సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం | Withdraws Habeas Corpus Petition In Saikrishna Case | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం

Jul 29 2026 6:43 PM | Updated on Jul 29 2026 7:08 PM

Withdraws Habeas Corpus Petition In Saikrishna Case

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వేసిన పిటిషన్‌లోనే హెబియస్ కార్పస్ అంశం పెట్టారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మితో సంతకం పెట్టించారు అడ్వకేట్.

హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ పిటిషన్ ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ అడ్వకేట్ కనకదుర్గ ప్రశ్నించారు. పిటిషనర్‌కు తెలియకుండా సంతకం తీసుకున్నారని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిటిషన్ ఫైల్ చేసిన అడ్వకేట్‌కి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయవాది లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణను రేపటి(గురువారం)కి కోర్టు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement