హైదరాబాద్: బాలిక ఆత్మహత్య కేసు నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో నివసించే బాలిక ప్రైవేట్ వీడియోలతో కొందరు బ్లాక్‌మెయిల్ చేయగా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతల్‌బస్తీకి చెందిన ఎం.మహేష్(20)ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన మహేష్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఏయే పథకాలకు డిమాండ్ ఉందంటే..


