిపాజిట్లు వసూలు చేసినవారికి రెట్టింపు జరిమానా వేయాలని రిజర్వుబ్యాంక్ చట్టం సెక్షన్ 45 ఎస్ చెబుతోంది. దీనిని ఎవరికైనా ఒకేరకంగా వర్తింప చేయాలన్నది ఉండవల్లి డిమాండ్.సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సెక్షన్ 45 ఎస్ గురించి కాకుండా, ఉండవల్లికి ఈ కేసుతో ఏమి సంబంధం అన్నదానిపైనే ఇచ్చినట్లుగా ఉంది. తాను కేసు ఫిర్యాదుదారుడినని గతంలోనే కోర్టుకు తెలిపానని, దానిని పరిగణనలోకి తీసుకున్నందునే ఇంతకాలం కేసు సాగిందని ఆయన అంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని నెలల క్రితం వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన ఒక ప్రశ్నకు రిజర్వుబ్యాంక్ సమాధానం ఇస్తూ హెచ్‌యూఎఫ్‌లు, అనధికార సంస్థలు డిపాజిట్లు వసూలు చేయరాదని, అది చట్టరీత్యా నేరం అని స్పష్టం చేసిందని ఆయన వివరించారు. దీని ఆధారంగా తాను పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ సభ్యులను అప్రోచ్ అయి, ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వైఖరి ఎందుకు మార్చుకుందో తెలుసుకోవాలని కోరతానని ఉండవల్లి తెలిపారు.రామోజీరావు మరణించేవరకు సెక్షన్ 45 ఎస్ తమకు వర్తించదని వాదించేవారని, తర్వాత వారసులు కొత్త వాదన తీసుకువచ్చి ఆయన చేసిన తప్పులకు తమకు సంబంధం ఏమిటని అన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో తప్పు చేసినా జరిమానా కట్టకుండా రామోజీ సంస్థ తప్పించుకుందన్నది విశ్లేషణగా ఉంటుంది. అన్నిటిని పరిశీలిస్తే ఉండవల్లి ఇంతవరకు చేసిన పోరాటానికి.. పూర్తి స్థాయిలో అర్ధవంతమైన ముగింపు వచ్చి ఉండకపోవచ్చు కాని, ఆయన చేసిన పోరాట స్పూర్తి మాత్రం ఎప్పటికి కొనసాగుతుంది. రామోజీ వంటి బలాఢ్యులు సైతం తప్పు చేస్తే, దానిని ఒప్పుకోకతప్పదని కూడా ఈ కేసు సారాంశంగా తీసుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు
-
టాక్సిక్ మేకర్స్‌కు షాక్.. కేసు నమోదు
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాక్సిక్ చిత్ర యూనిట్‌తో పాటు మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న మూవీ టాక్సిక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఫేస్బుక్లో ఫోటోకి క్యాప్షన్ పెడుతున్నారా? పాపం ఆ వ్యక్తి ఏకంగా..
మీ సంతోషాన్ని, విషాదాన్ని, ప్రతి చిన్న విషయాన్నీ ఫేస్బుక్లో పోస్టు చేస్తున్నారా? ఫొటోలు పెట్టి క్యాప్షన్లు పెడుతున్నారా?... అయితే తస్మాత్ జాగ్రత్త! మీరు పెట్టేవి ఒక్కోసారి అపార్థాలకు దారితీయొచ్చు; మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. అలాంటిదే ఓ సంఘటన తమిళనాడులో జరిగింది. ఓ వ్యక్తి ఎఫ్బీలో చేసిన పోస్టు పెద్ద దుమారమే రేపింది. చివరికి కుట్ర కేసు వరకు వెళ్లింది. ఆ కేసు ఏమిటో, దాని కథా కమామిషు ఏమిటో తెలుసుకుందాం..తమిళనాడుకు చెందిన మథివనన్ ఓ రాజకీయపార్టీకి చెందిన నాయకుడు. అతడు తన కుమార్తె, అల్లుడితో కలిసి 2021 సెప్టెంబరులో సిరుమలై కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లాడు. ఆ జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ఫొటోలు తీసుకున్నాడు. వాటిలో ఓ ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేసి, ‘షూటింగ్ ప్రాక్టీస్ కోసం సిరుమలై ప్రయాణం’ అనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టాడు. ఎఫ్బీలో అది చూసి కొంతమంది లైక్ కొట్టారు. సన్నిహితులు కామెంట్ పెట్టారు. పోలీసులు మాత్రం కేసు పెట్టారు.‘జిహ్వకో రుచి... పుర్రెకో బుద్ధి’ అంటారు. పోలీసుల బుర్రకు ఆ క్యాప్షన్ మరోలా తోచింది. షూటింగ్ ప్రాక్టీస్ అంటే వేరేలా అర్థం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 120(బి), సెక్షన్ 122, సెక్షన్ 505(1)(బి), సెక్షన్ 507 కింద ఎడాపెడా కేసులు నమోదు చేశారు. హడావుడిగా మథివనన్ను అరెస్ట్ చేసి, వాడిపట్టి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. రిమాండ్ ఇవ్వాలని కోరారు. మేజిస్ట్రేట్ తిరస్కరించారు.హైకోర్టులో ఆసక్తికర వాదనలుకేసు హైకోర్టు మధురై బెంచ్‌కి చేరింది. వాడిపట్టి మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. అరెస్ట్ చేసిన ప్రతి వ్యక్తినీ యాంత్రికంగా రిమాండ్‌కు పంపడం కుదరదని తేల్చింది. రిమాండ్ అవసరమా, లేదా? అన్నది మేజిస్ట్రేట్ పరిశీలిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నవ్వడం కూడా పౌరుల విధుల్లో ఒకటిగా ఉండాలేమో!’ అంటూ వ్యాఖ్యానించింది. హాస్యం, ఎగతాళి రెండూ వేర్వేరు అంశాలని పేర్కొంది.సెక్షన్ల వారీగా వివరణ‘ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అవడానికి కేవలం ఒక క్యాప్షన్ సరిపోదు. వ్యక్తులను సమీకరించడం, ఆయుధాలను సేకరించడం, ఇతర సన్నాహాలు’ ఉండాలి. ఆ ఫొటోల్లో ప్రకృతి, కూతురు, అల్లుడు తప్ప అలాంటి చర్యలేవీ కనపడడం లేదు. పోలీసులు ఎలాంటి ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నట్టు రిపోర్టులో రాయలేదు. కాబట్టి సెక్షన్ 122 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.సెక్షన్ 505(1)(బి) వర్తించాలంటే, ఒక ప్రకటనతో ప్రజల్లో భయం కలగాలి; అలజడి రేగాలి. ప్రభుత్వానికి/ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రజలను ప్రేరేపించాలి. కానీ ఆ క్యాప్షన్ చూస్తే నవ్వు వస్తుంది తప్ప పైన పేర్కొన్నవేవీ కలగడం లేదు. కాబట్టి ఈ సెక్షన్ అసంబద్ధమైంది.అజ్ఞాతంలో ఉండి బెదిరింపులకు పాల్పడే వారికి సంబంధించింది సెక్షన్ 507. అతను సామాజిక మాధ్యమంలో బహిరంగంగా క్యాప్షన్ పెట్టాడు. ఇక్కడ అజ్ఞాత కమ్యూనికేషన్ ఏం ఉంది? ఇదీ చెల్లదని పేర్కొంది. మథివనన్ ఒక్కడ్నే నిందితుడిగా చేర్చారు. కుట్ర అంటే కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నేరం చేయడానికి కలవాలి. ఒక వ్యక్తి తనతో తానే కుట్ర చేయలేడని వ్యాఖ్యానించింది. కుట్రకు ఆధారమైన ఇతర ఆరోపణలూ నిలవలేదు. ఇక ఈ సెక్షన్ కూడా వర్తించదని స్పష్టం చేసింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అసంబద్ధమైనది, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసేదిగా ఉందని పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. ఒక క్యాప్షన్ తెచ్చిన తంటా చివరికి హైకోర్టు జోక్యంతో ప్రశాంతంగా ముగిసింది. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో!- దిలీప్ మాదిరెడ్డి -
రక్తపు మరకలు కడిగిన ఎర్ర గంగిరెడ్డితో సునీత ఎందుకు ములాఖత్ అయింది
-
‘డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా కేసు’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేకా హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు.ఆ దిశలోనే తొలిసారి ఈడీని రంగ ప్రవేశం చేయించి, వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. దాని వల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అంతా డైవర్షన్ పాలిటిక్స్:డీఎస్సీ అక్రమాలపై నాలుగు రోజులుగా సీబీఐ విచారణ కోరుతున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వంలో గ్రూప్-1 అవకతవకలు జరిగాయని మీరు ఆరోపిస్తున్నారు కదా.. వాటిపై సీబీఐ విచారణకు మేము సిద్ధం. మరి మీ హయాంలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో గంజాయి అరాచకాలు పెరిగిపోతుంటే, యువత తప్పుదోవ పడుతుంటే దానిపై మాట్లాడకుండా ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు?న్యాయం కోసం శాంతియుతంగా వీల్‌చైర్‌లో యాత్ర చేస్తున్న సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు హింసించారు? ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అధికార పార్టీకి చెందిన ఎంపీ కుమారుడి హిట్ అండ్ రన్ ఘటనపైనా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక యువతిని కారుతో ఢీకొట్టి చంపిన ఘటనపై సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని దారుణమైన అంశాలు ఉన్నాయి. వీటిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఈడీ సోదాలను ఏదో సాధించినట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది.వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీకి సవాల్:వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత సీబీఐ విచారణ కూడా జరిగింది. ఇప్పుడు ట్రయల్ జరగాలి అంటుంటే.. ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. కేసు ట్రయల్ సజావుగా సాగకుండా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? సీబీఐ విచారణ జరిగింది. కేసు కోర్టుల పరిధిలో ఉంది. నిందితులపై విచారణ జరిగి నిజాలు బయటకు రావాలి. ట్రయల్ జరగడానికి మీకు అభ్యంతరం ఏమిటి?చంద్రబాబుకి సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాయే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడి తరఫున కూడా వాదిస్తున్నారు. ఈ సంబంధాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల పన్నుల డబ్బుతో కోట్ల రూపాయలు ఫీజులు చెల్లిస్తూ, కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? విచారణ జరపండి.. ట్రయల్ జరపండి.. నిజాలు ప్రజల ముందుకు రానివ్వండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. సుగాలి ప్రీతి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసైనా సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధంగా లేరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఫాల్స్ ప్రాపగండా, ఫాల్స్ నేరేటివ్, డైవర్షన్ రాజకీయాలు మానండి. వ్యవస్థలపై నమ్మకం ఉంచండి. నిజాయితీగా విచారణ జరగనివ్వండి. మీ మీడియా శక్తితో ఎంత ప్రచారం చేసినా నిజాన్ని దాచలేరు. వివేకానంద రెడ్డి మా మనిషి. దివంగత వైఎస్సార్ సోదరుడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు. ఆయన హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకోవాలి. వివేకాను చంపిన గొడ్డలి ఎవరిదో తేలాలి. విచారణ జరగాలి. నిజం ప్రజల ముందుకు రావాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
సౌజన్య ఫోటోలు, వీడియోలతో వేధింపులు.. AE నూకరాజు కేసులో దిమ్మతిరిగే వాస్తవాలు
-
కేసులను ఎత్తేయాల్సిందే
న్యూఢిల్లీ: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత వేళ విద్యార్థులపై పోలీసులు మోపిన కేసులను రద్దుచేసేందుకు సుప్రీంకోర్టు సానుకూలత వ్యక్తంచేసినా అందుకు మోదీ ప్రభుత్వం సముఖంగా లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘జూలై 25న సీజేపీకి మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ దిశలో ఆలోచనచేసిన సుప్రీంకోర్టు ఎదుట ప్రభుత్వం మోకాలడ్డొద్దు. అలా చేస్తే సీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ రెండ్రోజుల్లో సమావేశమై మళ్లీ జాతీయస్థాయి ఉద్యమానికి రంగం సిద్ధంచేస్తుంది’’అని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల జాబితా ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే ప్రభుత్వం ఆ జాబితాను ఉద్దేశపూర్వకంగా అందజేయలేదు. జాబితా ఇస్తే ఆ కేసులన్నింటినీ 142వ అధికరణం ద్వారా దఖలుపడిన అధికారం ద్వారా రద్దుచేస్తామని కోర్టు మంగళవారం మూడు సార్లు గుర్తుచేసి, జాబితా అడిగినా ప్రభుత్వం సమర్పించలేదు. ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయాలకు తగ్గట్లే దీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు కేంద్ర మంత్రులు మాట ఇచ్చి తప్పారు. యావత్ భారత దేశ యువత నమ్మకంతో ఆటలాడతామంటే మేం చూస్తూ ఊరుకోం. ఇకనైనా కోర్టు నియమించిన హైపవర్ కమిటీలో సీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. పోలీసుల దారుణాలను వివరించే అవకాశం ఇవ్వాలి’’అని దాస్ కోరారు. -
నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
-
పోలీస్ స్టేషన్ కు డబ్బు సూట్ కేసులు..!? సీసీటీవీ ఫుటేజ్ మాయం..
-
‘కూటమి’ క్రైమ్ కథాచిత్రం!
మధురవాడ: విశాఖలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ యువతిని పెళ్లి పెరుతో లొంగదీసుకొని మోసం చేసిన కేసు అధికార కూటమి నేతల మెడకు చుట్టుకుంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకోవడం, గర్భస్రావానికి ఒత్తిడి చేయడం, ఆపై బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కార్పురపు రాహుల్‌రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సహా 11మందిపై మైనార్టీ యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు టీడీపీ కూటమి నేతలు రంగంలోకి దిగారు. బాధితురాలిని పలు విధాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. తనను బెదిరించి, లొంగదీసుకునేందుకు ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలతో పాటు నేరుగా సీఎం కార్యాలయం నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారని బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇవన్నీ నిందితుడు రాహుల్‌రెడ్డికి అధికార కూటమి నేతలతో ఉన్న బలమైన సంబంధాలను వెల్లడిస్తున్నాయని బాధితురాలి వర్గం చెబుతోంది వైరల్ అవుతున్న ఆడియో నిందితుడు రాహుల్‌రెడ్డికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌తో సన్నిహిత సంబం«దాలు ఉన్నాయని, కూటమికి చెందిన మరో ఎమ్మెల్యే అతనికి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి బాధితురాలి తరపు న్యాయవాదికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఒక ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరు అందులో ప్రస్తావనకు రావడం పెద్ద దుమారానికే దారితీసింది. నిందితుడు రాహుల్‌రెడ్డికి ఆ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన పేరును అడ్డుపెట్టుకుని తనను బెదిరించారని బాధితురాలు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేకు చెందిన కీలక వ్యాపార వ్యవహారాలను కూడా రాహుల్‌రెడ్డి చూస్తున్నారనే విషయం ఆడియోలో ఉన్నట్లు బాధితురాలి వర్గాలు వెల్లడిస్తున్నాయి. రూ.20 కోట్ల బెదిరింపుల వెనుక ఎవరు? ఈ ఏడాది చివరికి రూ.20 కోట్లు సంపాదించి బాధితురాలి అంతం చూస్తానని రాహుల్‌రెడ్డి బెదిరింపులకు దిగడం కేసు తీవ్రతను వెల్లడిస్తోంది. ఒక వ్యక్తిగత వివాదం వెనుక ఇంత పెద్దమొత్తంలో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయా? రాహుల్‌రెడ్డికి రూ.20 కోట్లు సంపాదిస్తాననే ధీమా ఇచ్చిన నాయకులు ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కక్షపూరిత వేధింపులు పలువురు తనను బెదిరించారని, బ్లాక్మెయిల్ చేశారని, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఉపయోగించి ఒత్తిడికి గురిచేశారని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. తాను హనీట్రాప్ అని, వ్యభిచారం చేస్తున్నట్లు.. హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇంతటి స్థాయిలో వేధింపులు కొనసాగుతున్నాయంటే.. రాహుల్‌రెడ్డి వెనుక రాజకీయంగా, అధికారికంగా ఎవరు అండగా ఉన్నారని ఆమె ప్రశ్నిస్తోంది. -
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ అయిఉంటే అది చాలా తీవ్రమైన వ్యవహారమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మే నుంచీ హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదంటూ పోలీసులను ధర్మాసనం నిలదీసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.రెండు వారాలు గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరగా.. హైకోర్టు నిరాకరించింది. వారం రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకు కోర్టు వాయిదా వేసింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. -
సాయికృష్ణ కేసు.. హోంగార్డ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హోంగార్డ్ వెంకటరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం వెంకటరాజును సిట్ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 25వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జైలుకు వెంకటరాజును పోలీసులు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన హోంగార్డు వెంకటరాజు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆధారాలు దొరక్కుండా సీఐ నాగరాజు.. హెడ్ కానిస్టేబుల్ అశోక్, హోంగార్డ్ వెంకట రాజును ఉపయోగించుకున్నట్లు తేలింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత ఈ ఏడాది మే 20వ తేదీన సిట్ అధికారుల విచారణలో వెంకటరాజు వాస్తవాలు చెప్పలేదు. వెంకటరాజుకి సీసీ కెమెరాల ఆపరేషన్‌లో అనుభవం ఉంది.అక్రమంగా నిర్బంధించి దాడి చేసిన ఘటనలో సాయికృష్ణ చనిపోయాడు. సాయికృష్ణ మృతదేహం మాయం చేయడానికి A4 సురేష్ సహకారం అందించాడు. సాయికృష్ణని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చిన, తీసుకెళ్లిన ఆధారాలను ధ్వంసం చేశారు. మే 14న కృష్ణలంక పోలీస్ స్టేషన్ స్టేషన్ సెల్లార్, స్టేషన్ అవుట్ డోర్, ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను తొలగించారు. అదే రోజు పోలీస్ స్టేషన్లో సీఐ రూమ్‌లో ఉన్న నాలుగు హార్డ్ డిస్క్‌లు తొలగించాలంటూ హెడ్ కానిస్టేబుల్ అశోక్.. హోం గార్డ్ వెంకటరాజుకి చెప్పాడు.హార్డ్ డిస్క్ తొలగించిన తరువాత వాటిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని స్టోర్ రూమ్‌లో దాచారు. సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్క్‌లను తొలగించనట్లు అనుమానం రాకుండా సీసీ కెమెరాలను ఆన్‌లోనే ఉంచారు. తొలగించిన హార్డ్ డిస్క్ స్థానంలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఇన్స్టాల్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా హోంగార్డ్ హార్డ్ డిస్క్‌లు తొలగించి ఆధారాలు ధ్వంసం చేశాడు.సాయికృష్ణ గురించి ఆధారాలేవీ దొరక్కుండా ఉండేందుకు కొత్త ఎన్వీఆర్, డీవీఆర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణలో ఉండాల్సిన డేటాను ఉద్దేశ్య పూర్వకంగా అందరూ కలిసే తొలగించారు. ఆధారాలను, సాక్ష్యాలని ధ్వంసం చేయడం కోసం అందరూ కలిసి భాగస్వాములయ్యారు. సాయికృష్ణ లాకప్ డెత్ అవ్వడానికి ఏ1 నుంచి A6 వరకు అందరి పాత్ర ఉంది. ఒక పథకం ప్రకారమే A1 నుండి A7 వరకు ఆధారాలను ధ్వంసం చేశారు. సీసీ కెమెరా విజువల్స్ తొలగించడంలో నాగరాజు, అశోక్, వెంకట రాజు ముగ్గురు కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. -
లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్‌కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. -
భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు
-
కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని
-
రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్
-
కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?
-
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్‌లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్‌లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్‌మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్‌నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
శ్రీకాకుళం పోలీసులకు కోర్టులో బిగ్ షాక్
-
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!
-
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
-
డా. ప్రియాంక ఘటనపై SP సంచలన వ్యాఖ్యలు
-
సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. మాకేమి తెలీదు.. అంత CI నాగరాజుకే..
-
యాక్సిడెంట్ చేసింది వాళ్లే..? రాజమండ్రి డాక్టర్ కేసులో మార్గాని భరత్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. ఏడురోజుల పాటు సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు ఐదు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది.ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను సిట్ అధికారులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లు ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. -
మోదీని దూషించి.. మూడు సార్లు మకాం మార్చిన బాలిక!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన కేసులో నోయిడాకు చెందిన 15 ఏళ్ల బాలిక రుచికా సింగ్ ఎదుర్కొంటున్న కష్టాలు ఇంకా తొలగలేదు. బహిరంగంగా క్షమాపణ కోరినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ద్వారా చిరునామా లీక్ కావడంతో ఆమె తల్లితో పాటు మూడు సార్లు ఇల్లు మార్చాల్సిన దుస్థితి ఏర్పడింది.ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థి ఆందోళన సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రుచికా సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీ ఆమెను క్షమిస్తూ సందేశం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేశారు. ఈ క్రమంలోనే రుచికా కూడా తన తప్పును మన్నించాలని దేశ ప్రజలను కోరుతూ, ఒక వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ ఆమెకు కష్టాలు తప్పలేదు.రుచికా సింగ్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఆమె వయసు కేవలం 14 ఏళ్లని, ఆగస్టు 1 నాటికి ఆమెకు 15 ఏళ్లు నిండాయని తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లో చిరునామా లీక్ కావడంతో కొందరు ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార హెచ్చరికలు, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో ప్రాణభయంతో వారు ఫరీదాబాద్‌లోని బంధువుల ఇంట ఆశ్రయం పొంది, ఆ తర్వాత మరో అజ్ఞాత ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయవాది ఖండించారు. రుచికా సెలూన్ వర్కర్ కాదని, ఢిల్లీ పాఠశాలలో ఓపెన్ స్కూలింగ్ విధానంలో పదవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి అని తెలిపారు. ఆమె తల్లి సింగిల్ పేరెంట్ అని, ప్రైవేట్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారన్నారు. ఈ వేధింపులు ఆ తల్లీకూతుళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అభిజీత్ దీప్కే అరెస్ట్‌కు రంగం సిద్ధం? -
సాయికృష్ణ కేసు.. సిట్ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ4గా ఉన్న సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేష్ పరారీలో ఉన్నట్టు ఆచూకీ తెలపాలని సిట్ ప్రకటన విడుదల చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు.సిట్ ఎదుట విచారణకు హాజరైన తరువాత కేసు నమోదు కాగానే సురేష్ పరారయ్యాడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ పరారీలో ఉన్నాడని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు సిట్ నివేదించింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్‌కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. -
కృష్ణలంక PSలో సీన్ రీక్రియేషన్
-
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
సాయికృష్ణ కేసు.. సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
సాక్షి, విజయవాడ: సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుండి విజయవాడకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజును విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించే అవకాశం ఉంది. అనంతరం సీట్ కార్యాలయంలో సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ సిద్ధమైంది.కాగా, సాయికృష్ణ లాకప్‌డెత్‌పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అంత్యక్రియలు చేశాక మాట మార్చిన పోలీసులు.. నాగ మహేష్ మరణంపై అక్కా.. చెల్లెళ్ల డిమాండ్స్
-
కృష్ణలంక సాయికృష్ణ కేసులో మరో ట్విస్ట్
-
సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వేసిన పిటిషన్లోనే హెబియస్ కార్పస్ అంశం పెట్టారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మితో సంతకం పెట్టించారు అడ్వకేట్.హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ పిటిషన్ ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ అడ్వకేట్ కనకదుర్గ ప్రశ్నించారు. పిటిషనర్‌కు తెలియకుండా సంతకం తీసుకున్నారని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.పిటిషన్ ఫైల్ చేసిన అడ్వకేట్‌కి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయవాది లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణను రేపటి(గురువారం)కి కోర్టు వాయిదా వేసింది. -
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్‌కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
పదేపదే పిటిషన్లతో ట్రయల్‌కు ఆటంకం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పదేపదే పిటిషన్లు వేస్తూ విచారణను అడ్డుకోవటాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తప్పుపట్టింది. ఇలాంటి పిటిషన్లతో ట్రయల్ మరింత ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదని.. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించిందని గుర్తు చేసింది. మరోసారి దర్యాప్తునకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యమవుతుందని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. సీబీఐ చేపట్టిన దర్యాప్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మరింత దర్యాప్తు జరిపించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని స్పష్టం చేస్తూ కొట్టివేసింది. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఒకసారి అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేసింది. సందేహాలతో అవే అంశాలపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశాలివ్వడం చట్టపరంగా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తు ఎలా సాగాలనే విషయాన్ని న్యాయస్థానం నిర్దేశించలేదని పేర్కొంటూ సునీత అభ్యర్థనను తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు సరిగా చేయలేదని, ఇటీవల దాఖలు చేసిన చార్జీషీట్‌ను అనుమతించవద్దంటూ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఉద్దేశాన్ని సీబీఐ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు విచారణ చేపట్టారు. అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ, సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేసి.. శుక్రవారం వెల్లడించారు.మళ్లీ దర్యాప్తు అనవసరం..సీబీఐ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. గతంలో కోర్టు నిర్దేశించిన అంశాలన్నింటినీ పరిశీలించి అదనపు దర్యాప్తు పూర్తి చేశామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కాల్ డేటా, సందేశాల సమయాలను ధృవీకరించామన్నారు. మునుపు అర్ధరాత్రి పంపినట్లు భావించిన సందేశాలు వాస్తవానికి భారత కాలమానం ప్రకారం ఉదయం 7.12 గంటలకు పంపినవేనని సాంకేతికంగా నిర్ధారించామని వివరించారు. అదనపు దర్యాప్తులో నలుగురు వ్యక్తులను విచారించామని, హత్యలో ఇతరుల ప్రమేయాన్ని సూచించే కొత్త ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేశారు. అందువల్ల మరింత దర్యాప్తు అవసరం లేదని, ట్రయల్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేసి మూడో సప్లిమెంటరీ తుది నివేదిక సమర్పించిన తర్వాత అదే అంశాలపై మళ్లీ దర్యాప్తు కోరడం చట్టబద్ధం కాదన్నారు.అనుమానాలతో పదేపదే పిటిషన్లు..నిందితుల తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఒకసారి కోర్టు ఆదేశాల మేరకు అదనపు దర్యాప్తు పూర్తయిందని, అదే అంశాలపై మరోసారి విచారణ కోరడం చట్టబద్ధం కాదన్నారు. తాజా మౌఖిక లేదా పత్ర ఆధారాలు లేకుండా.. కేవలం అనుమానాల ఆధారంగా పదేపదే దర్యాప్తునకు ఆదేశిస్తే అది రీ–ఇన్వెస్టిగేషన్ అవుతుందని, చట్టం అలాంటి ప్రక్రియను అనుమతించదని వాదించారు. సునీత ఇప్పటికే వివిధ కోర్టుల్లో ఒకే అంశంపై పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారని, ఒకవైపు రోజువారీ విచారణ జరపాలని కోరుతూ, మరోవైపు పదేపదే కొత్త పిటిషన్లతో ట్రయల్ ఆలస్యం చేస్తున్నారన్నారు. బాధితురాలికి దర్యాప్తు సంస్థపై పర్యవేక్షణ చేసే హక్కు లేదని, వ్యక్తిగత అభిప్రాయాలను అధికారులపై రుద్దలేరని వాదించారు. అన్ని పక్షాల నుంచి సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి.. దర్యాప్తు సంస్థ ఎలా విచారణ జరపాలి, ఎవరిని ఎలా ప్రశ్నించాలి, ఏ అంశాన్ని ఎలా నిర్ధారించాలనే విషయాలను తాము నిర్దేశించలేమని తేల్చిచెప్పారు. సందేహాలు మాత్రమే అదనపు దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడానికి సరిపోవన్నారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి అదనపు దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో, అదే అంశాలపై మళ్లీ విచారణ కోరడానికి చట్టం అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదంటూ సునీత పిటిషన్ కొట్టివేశారు.తీర్పులో పేర్కొన్న కీలక అంశాలివీ..1). ఇప్పటికే అదనపు దర్యాప్తు..ఈ కేసులో గతంలోనే కోర్టు సెక్షన్ 173(8) సీఆర్పీసీ కింద పరిమిత అంశాలపై అదనపు దర్యాప్తునకు సీబీఐని ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేస్తూ సీబీఐ మూడో సప్లిమెంటరీ నివేదిక దాఖలు చేసినందున అదే అంశాలపై మరోసారి అదనపు దర్యాప్తు కోరడం చట్టపరంగా నిలబడదు.2. ఇది చట్టబద్ధమైన ‘ప్రొటెస్ట్’ కాదుసునీత ఈ పిటిషన్‌ను సెక్షన్లు 190, 200 సీఆర్పీసీ కింద దాఖలు చేసినా, కొత్త నేరాలపై కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని కోరలేదు. ఆమె స్వయంగా సాక్ష్యమివ్వలేదు. సాక్షుల జాబితాను కూడా సమర్పించలేదు. దీనిని ప్రైవేట్ కంప్లైంట్ లేదా ప్రొటెస్ట్ పిటిషన్‌గా పరిగణించలేం.3. కొత్త ఆధారాలు లేవుగతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిర్వహించిన తర్వాత కొత్త నిందితులు, కొత్త సాక్ష్యాలు లేదా కొత్త ఆధారాలు వెలుగులోకి రాలేదు. కొత్త మెటీరియల్ లేకుండా మరోసారి దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం లేదు.4. మరింత దర్యాప్తు పేరిట రీ–ఇన్వెస్టిగేషన్..ఇప్పటికే పరిశీలించిన కాల్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, సందేశాలను మరో కోణంలో మళ్లీ పరిశీలించాలని ఆమె కోరుతున్నారు. ఇది వాస్తవానికి ‘ఫర్ధర్ ఇన్వెస్టిగేషన్’ కాకుండా ‘రీ–ఇన్వెస్టిగేషన్’ కోరినట్లే. అలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఈ కోర్టుకు అధికారం లేదు.5. దర్యాప్తు ఎలా చేయాలో చెప్పలేం..దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ సాక్షిని ఎలా విచారించాలి? ఏ కోణంలో దర్యాప్తు చేయాలి? ఎలాంటి నిర్ధారణకు రావాలనే విషయాలను కోర్టు నిర్దేశించలేదు. అలాంటి ఆదేశాలివ్వడం దర్యాప్తు సంస్థ అధికార పరిధిలో జోక్యం చేసుకున్నట్లవుతుంది.6. గత ఆదేశాల పరిధిని విస్తరించలేంగతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు కిరణ్ యాదవ్, అర్జున్‌రెడ్డి మధ్య జరిగిన సందేశాల పరిశీలనకే పరిమితం. తాజా పిటిషన్ ద్వారా ఆ పరిధిని విస్తరించి మరిన్ని అంశాలపై విచారణ జరపాలని కోరడం సబబుకాదు.7. నిరవధికంగా విచారణా..?క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదు. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించింది. మరోసారి దర్యాప్తు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యమవుతుంది. -
హనీమూన్ హత్య కేసులో సోనమ్‌కు బిగ్ షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్‌ను గురువారం రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్‌పై సుప్రీం కోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇండోర్‌కు చెందిన సోనమ్ రఘువంశీ.. 2025 మేలో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. అక్కడే వీరిద్దరూ అదృశ్యం కాగా.. కొద్ది రోజుల తర్వాత రాజా మృతదేహం ఓ లోయలో లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా రాజా హత్య వెనుక సోనమ్ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. తన తండ్రి దగ్గరే పని చేసే ప్రియుడి రాజ్ కుశ్వాహాతో కలిసి ఆమె ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరూ.. సుపారీ గ్యాంగ్‌తో కలిసి రఘువంశీని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. బెయిల్ ఎలా వచ్చింది?ఈ కేసులో సోనమ్‌కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.విచారణకు ఆటంకం కలిగే అవకాశంజస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. ప్రస్తుత దశలో సోనమ్ బెయిల్‌పై బయట ఉండటం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విచారణ వేగంగా కొనసాగకపోతే ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.సోనమ్ వాదనతనపై అభియోగాలను సోనమ్ ఖండించింది. తాను నిర్దోషినని, కేసు పూర్తిగా పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలపైనే ఆధారపడి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం ఆరోపణల ఆధారంగా తనను దోషిగా చూడలేమని కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా.. బెయిల్‌ను రద్దు చేస్తూ మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మేఘాలయా హనీమూన్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
మీ బతుకంతా ఇంతేనా...? కాదంబరిని కావాలనే ఇరికించారా..?
-
బిగ్ ట్విస్ట్.. ఛార్జ్ షీట్ లో బయటపడ్డ జత్వానీ కీ పాయింట్స్..
-
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు పూటకో మలుపు
-
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్
-
ట్రైనీ IPS ఉదయ్ కేసులో కీలక మలుపు
-
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున పొన్నవోలు ఫిర్యాదు చేశారు.డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను ఏ–1గా పేర్కొన్న పిటిషనర్.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబును ఏ–2గా, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ ఎం.మానసను ఏ–3గా చేర్చారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అదృశ్యం, మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు.టాస్క్‌ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున కమిషనర్‌కు అరెస్టు విషయం తెలియదనడం సాధ్యం కాదని వాదన. సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకుని మే 9 వరకు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. జూన్ 15న హైకోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు.హైకోర్టుకు ఇచ్చిన సమాచారం, సీఐ రిమాండ్ రిపోర్టులోని వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదన. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహాని అనుమానాలపై డీజీపీ, కమిషనర్‌కు ఈ–మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. సమాచారం అందినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సాయి కృష్ణను రక్షించేందుకు చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వక మౌనం వల్ల సాక్ష్యాలను మాయం చేసేందుకు, నిందితులను కాపాడేందుకు అవకాశం కలిగిందని పిటిషన్లో ఆరోపించారు.పోలీస్‌స్టేషన్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్‌ల మార్పు, ఫుటేజీ మాయం అంశాలపైనా పిటిషన్లో ప్రస్తావించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్‌ఫోన్‌తో నకిలీ ఆధారాలు సృష్టించడం సంస్థాగత కుట్రలో భాగమని పిటిషనర్ పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు, డైలీ స్టేటస్ రిపోర్టులు, అధికారుల రోజువారీ సమావేశాల ద్వారా అక్రమ నిర్బంధ సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుందని పిటిషన్లో వాదన. ఇది కేవలం కిందిస్థాయి పోలీసుల చర్య కాదని, ఉన్నతస్థాయి కుట్ర–కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.సిట్ దర్యాప్తు కిందిస్థాయి పోలీసులకే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని పేర్కొన్న పిటిషనర్.. డీజీపీ, కమిషనర్, ఏసీపీపై హత్య, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, అధికార దుర్వినియోగం, సాక్ష్యాల మాయం అభియోగాలు ఉన్నాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61, 49, 103, 127(3), 198, 238తో పాటు సెక్షన్ 3(5) కింద చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన చర్యలు కావని, అందువల్ల విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్ వాదన. పోలీస్ కస్టడీలో కొట్టడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ఫిర్యాదుదారు ఉదహరించారు.ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుతోపాటు ప్రైవేట్ ఫిర్యాదును కలిపి విచారించేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 233ను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కేసులో డీజీపీ నుంచి కిందిస్థాయి పోలీసుల వరకు మొత్తం పాత్రను వెలికితీయాలని పిటిషన్ వేశారు. ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనే సూత్రాన్ని అమలు చేయాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, కమిషనర్, ఏసీపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. -
ఆ తల్లి పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి కారణం..! CI నాగరాజును లేపేస్తే కేసు ఉండదు అని...!
-
సాయి కృష్ణతోనే పెంచులయ్యని చంపించి.. అడ్వకేట్ రజిని విస్తుపోయే నిజాలు
-
సాయికృష్ణ కేసుపై న్యాయవాదుల సంచలన వ్యాఖ్యలు..
-
గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయలక్ష్మి తప్పుకున్నా.. మేం పోరాటం చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ సాయం వద్దంది. కేసు నుంచి ఆమె తప్పుకున్నా.. నేను పోరాడుతా’’ అంటూ కనకదుర్గ స్పష్టం చేశారు.మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారు. నాక్కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల వల్ల అడ్వకేట్స్ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకుని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయికృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా..నేను పిన్నిగా సాయికృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం’’ అని కనకదుర్గ తెలిపారు. -
ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు
సాక్షి,నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కావలి మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక ఘోర దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు, బాధితుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కావలి మండలానికి చెందిన వాసు అనే యువకుడిపై నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వాసు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో నెల్లూరు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు.తమ కుమారుడిపై అన్యాయంగా దాడి జరిగిందని, నిందితులను శిక్షించాలని కోరుతూ బాధితుడి తల్లి, బంధువులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, బాధితుల పట్ల బాధ్యతగా నడుచుకోవాల్సిన పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించడం గమనార్హం. గత నాలుగు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడినా, కావలి రూరల్ పోలీసులు ఆ సాక్ష్యాన్ని సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కావాలనే నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు బాధితుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. -
దొరికిన సైకో కిల్లర్..!
-
రావణ్ పై ఉపా కేసు.. ఆధారాలతో నిరూపించకపోతే కోర్టులో జరిగేది ఇదే
-
టీసీఎస్ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!
నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్‌కు నాసిక్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్ కావాలని ఆమె వేసిన పిటిషన్‌ను నాసిక్ రోడ్ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. జులై 6న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.నిదా ఖాన్ బెయిల్ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్‌లో అసోసియేట్‌గా పనిచేసిందని పేర్కొన్నారు.జైలులో ప్రసవం వేదన భరించలేనిది..బెయిల్ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.టీసీఎస్ కేసులో ఆరోపణలు ఏమిటి?నాసిక్‌లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్‌కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.టీసీఎస్ వివరణఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎట్టపరిస్థితుల్లో భయపడేది లేదని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు (గురువారం) గుంటూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అమరావతి రైతులను పరామర్శించడానికి వెళితే టీడీపీ నాయకులు తమపై దాడి చేశారని దానిపై పోలీసుల వద్దకు వెళితే కనీసం తమ ఫిర్యాదులను కూడా తీసుకోవడం లేదన్నారు.టీడీపీ నేతలే తమపై దాడిచేసి తిరిగి వారే వైఎస్సార్సీపీ నాయకులపై కేసు పెట్టారన్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మెుండితోక అశోక్ ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కానిస్టేబుల్‌పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదని అతనిపై దాడి చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకం పెరిగి పోయిందని పోలీస్ స్టేషన్లలోనే హత్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు. -
సాయి కృష్ణని ఎక్కడైతే చంపాడో అక్కడే CI నాగరాజు విచారణ
-
DSP భీమ్ రెడ్డి డైరీలో సినీ హీరో పేరు?
-
జగన్ దెబ్బకు పోలీసుల్లో కదలిక.. క్రాంతి కుమార్ కేసులో కొత్త మలుపు!
-
నా అనుభవంతో చెప్తున్నా.. ఎవ్వరు తప్పించుకోలేరు.. సాయి కృష్ణ కేసులో వచ్చే తీర్పు ఇదే
-
ఆయన ఫోన్, ల్యాప్ టాప్ ఏం చేసారంటే.. అడ్వకేట్ జనార్దన్ షాకింగ్ నిజాలు
-
CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా
-
గన్నవరంలో రావణపై పెట్టిన కేసు దారుణం ఉరిశిక్ష పడే సెక్షన్లు..
-
టెర్రస్ మీద సాయి కృష్ణ ను కాలిస్తే.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అడ్వకేట్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ తల్లిని చంపేందుకు జైలు నుంచే CI మర్డర్ ప్లాన్
-
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: క్రాంతికుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్ ఆత్మహత్యపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. క్రాంతికుమార్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు.. ఫోన్ ఇవ్వాలంటూ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ అందజేయనున్నారు. కాగా, దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది.లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
గాదె సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్‌డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బూడిదైనా ఇప్పించాలని.. లేకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానన్నారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని.. లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న సాయికృష్ణ తల్లి.. విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నన్ను చంపాలనే కుట్ర జరుగుతుంది. మేము కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు. నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా?. కేసు వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. అందుకే ఇలా చంపారు. నా కొడుకుని తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మెజిస్టీరియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు. కేసు విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. -
గోవాలో CI నాగరాజు ఫోన్.. పోలీస్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు..
-
సాయికృష్ణ కేసు.. సిట్ లంచ్‌మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో కస్టడీ విచారణకు బ్రేక్ పడింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత సీఐని సిట్ కస్టడీకి తీసుకోనుంది. తదుపరి విచారణ ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది. నాగరాజు అరెస్టు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించడం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తనను సిట్ ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే న్యాయమూర్తికి సీఐ నాగరాజు చెప్పిన సంగతి తెలిసిందే.కాగా, సిట్ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు.సాయికృష్ణ కేసులో తనను సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు. -
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
-
స్టేషన్ టెర్రస్ పై సాయికృష్ణ ఎముకలు, బూడిద..
-
ఇంటి పక్కనే ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావ్ చంద్రబాబు
-
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
సీఐని చంపేస్తారా..!? సాయికృష్ణ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
క్రిమినల్స్ అయితే ఎందుకు పిలిచి ముసలి కన్నీరు కార్చుతున్నావ్
-
ఆఫ్ట్రాల్ CI గాడివి.. క్రిమినల్ అయితే చంపేస్తావా..?
-
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.. సాయికృష్ణ కేసులో నోరు విప్పిన హెడ్ కానిస్టేబుల్స్
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్‌స్టేషన్‌లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్‌డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్‌డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్‌తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్‌లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్‌కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
సీఐ నాగరాజు మాస్టర్ స్కెచ్.. 32 టెరాబైట్స్ CCTV ఫుటేజ్ డిలీట్..
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
సాయికృష్ణ కేసు: హైకోర్టు విచారణ వేళ రాజకీయ మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్‌కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
ఇవాళ హైకోర్టు ముందుకు సాయికృష్ణ కేసు
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి..
-
రాముల వారి సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫార్మ్‌హౌస్‌లు?
లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్ స్టైల్‌పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి గ్రామంలో ఈ విషయమై పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో పోలీసులు ఇదివరకే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవకుష్ మిశ్రా ఉన్నారు. అయితే అనుకల్పే మాస్టర్‌మైండ్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అయోధ్య పరిసరాల్లోని ఆయన గ్రామాన్ని సందర్శించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య సమీపంలోని అతని గ్రామమైన బసవాకు పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లారు. ఇతరుల ఇళ్లతో పోలిస్తే అతని ఇల్లు చాలా విభిన్నంగా అత్యంత విలాసవంతమైనదిగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఆ విషయమై వారి ఇంటి పరిసరాల్లోని వ్యక్తులను విచారించగా ఒక్కసారిగా వారి ఆర్థిక స్థితిలో పెనుమార్పులు వచ్చినట్లు తెలిపారు.అంతేకాకుండా అనుకల్ప్ మిశ్రా ఇటీవల గ్రామం వెలుపల ఒక ఫార్మ్‌హౌస్ నిర్మించాడని గత ఏడాది అయోధ్యలో రూ. 65 లక్షలు వెచ్చించి ఒక ఇల్లు కొనుగోలు చేశాడని అతని వద్ద ఇప్పటికే ఒక వాహనం ఉండగా, కొత్తగా స్కొర్పియో ఎస్యూవీ బుక్ చేశాడని పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం వరకు ఆ కుటుంబం తీవ్రమైన "ఆర్థిక ఇబ్బందుల్లో" ఉండేదని, కానీ ఇప్పుడు వారికి ఎటువంటి లోటులేదని ఆర్థికంగా చాలా బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే అనుకల్ప్ ఒక ప్రసిద్ధ మత ప్రవచనకర్త (కథావాచక్) తో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడని అతని బంధువులు తెలిపినట్లు పేర్కొన్నారు.అనుకల్ప్ మిశ్రా నేపథ్యంఒక బ్యాంకు అవుట్సోర్సింగ్ టీమ్‌లో పనిచేసే మిశ్రా, దాదాపు మూడేళ్ల క్రితం రామాలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత అదే బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తన బావ లవకుష్ మిశ్రాను కూడా అదే టీమ్‌లోకి తీసుకువచ్చాడు.అయోధ్యలోని రుదౌలీ ప్రాంతానికి చెందిన లవకుష్ మిశ్రా ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతను కూడా ఇటీవల లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను కొనుగోలు చేసినట్లు పొరుగువారు తెలిపారు. -
సాయికృష్ణ కేసు కంచికే.. పోలీసులే పోలీసులపై విచారణ.. కృష్ణలంక క్రిమినల్స్
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు సన్నిహితుడు..
-
విజయవాడ సీపీపై సాయికృష్ణ తల్లి సంచలన కామెంట్స్
-
మాకు బాబుపై నమ్మకం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి...
-
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం..
-
హైకోర్టుకు సాయి కృష్ణ తల్లి.. ఖాకీలపై నమ్మకం లేదు.. సీబీఐకి ఇవ్వండి!
-
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
-
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
100 మంది ఉన్న పోలీసు స్టేషన్ లో సాయి కృష్ణను చంపడం ఒక్కరు కూడా చూడరా?
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
సాక్షి, విశాఖపట్నం: రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింహాచలంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్రీచరణ్ కుటుంబ సభ్యులను నిలదీసిన రాధా గాయత్రి కుటుంబ సభ్యులు.. శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమె తల్లి పట్టుబట్టింది. శ్రీచరణ్ ముస్సోరి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ గాయత్రి పెద్ద కర్మ వేదికగా వివాదం రాజుకుంది.శ్రీచరణ్ తల్లిదండ్రులను రాధాగాయత్రి తల్లిదండ్రులు, బంధువులు చుట్టుముట్టారు. శ్రీచరణ్ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. శ్రీచరణ్ వచ్చే వరకు అతడి తల్లిదండ్రులను విడిచిపెట్టేది లేదని రాధా గాయత్రి బంధువులు తేల్చి చెప్పారు. అందరి సమక్షంలో శ్రీచరణ్‌కు బంధువులు కాల్ చేయించగా.. ముస్సోరిలో విచారణాధికారిని కలిసిశానంటూ శ్రీచరణ్ చెప్పాడు. ఎంక్వైరీ ఆఫీసర్‌కు స్పాట్లోనే బంధువులు కాల్ చేయగా.. ఇంతవరకు శ్రీచరణ్ తనను కలవలేదంటూ విచారణాధికారి చెప్పినట్లు సమాచారం.కాగా,ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు కూడా నమోదు చేశారు. రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ కూడా వెలుగులోకి వచ్చింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. -
పెద్దలకు తెలిసే జరిగిందా..? సాయికృష్ణ కేసులో బిగుస్తున్న ఉచ్చు
-
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
-
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!
-
ఈ సిట్ మాకొద్దు.. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం
-
సాయికృష్ణ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందటే..?
-
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
-
CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు
-
గంగమ్మ లాకప్‌డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్‌పై దాఖలైన పిల్‌పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్‌లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్‌తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. CI నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..!
-
నాగరాజుతో డీల్..? పెద్దల పేర్లు సేఫ్ ..?
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
పేరు చెప్పొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..! సీఐ నాగరాజు కు బిగ్ ఆఫర్..
-
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే...
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు
-
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
-
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
-
పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..?
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?
-
లాకప్ డెత్ కేసులో రోజుకో మలుపు.. మలయాళం సినిమాను మించిన క్రైమ్ థ్రిల్లర్
-
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు మేకప్ వేస్తున్నారు
-
సాయి కృష్ణ ను ఎందుకు.. ఎవరు చంపారంటే? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్‌ని నియమించింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, హింసించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్‌డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం.. గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్‌ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
సాయి కృష్ణ కేసులో బిగ్ రివీల్.. బైక్ పై తీసుకెళ్లి దహనం చేసిన చోటు ఇదేనా..
-
గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ఐదేళ్లు లివిన్, ఇపుడు రేప్ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు
పరస్పర అంగీకారంతో కూడిన సుదీర్ఘ సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలకమైన తీర్పు నిచ్చింది. కేవలం పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నెరవేర్చలేదనే కారణంతో ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న దీర్ఘకాలిక శారీరక సంబంధాన్ని అత్యాచారం (Rape)గా పరిగణించ లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది సంజయ్ సరోజ్ అలియాస్ సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.కేసు నేపథ్యంపోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం 2014లో ప్రయాగ్‌రాజ్ వచ్చింది బాధిత యువతి. ఈ క్రమంలో దూరపు బంధువు, నిందిత యువకుడు చదువు, వసతి విషయంలో ఆమెకు సహాయం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ దగ్గరయ్యారు. 2019 దాకా దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అతను ముఖం చాటేశాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఇపుడు పెళ్లి మాట ఎత్తితే కొట్టి, బెదిరంపులకు పాల్పడుతున్నాడంటూ 2019లో ప్రయాగ్‌రాజ్‌లోని కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తన అశ్లీల వీడియో తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడని కూడా పేర్కొంది. 2020లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, 2021లో మేజిస్ట్రేట్ దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై ఉన్న క్రిమినల్ విచారణను కొట్టివేయాలని కోరాడు. కేసును, ఇరుపక్షాల వాదనలను విశ్లేషించిన అనంతరం, వారి సంబంధం చాలా సంవత్సరాలు, పరస్పర అంగీకారంతోనే సాగిందని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ నిర్ధారించింది.ఐదేళ్ల సుదీర్ఘ సంబంధాల తర్వాత , ప్రతిసారీ కేవలం పెళ్లి వాగ్దానం వల్లే ఆమె శారీరక సంబంధానికి అంగీకరించిందంటే విశ్వసించలేమని కోర్టు పేర్కొంది. వైద్య పరీక్షల్లో ఆమెపై ఎలాంటి గాయాలు ఉన్నట్లు తేలలేదనీ, ఇరువురి సమ్మతితోనే ఈ బంధం కొనసాగిందని కోర్టు అభిప్రాయపడింది. దీర్ఘకాలిక సంబంధాల్లో తేడాలొచ్చినపుడు, లేదా విఫలమై నప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు హెచ్చరించింది. ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఫిర్యాదుదారు తన పూర్తి అంగీకారంతో నిందితుడితో శారీరక సంబంధాలు ఏర్పరచు కున్నప్పుడు ఇది కేవలం పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం దెబ్బతినడం మాత్రమే కానీ, అత్యాచారం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా, నిందితుడిపై క్రిమినల్ విచారణను కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంటూ, అతనిపై ఉన్న అన్ని చట్టపరమైన విచారణలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అంతేకాదు ట్రయల్ కోర్టులోని కేసు ప్రొసీడింగ్స్ మొత్తాన్ని హైకోర్టు రద్దు చేసింది.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్‌లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్‌లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్‌కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్‌కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్‌ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్‌పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్‌పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్‌లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


